



Best Web Hosting Provider In India 2024

Trick to Fall Asleep Fast: నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా? ఈ సీక్రెట్ హ్యాక్‌తో గాఢనిద్రలోకి జారుకోవడం ఖాయం!
Trick to Fall Asleep Fast: నిద్రపట్టాలని ఎదురుచూస్తూ గంటల పాటు బెడ్ మీదనే సమయం గడిపేస్తున్నారా..? ఇటువంటి సమస్య పడుతున్న వారు, ఈ సీక్రెట్ హ్యాక్ ట్రై చేశారంట కొన్ని క్షణాల్లో నిద్రపట్టడం ఖాయం. మనస్సును ప్రశాంతపరిచి వేగంగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.

నిద్ర సరిపోకపోవడం అనేది బయటకు చెప్పుకోలేని సమస్య. చాలా మంది ఇదే ఇబ్బందితో బాధపడుతుంటారు. బెడ్ మీదకు వెళ్లిన కొద్ది గంటల తర్వాత గానీ, వారికి నిద్రపట్టదు. మీకు కూడా ఈ సమస్య కొన్ని సందర్భాల్లో కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత రోజు మీరు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి చూస్తే నిద్ర ఎంత ముఖ్యమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా కొన్ని రోజుల పాటు నిద్రలేకుండా గడిపితే, దీర్ఘకాలిక నిద్రలేమి మన ఆరోగ్యం, శ్రేయస్సుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే, మీ మనసును ప్రశాంతపరచి మంచి రాత్రి నిద్ర పొందాలి. దీని కోసం ఈ చిట్కాలు, ఉపాయాలు పాటించి చూడండి. ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిందే.
వెనుకకు లెక్కించే సింపుల్ ట్రిక్:
అంకెల లెక్కింపుపై దృష్టి పెట్టడం ద్వారా మీకు నిద్రలేకుండా చేసే ఆలోచనల నుంచి, ఆందోళనల నుంచి మనస్సును దూరంగా ఉంచుకోగలుగుతారని వైద్యులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఉపయోగించే టెక్నిక్ ఇదేనట. కాకపోతే, మీరు అనుకున్నట్లు ముందు నుంచి వెనుకకు కాదు. వెనుక నుంచి మొదటికి రావడం. అంటే, 1 నుంచి 100 అంకెలు లెక్కపెట్టడం కాకుండా, 100 నుంచి 1 వరకూ లెక్కపెట్టగలడం. ఈ సీక్రెట్ హ్యాక్ అంటే, 100 నుంచి వెనక్కి లెక్కపెట్టుకునే సరికి 70, 60 లేదా 50కి వచ్చేసరికి గాఢనిద్రలోకి వెళ్లిపోతారట. కాకపోతే ప్రతి సంఖ్య లెక్కపెట్టేంత సేపు దాని మీదనే ధ్యాస ఉంచాలి. పైగా, ప్రతి సంఖ్య పూర్తయిన తర్వాత నెమ్మెదిగా గాలి వదిలి పీల్చుకోవాలి.
అయితే, మీరు ఇలా వెనక్కి కౌంట్ చేసుకునేటప్పుడు, ఆ ట్రాక్ లో సంఖ్య మర్చిపోతే, చింతించకండి. అలా అని మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన సంఖ్యతో మొదలుపెట్టండి. మళ్లీ కౌంట్ డౌన్ చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా, ఆలోచనలు రిపీట్ చేయకుండా చేస్తుంది. దీన్ని ప్రయత్నించి, మరుసటి రోజు ఫలితాన్ని మీరే గమనించండి.
సులభంగా, వేగంగా నిద్రపట్టడానికి మరిన్ని టిప్స్:
ఒకే టైమ్‌కి నిద్ర:
ప్రతిరోజూ సాయంత్రం నిద్రపోవడానికి ఒకే సమయాన్ని కేటాయించుకోండి. కొద్దిరోజులు ఇబ్బందిపడినా క్రమంగా అదే సమయాన్ని అలవాటుగా మార్చుకోండి.
నిద్రపోవడానికి ముందు కాఫీ:
- నిద్రపోవడానికి మూణ్నాలుగు గంటల ముందే కాఫీ, టీ వంటి కెఫైన్ ఉండే పదార్థాలను దూరం పెట్టాలి.
- వేడి పాలు లేదా, నూనె వేసి కాల్చిన చపాతీ లాంటివి హార్మోనల్ పనితీరు మెరుగుపరిచి త్వరగా నిద్రపట్టేందుకు సహకరిస్తుంది.
తేలికైన వాతావరణం సృష్టించుకోండి:
- నిద్రపోవడానికి అనువైన వాతావరణం ఏర్పరచుకోండి.
- సున్నితమైన సంగీతం వినండి.
- ఎల్ఈడీ స్క్రీన్లకు దూరంగా ఉండండి.
శరీర వ్యాయామం
రోజూ వ్యాయామం చేయడం వల్ల నిద్రలోకి ప్రశాంతంగా జారుకుంటారు. మెలటోనిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా ప్రశాంతమైన నిద్రపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.