Tirumala : తిరుమలలో ఘనంగా ‘కుమారధార తీర్థ ముక్కోటి’ – ప్రత్యేకత ఇదే..!

Best Web Hosting Provider In India 2024

Tirumala : తిరుమలలో ఘనంగా ‘కుమారధార తీర్థ ముక్కోటి’ – ప్రత్యేకత ఇదే..!

Maheshwaram Mahendra Chary HT Telugu Published Mar 14, 2025 08:08 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 14, 2025 08:08 PM IST

Kumaradhar Theertha Mukkoti at Tirumala :తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి వేడుక జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. వీరికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కుమారధార తీర్థముక్కోటిని దర్శించి… స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇందులో భాగంగా తీర్థానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర, మజ్జిగ, తాగునీరు అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారు.

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి… స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. కుమారధార సందర్భంగా మార్గంలో చేసిన ఏర్పాట్లను అన్న ప్రసాదం, ఆరోగ్య విభాగం, అటవీశాఖ, విజిలెన్స్, శ్రీవారి సేవ, పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు.

కుమారధార తీర్థ ప్రాశస్త్యం ఏంటంటే…?

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు.శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిని సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు శ్రీ కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

 

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

DevotionalDevotional NewsTtdTirumala
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024