






Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఈవారం ఓటీటీల్లో సినిమాల జాతర.. స్ట్రీమింగ్‍కు వచ్చిన 10 చిత్రాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో ఉందంటే!
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు క్యూ కట్టేశాయి. ఏకంగా 10 పాపులర్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. వివిధ భాషల్లో, డిఫరెంట్ జానర్లలో చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. ఈ వీక్ టాప్ ఓటీటీ మూవీ రిలీజ్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ఓటీటీల్లో కొత్త చిత్రాలు చూడాలనుకుంటున్న వారికి ఈ వారం జాతరే. ఏకంగా 10 సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో.. విభిన్నమైన జానర్లలో చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ, ఎమోషనల్ సహా మరిన్ని జానర్లలో మూవీ అడుగుపెట్టాయి. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
పొన్మన్
బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన పొన్మన్ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఈ వారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ డార్క్ కామెడీ మూవీ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జోతిష్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది.
ఏజెంట్
తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ ఈ వారమే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. సుమారు థియేటర్లలో రిలీజైన 23 నెలలకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఏజెంట్ మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
ఎమర్జెన్సీ
కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ఎమర్జెన్సీ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. 1971లో భారత్‍తో ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామా మూవీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర పోషించారు కంగన. ఈ చిత్రం భారీ ప్లాఫ్‍గా నిలిచింది. ఈ మూవీకి కంగననే దర్శకత్వం వహించారు. నెట్‍ఫ్లిక్ ఓటీటీలో హిందీ స్ట్రీమ్ అవుతోంది.
హత్య
తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హత్య’ ఈ వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది, తెలుగు, తమిళంలో స్ట్రీమ్ అవుతోంది. ఏపీలో జరిగిన ఓ రాజకీయ హత్య స్ఫూర్తిగా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో రవివర్మ, ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్ లీడ్ లోల్స్ చేయగా.. శ్రీదివ్య బసవ దర్శకత్వం వహించారు.
రామం రాఘవం
రామం రాఘవం చిత్రం ఈ వారం తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీకి జబర్దస్త్ ధనరాజ్ దర్శకత్వం వహించారు. ధనరాజ్‍తో పాటు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. రామం రాఘవం చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కించుకోలేకపోయింది. తెలుగులో ఈటీవీ విన్‍లో, తమిళంలో సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.
బీ హ్యాపీ
బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బీ హ్యాపీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో ఈ మూవీని డైరెక్టర్ రెమో డిసౌజా తెరకెక్కించారు.
త్రయం
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం త్రయం ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్ లీడ్ రోల్స్ చేశారు. ఐదు స్టోరీలతో సాగే ఈ చిత్రానికి సంజీత్ చంద్రసేనన్ దర్శకత్వం వహించారు.
వనవాస్
వనవాస్ చిత్రం జీ5 ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించగా.. అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. హిందీలో ఈ చిత్రం జీ5లో స్ట్రీమ్ అవుతోంది.
రేఖాచిత్రం
రేఖాచిత్రం మూవీ తెలుగు వెర్షన్ ఈ వారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సోనీ లివ్‍లో గత వారమే వచ్చింది. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ఇప్పుడు ఆహాలోనూ అందుబాటులోకి వచ్చింది. జనవరిలో థియేటర్లలో రిలీజైన రేఖాచిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది.
2కే లవ్‍స్టోరీ
రొమాంటిక్ కామెడీ మూవీ 2కే లవ్‍స్టోరీ ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ తమిళ చిత్రంలో జగవీర్, మీనాక్షి గోవిందరాజన్ హీరోహీరోయిన్లుగా చేశారు. థియేటర్లలో రిలీజైన నెలలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత కథనం