Bezawada Crime: అబ్బాయిలు బీకేర్‌ఫుల్‌.. పెళ్లికి కక్కుర్తి పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే…

Best Web Hosting Provider In India 2024

Bezawada Crime: అబ్బాయిలు బీకేర్‌ఫుల్‌.. పెళ్లికి కక్కుర్తి పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే…

Sarath Chandra.B HT Telugu Published Mar 14, 2025 12:09 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 14, 2025 12:09 PM IST

Bezawada Crime: బెజవాడలో కొత్త రకం మోసం వెలుగు చూసింది.పెళ్లి కాని ప్రసాదుల్ని టార్గెట్‌ చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. సినిమా కథల్లో మాదిరి, పిన్ని, బాబాయ్, మావయ్య, పెద్దమ్మ, పెదనాన్న అంటూ ఫేక్‌ ఫ్యామిలీలో పెళ్లి డ్రామాలు నడిపి అందిన కాడికి దోచుకుని పారిపోతున్నాయి.

చీటీల పేరుతో భార్యాభ‌ర్త‌ల భారీ మోసం
చీటీల పేరుతో భార్యాభ‌ర్త‌ల భారీ మోసం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Bezawada Crime:తెలుగు రాష్ట్రాలో ఓ తరానికి పెళ్లి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఏపీ, తెలంగాణల్లో కొన్ని కులాల్లో పెళ్లి చేసుకోడానికి ఆడపిల్లలు లేకపోవడంతో కులాంతర వివాహాలకు సైతం సై అంటున్నారు. దీంతో ఇదే అదనుగా నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతంతో పోలీసులు, న్యాయవాదులు తలలు పట్టుకున్నారు.

సినిమా స్టోరీని తలపించే క్రైమ్…

విజయవాడ శివార్లలోని గ్రామానికి చెందిన ఓ యువతికి నగరంలోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. వారికి మూడున్నరేళ్ల వయసు ఉన్న కుమార్తె కూడా ఉంది. కోవిడ్‌‌కు ముందు వరకు యువకుడు కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు చేసేవాడు. కోవిడ్‌ కు కొద్ది నెలల ముంద వ్యాపారాల్లో అంతగా లాభాలు రావడం లేదంటూ యువతి భర్తపై ఒత్తిడి చేసి దుస్తుల వ్యాపారం ప్రారంభించింది.

విజయవాడ శివార్లలోని కొండపల్లిలో ఏర్పాటు చేసిన దుస్తుల షోరూమ్‌ నిర్వహణ కోసం సొంత డబ్బుతో పాటు అధిక వడ్డీలకు అప్పులు చేశారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. ఈలోగా కోవిడ్‌ రావడంతో వ్యాపారం కాస్త దివాళా తీసింది. వ్యాపారాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. వ్యాపారం కోసం ఆమెకు అప్పులిచ్చిన కాల్ మనీ బ్యాచ్‌ గత ఏడాది జూన్‌లో డబ్బు కోసం ఓ కొత్త పథకం చెప్పి ఆమెను ఒప్పించారు.

వల వేసి… పెళ్లి చేసి…

విజయవాడలో ఆర్గనైజ్డ్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు కొంత కాలంగా పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నాయి. నల్గొండ జిల్లాలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడికి 30 దాటినా పెళ్లి కావడం లేదు. ఆంధ్రా, తెలంగాణలో ఎక్కడ అమ్మాయి ఉన్నా ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటానని బ్రోకర్లకు చెప్పాడు. సంబంధం కుదిరిస్తే రూ.5లక్షల కమిషన్ ఆఫర్ చేశాడు.

అది కాస్త విజయవాడలో ఆర్థిక నేరాలకు పాల్పడే ముఠాకు చేరింది. దీంతో అప్పుల పాలైన విజయవాడకు చెందిన వివాహితను పెళ్లి డ్రామాకు ఒప్పించారు. పెళ్లి చేసుకుని ఏదొక సాకు చెప్పి వచ్చేస్తే లక్షన్నర ఇస్తామని యువతిని ప్రలోభ పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని వారి ప్రతిపాదనకు యువతి సై అంది.

గత ఏడాది విజయవాడలోనే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. నల్గొండ యువకుడు తన బంధువులతో కలిసి రావడం, యువతి నచ్చడంతో పెళ్లికి సై అన్నాడు. యువతికి తల్లిదండ్రులు లేరని చెప్పడంతో ఎగిరి గంతేశాడు. గత ఏడాది జూన్‌లో నల్గొండలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లైన రెండు మూడు రోజులకు యువతి తనకు అప్పులు ఉన్నాయని చెప్పడంతో వాటిని తాను తీరుస్తానని చెప్పి రూ.7లక్షలు ఆమెకు ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు యువతి హైదరాబాద్ వెళ్లిపోయింది.

ట్విస్టుల మీద ట్విస్టులు…

హైదరాబాద్ వెళ్లిన యువతి తిరిగి నల్గొండలో ఉంటున్న భర్త దగ్గరకు రాక పోవడంతో అతను అనుమానించి ఆరా తీశాడు. దీంతో ఆమెకు అప్పటికే పెళ్లై నాలుగేళ్ల కుమార్తె కూడా ఉందని, భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలియడంతో తనతో కాపురానికి రావాలని ఆమెను ఒత్తిడి చేశాడు.

నల్గొండ యువకుడి దగ్గర లక్షలు వసూలు చేసిన యువతి ఆ తర్వాత మరో యువకుడు పరిచయం అయ్యాడు. విశాఖ నుంచి గంజాయి రవాణా చేస్తే మంచి కమిషన్ ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తూ కొద్ది నెలల క్రితం విశాఖ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. దీంతో రెండు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఆ యువతి కోసం ఆమె మొదటి భర్త, రెండో భర్త వెదుకులాట ప్రారంభించారు. ఈలోగా ఆమెకు అప్పులిచ్చిన కాల్‌మనీ ముఠా బెయిల్‌పై ఆమెను బయటకు తీసుకొచ్చింది.

యువతి కోసం ఇద్దరు భర్తల పోటీ…

ఈ క్రమంలో యువతి చేతిలో మోసపోయిన నల్గొండ యువకుడు పెళ్లి సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తుల్ని నిలదీయడంతో కొత్త డ్రామా మొదలైంది. మరోవైపు యువతి మొదటి భర్త తన భార్యను ఈ కేసు నుంచి కాపాడాలంటూ న్యాయవాదుల్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో యువతి వెనుక డ్రామా నడిపిన ముఠా ఇదే తరహాలో పెళ్లి కాని యువకుల్ని మోసం చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసే వారిని గుర్తించి పెళ్లి తంతు నడిపించడం ఆ తర్వాత ఏదొక వంకతో గొడవ పెట్టుకుని అందిన కాడికి తీసుకుని పారిపోవడం చేస్తున్నట్టు గుర్తించారు. పెల్లి కాకపోతే ఊళ్లో పరువు పోతుందని ముందు, వెనుక ఆరా తీయకుండా పెళ్లిళ్లు చేసుకుంటే ఆ తర్వాత పోలీసులు, కోర్టులు చుట్టూ తిరగాల్సి రావొచ్చు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

VijayawadaVijayawada FloodsCheatingFrauds
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024