Post Holi Skin Care: హోలి ఆడిన తర్వాత మీ చర్మం పొడిగా మారిందా? ఈ ఫేస్ ప్యాక్‌లు అప్లై చేయండి!

Best Web Hosting Provider In India 2024

Post Holi Skin Care: హోలి ఆడిన తర్వాత మీ చర్మం పొడిగా మారిందా? ఈ ఫేస్ ప్యాక్‌లు అప్లై చేయండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 14, 2025 12:30 PM IST

Post Holi Skin Care: హోలీ ఆడిన తర్వాత మీ చర్మం మరింత పొడిబారింత. ఇందుకు రసాయనాలతో కూడిన హోలీ రంగులు కారణం అయి ఉండచ్చు. బాధపడకండి ఈ ఫేస్ అప్లై చేశారంటే మీ చర్మం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. మరింత కాంతివంతంగా మారుతుంది.

హోలీ రంగుల కారణంగా పొడిబారిన చర్మం
హోలీ రంగుల కారణంగా పొడిబారిన చర్మం

హోలీ అంటేనే రంగుల పండుగ. ఈరోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా ఆటలు, పాటలతో గడిపే సమయం ఎంతో సంతోషాన్నిస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఏడాది హెలీ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. సమస్య ఏంటంటే.. హోలీ సందర్భంగా రంగులతో, రంగు నీటిలో హోలీ ఆడుకుంటున్నంత సేపు ఎలాంటి బాధ, భయం ఉండవు. కానీ తర్వాత మాత్రం చర్మం, కురుల విషయంలో కొంత చింతించాల్సి వస్తుంది.

హోలీ రంగు చర్మ సమస్యలను పెంచుతాయి. నీటి రంగులు మాత్రమే కాదు, కొన్నిసార్లు హెర్బల్ పొడి రంగుల వల్ల కూడా చర్మం ఎండిపోతుంది. దీనివల్ల ముఖం మరుసటి రోజు వరకు గరుకుగా అనిపిస్తుంది. మీరు సరిగ్గా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. హోలీ రంగుల కారణంగా పొడిబారిన మీ చర్మాన్ని మృదువుగా మార్చగల రెండు రకాల ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం, అప్లై చేసే పద్ధతులను గురించి ఇక్కడ తెలుసుకోండి.

పచ్చి పాలు, పసుపుతో ఫేస్ ప్యాక్

హోలీ రంగుల కారణంగా మీ చర్మం పొడిబారినప్పుడు పాలు మీకు చాలా చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి.

  • ఇందుకోసం మీరు పచ్చి పాలను తీసుకుని దాంట్లో చిటికెడు పసుపు వేసి రెండింటీనీ బాగా కలపండి.
  • ఇప్పుడు కాటన్ ప్యాడ్ సహాయంతో పసుపు కలిపిన పాలను శుభ్రంగా కడుక్కున మీ ముఖానికి అప్లై చేయండి.
  • ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 15నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరనివ్వండి.
  • ఆ తర్వాత కాటన్‌తో ముఖాన్ని తుడిచి గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోండి.
  • ఇలా రోజు చేయడం వల్ల మూడు రోజుల్లో మీ ముఖం సాధారణం స్థితికి చేరుకుంటుంది.

అంతేకాదు పాలు మీ ముఖం మీదున్న బ్యాక్టీరియాను, మృతకణాలను తొలగించి చర్మాన్ని మరింత కాంతివంతంగా మారుస్తాయి. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ గుణాలు చర్మాన్ని హోలీ రంగుల నుంచి రక్షించేందుకు సహాపడుతుంది.

బాదం, తేనెతో ప్యాక్:

  • బాదంలో సహజంగా నూనె ఉంటుంది. ఇది చర్మం పొడిబారిన సమస్య నుంచి మిమ్మల్ని కచ్చితగా కాపాడుతుంది.
  • ఇందుకోసం మీరు రెండు బాదం పప్పులను తీసుకుని పాలలో ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టండి.(రాత్రంతా నానితే మరీ మంచిది)
  • ఇలా చక్కగా నానిన బాదం పప్పులను ఒక మిక్సీ జార్ లో పేస్టులా తయారు చేసుకోండి.
  • ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో బాదం పప్పుల పేస్ట్ వేయండి. తర్వాత దీంట్లోనే తేనెను కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోండి.
  • ఈ పేస్ట్‌ను శుభ్రంగా కడుక్కున మీ ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
  • తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.

బాదంలోని సహజమైన నూనెను చర్మారోగ్యానికి కావలసిని తేమను అందించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అలాగే తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి మృదువుగా, తేమగా ఉంచుతుంది. అదనంగా మొటిమలు, మచ్చలు తగ్గించడానికి, చర్మం మెరిసిపోయేలా చేస్తుంది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024