






Best Web Hosting Provider In India 2024

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన డిజాస్టర్ మూవీ.. రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.22 కోట్ల కలెక్షన్లు.. చెప్పిన తేదీకి ముందుగానే..
OTT Movie: ఓటీటీలోకి మరో డిజాస్టర్ పొలిటికల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.22 కోట్లే వసూలు చేసింది.

OTT Movie: బాలీవుడ్ లో ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ సినిమాల్లో ఒకటి ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 17న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతంలో కంగన చెప్పినదాని కంటే మూడు రోజుల ముందే మూవీ డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
ఎమర్జెన్సీ ఓటీటీ స్ట్రీమింగ్
కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా శుక్రవారం (మార్చి 14) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కంగన కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ మూవీ సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.
“పవర్, ప్రమాదానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన కథ. ఎమర్జెన్సీని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.22 కోట్లే వసూలు చేసింది.
ఎమర్జెన్సీ మూవీ గురించి..
ఇండియాలో అత్యంత శక్తిమంతురాలైన మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో ఇందిర పాత్రలో కంగన నటించింది. అంతేకాదు తానే డైరెక్ట్ కూడా చేసింది.
ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఆ టైమ్‌లో ఇందిరపై ఎందుకు విమర్శలు వచ్చాయి? ఇందిరా గాంధీ ప్రభుత్వం పడిపోవడానికి ఆమె కొడుకు సంజయ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయన్న అంశాలను ఎమర్జెన్సీ మూవీలో కంగనా రనౌత్ చూపించింది.
ఎమర్జెన్సీ మూవీలో నటిగా మాత్రం కంగన అదరగొట్టింది. ఆమె లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇందిరాగాంధీని గుర్తు చేసింది. ఇందిర రోల్ కోసం కంగన పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అయితే తెలిసిన స్టోరీనే స్క్రీన్ పై ఆకట్టుకునేలా చూపించడంలో కంగన విఫలమైంది.
దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. వరుస డిజాస్టర్లు చూస్తున్న కంగనకు ఈ ఎమర్జెన్సీ మరో చేదు అనుభవాన్నే మిగిల్చింది. మరి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకుల ఎంతమేర ఆదరిస్తారన్నది చూడాలి.
సంబంధిత కథనం