Janasena Jayakethanam Sabha : ‘కూటమిని నిలబెట్టాం…. జయకేతనం ఎగరేశాం’ – జనసేన అధినేత పవన్ కల్యాణ్

Best Web Hosting Provider In India 2024

Janasena Jayakethanam Sabha : ‘కూటమిని నిలబెట్టాం…. జయకేతనం ఎగరేశాం’ – జనసేన అధినేత పవన్ కల్యాణ్

Maheshwaram Mahendra Chary HT Telugu Published Mar 14, 2025 09:25 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 14, 2025 09:25 PM IST

Janasena Formation Day Sabha : దేశమంతా తల తిప్పి చూసేలా వందశాతం విజయంతో ఘన విజయం సాధించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడిన ఆయన… అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్ అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచామని వ్యాఖ్యానించారు.

జయకేతనం సభలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్
జయకేతనం సభలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

పిఠాపురంలో చిత్రాడ వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు జనసైనికులు భారీగా హాజరయ్యారు. దీంతో చిత్రాడ అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…. పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్యులు, కొండగట్టు అంజన్నతో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేర్లను ప్రస్తావిస్తూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

జయకేతనం ఎగరవేస్తున్నాం – పవన్ కల్యాణ్

“ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్ అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచాం. దేశమంతా తల తిప్పి చూసేలా వందశాతం విజయంతో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమిని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

“ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోయే స్థితిలో ఉన్న నాకు కొండగట్టు అంజన్న దయ, నన్ను ప్రేమించే అభిమాన అన్నదమ్ముల దీవెనలతో నాకు పునర్జన్మను ఇచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా హృదయపూర్వక వందనాలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్య దేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ భీంలు మా జనసేన వీర మహిళలు. రంగులు, ఉత్సాహం తో మైత్రిని పంచే పండుగ హోలీ. చెడు పోయి మంచి వచ్చింది అని రంగులు చల్లుకునే పండుగ హోలీ. మన జయకేతనం ఎగురవేసిన రోజున హోలీ కూడా రావడం యాదృశ్చికం కాదు… ఆ భగవంతుడి నిర్ణయం” అని పవన్ కల్యాణ్ చెప్పారు.

“నా సినిమాల పేర్లు ఎందుకు అరవొద్దు అంటానంటే… ఏదో తక్కువ చెయ్యాలి అని కాదు. 463 మంది జనసైనికులు సినిమాల కోసం కాదు సిద్ధాంతాల కోసం పాటుపడుతూ చనిపోయారు. వారి గౌరవం మనం కాపాడాలి. ఆవిర్భావ దినోత్సవం వేళ కూటమిలోని టీడీపీ, బీజేపీ పక్షాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ పేర్కొన్నారు.

టీడీపీని నిలబెట్టాం…

‘‘మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు. మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్‌ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించాం’’ అని పవన్‌ వివరించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Pawan KalyanJanasenaAndhra Pradesh NewsPithapuram Assembly Constituency
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024