






Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 9 సినిమాలు.. ఈ 5 మిస్ అవ్వొద్దు.. బోల్డ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఎక్కడ చూడాలంటే?
OTT Movies Release In Telugu This Week: ఓటీటీలోకి ఈ వారం 20కిపైగా సినిమాలు అలరించేందుకు వచ్చాయి. వాటిలో మొత్తంగా 9 సినిమాలు తెలుగులో భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. బోల్డ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు ఉన్న 9 సినిమాల్లో ఈ 5 మూవీస్‌ను ఏమాత్రం మిస్ అవ్వొద్దు. అవేంటీ, ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకుందాం.

OTT Releases Telugu This Week: ఓటీటీలోకి ఎవ్రీ వీక్ సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తాయని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ వారం కూడా దాదాపుగా 20కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో కొన్ని స్ట్రైట్ తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. బోల్డ్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
హత్య (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 13
బీ హ్యాపీ (తెలుగు డబ్బింగ్ హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మోనా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14
పొన్మన్/పోన్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- మార్చి 14
ఏజెంట్ (తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 13
పరాక్రమం (తెలుగు బోల్డ్ యాక్షన్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 13
రామం రాఘవం (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ అండ్ సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 14
రేఖాచిత్రం (తెలుగు వెర్షన్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- మార్చి 14
మెర్సీ కిల్లింగ్ (తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- బుక్ మై షో ఓటీటీ- మార్చి 14
ఓటీటీ తెలుగు సినిమాలు
ఇలా మార్చి 13, మార్చి 14 రెండు రోజులు కలిపి తెలుగు భాషలో 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూడాల్సిన బెస్ట్ సినిమాలుగా 5 ఉన్నాయి. ఏమాత్రం మిస్ అవ్వకూడని జాబితాలో ఉన్న సినిమాల్లో ముందుగా చెప్పుకునే మూవీ పొన్మన్. తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా అయిన పొన్మన్ ఓటీటీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.
పరాక్రమం ఓటీటీ
తెలుగులో బోల్డ్ యాక్షన్ డ్రామా సినిమాగా తెరకెక్కిన మూవీ పరాక్రమం. బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమాపై లుక్కేయొచ్చు. సమాజంలోని చాలా అంశాలను రా అండ్ బోల్డ్‌గా తనదైన స్టైల్‌లో చిత్రీకరిస్తాడు. కాబట్టి, పెద్దలకు మాత్రం పరాక్రమం మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు.
ఏజెంట్ ఓటీటీ
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మూవీ ఏజెంట్. అఖిల్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ థియేట్రికల్ రిలీజ్ అనంతరం దాదాపు రెండేళ్లకు ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రకటించిన రిలీజ్ డేట్‌కు ఒకరోజు ముందుగానే ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మరో రెండు
ఈ మూడింటితోపాటు చూడాల్సిన మరో రెండు సినిమాలు తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ హత్య, తండ్రీకొడుకుల బాండింగ్ చెప్పే తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం రామం రాఘవం. ఇలా ఏమాత్రం మిస్ అవ్వకూడని ఈ ఐదు సినిమాలతోపాటు టైమ్ ఉంటే మిగతా ఇంట్రెస్టింగ్ మూవీస్‌ను కూడా ఎంచక్కా చూసేయొచ్చు.
సంబంధిత కథనం