






Best Web Hosting Provider In India 2024

Telugu OTT Releases: ఈ వీక్ ఓటీటీలో నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ – ఏ మూవీని…ఎందులో చూడాలంటే?
Telugu OTT Releases:ఈ వారం ఓటీటీలోకి నాలుగు తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో అఖిల్ ఏజెంట్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం మూవీ ఆహా ఓటీటీలో రిలీజైంది. మిగిలిన సినిమాలను ఏ ఓటీటీలో చూడాలంటే..

Telugu OTT Releases: ఈ వారం ఓటీటీలోకి నాలుగు తెలుగు సినిమాలు వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే మూడు సినిమాలు రిలీజ్ కాగా…గురువారం ఓ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలు ఏవంటే?
అఖిల్ ఏంజెట్ – సోనీ లివ్…
అఖిల్ ఏజెంట్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. సోనీలివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 14న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సోనీలివ్ ప్రకటించింది. కానీ ఒక రోజు ముందే గురువారం నుంచే ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఏజెంట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం గమనార్హం.
మమ్ముట్టి కీలక పాత్ర…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ మూవీలో మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఎనిమిది కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. కథతో పాటు సురేందర్ రెడ్డి టేకింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి.
బ్రహ్మా ఆనందం- ఆహా ఓటీటీ
టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం మూవీ ఆహా ఓటీటీలో రిలీజైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాతామనవళ్లుగా నటించడం గమనార్హం. స్వార్థపరుడైన తన మనవడిలో ఓ తాత ఎలా మార్పు తీసుకొచ్చాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. బ్రహ్మానందం మెయిన్ లీడ్‌గా నటించడంతో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ రొటీన్ కాన్సెప్ట్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.
రామం రాఘవం – ఈటీవీ విన్, సన్ నెక్స్ట్
టాలీవుడ్ కమెడియన్ ధనరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రామం రాఘవం మూవీ శుక్రవారం రెండు ఓటీటీలలో రిలీజైంది. ఈటీవీ విన్ ఓటీటీతో పాటు సన్ నెక్స్ట్‌లో రామం రాఘవం స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కిన ఈ మూవీలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు.
మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం రామం రాఘవం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది
పరాక్రమం – ఈటీవీ విన్ ఓటీటీ
బండి సరోజ్ కుమార్ హీరోగా నటించిన పరాక్రమం మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు సరోజ్‌కుమార్ దర్శకత్వం వహించాడు.
సంబంధిత కథనం