Zee Telugu Special: జీ తెలుగులో ట్రిపుల్ బొనాంజా.. టీవీలో 2 సూపర్ హిట్ సినిమాలు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్.. ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

Zee Telugu Special: జీ తెలుగులో ట్రిపుల్ బొనాంజా.. టీవీలో 2 సూపర్ హిట్ సినిమాలు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్.. ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu
Published Mar 14, 2025 12:57 PM IST

Zee Telugu Triple Bonanza This Weekend: జీ తెలుగు టీవీ ఛానెల్ ఈ వీకెండ్‌కు త్రిపుల్ బొనాంజా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. టీవీలో రెండు సూపర్ హిట్ సినిమాలతో పాటు ఒక హోలీ స్పెషల్ ఈవెంట్‌ను ప్రసారం చేయనుంది. మరి వాటి ప్రీమియర్ డేట్, టైమింగ్స్ ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

జీ తెలుగులో ట్రిపుల్ బొనాంజా.. టీవీలో 2 సూపర్ హిట్ సినిమాలు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్.. ఎప్పుడంటే?
జీ తెలుగులో ట్రిపుల్ బొనాంజా.. టీవీలో 2 సూపర్ హిట్ సినిమాలు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్.. ఎప్పుడంటే?

Zee Telugu Special: వారం వారం సరికొత్త సినిమాలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం (మార్చి 16) అదిరిపోయే లైనప్​తో వచ్చేస్తోంది. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదయం 9 గంటలకు టీవీ ప్రీమియర్ కానుంది.

విక్టరీ వెంకటేష్​, సూపర్​స్టార్​ మహేశ్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 2013లో విడుదలై మెగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఆల్​టైమ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా రికార్డులు సృష్టించింది.

మరోసారి జీ తెలుగులో

రీ రిలీజ్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ మార్చి 8న మరోసారి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఆదివారం (మార్చి 16) ఉదయం 9 గంటలకు జీ తెలుగులో మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రసారం కానుంది.

ఈ సినిమాతోపాటు హోలీ స్పెషల్ మెగా ఈవెంట్ అక్కడ అమ్మాయిలు-ఇక్కడ అబ్బాయిలు మధ్యాహ్నం 12:30 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు డియర్ బ్రదర్ టెలివిజన్​ ప్రీమియర్​ను అందించేందుకు సిద్ధమైంది జీ తెలుగు ఛానెల్. హోలీ వేడుకల్లో భాగంగా జీ తెలుగు మార్చి 9న నరసరావు పేటలో అక్కడ అమ్మాయిలు-ఇక్కడ అబ్బాయిలు పేరున మెగా ఈవెంట్​ నిర్వహించింది.

కాలేజీ గ్రౌండ్‌లో

నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ క్రికెట్ గ్రౌండ్‌లో అభిమానుల కోలాహంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్​ ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించగా దీప్తి మన్నె-దర్శ చంద్రప్ప, ప్రీతి శర్మ-పృథ్వీలతో పాటు ఇతర జీ తెలుగు నటీనటులు హాజరై సందడి చేశారు.

అలాగే, మ్యాడ్ స్క్వేర్ సినిమా హీరోలు నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్​తోపాటు అక్కడ అమ్మాయి‌‌ ఇక్కడ అబ్బాయి హీరో హీరోయిన్​ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి ఈ వేడుకలో పాల్గొన్నారు. కమెడియన్ సద్దాం, సింగర్​ యశస్వి ప్రేక్షకులను అలరించారు. రంగులు, సంగీతం, ఆనందంతో నిండిన ఈ వేడుక అభిమానులకు తమ అభిమాన తారలను కలిసే అవకాశం అందించింది.

డియర్ బ్రదర్ టీవీ ప్రీమియర్

అంతేకాకుండా జయం రవి, ప్రియాంక అరుల్ మోహన్​ జంటగా నటించిన డియర్ బ్రదర్ సినిమాను ​టెలివిజన్​ ప్రీమియర్​గా అందిస్తోంది జీ తెలుగు. కుటుంబ కథాచిత్రంగా రూపొందిన ఈ సినిమాలో భూమిక చావ్లా, రావు రమేష్, నటరాజన్ సుబ్రమణ్యం, విటివి గణేష్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఎం.రాజేష్ దర్శకత్వంలో స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్‌టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. ఇలా రెండు సినిమాలు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్‌తో జీ తెలుగు ట్రిపుల్ బొనాంజా వినోదం అందించనుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024