






Best Web Hosting Provider In India 2024

Court Day 1 Collections: కోర్ట్ చిత్రానికి తొలి రోజు అంచనాలకు మించి కలెక్షన్లు.. ప్రియదర్శికి రికార్డ్
Court Day 1 Box office Collections: కోర్ట్ సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్ దక్కించుకుంది. అంచనాలకు మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. ఆ వివరాలు ఇవే..

ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ చిత్రంపై మొదటి నుంచే మంచి హైప్ ఉంది. నేచురల్ స్టార్ నాని ఈ మూవీకి నిర్మాత కావడమే ఇందుకు కారణం. అందులోనూ ఈ మూవీ ప్రమోషన్లలో నాని స్పీచ్‍లు మరింత అంచనాలు పెంచాయి. కోర్ట్ సినిమా శుక్రవారం (మార్చి 14) థియేటర్లలో రిలీజైంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి అంచనాలకు మించి తొలి రోజు కలెక్షన్లు దక్కాయి.
అదిరిపోయే ఓపెనింగ్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా
కోర్ట్ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ప్రీమియర్లతో కలిపి ఈ లెక్క వచ్చింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మార్చి 15) అధికారికంగా వెల్లడించింది. “కోర్ట్ సినిమాకు బ్లాక్‍బస్టర్ తీర్పు వచ్చేసింది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు కోర్టు చిత్రం రూ.8.10 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది” అని వాల్ పోస్టర్ సినిమా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
అంచనాలకు మించి.. దర్శికి రికార్డు
కోర్ట్ చిత్రానికి మంచి ఓపెనింగ్ ఖాయమనే అంచనాలు వచ్చాయి. అయితే వాటికి మంచి ఏకంగా రూ.8.10 కోట్ల గ్రాస్ రావడం కాస్త ఆశ్చర్యపరిచింది. కోర్ట్ రూమ్ డ్రామాకు ఈ స్థాయిలో ఓపెనింగ్ రావడం అనూహ్యమే. ట్రైలర్ ఆకట్టుకోవడం, ప్రమోషన్లలో నాని చూపిన నమ్మకం, ప్రీమియర్లతో సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో ఇది సాధ్యమైంది. ప్రియదర్శికి ఇది హెయ్యెస్ట్ రికార్డు ఓపెనింగ్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
కోర్ట్ చిత్రం లవ్ స్టోరీ, పోక్సో కేసు, న్యాయస్థానంలో వాదనల చుట్టూ సాగుతుంది. ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. తొలి మూవీనే అయినా కోర్ట్ రూమ్ డ్రామాను మెప్పించేలా, గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారంటూ అతడిపై ప్రశంసలు దక్కుతున్నాయి. కథను ఎంతో సాలిడ్‍గా రాసుకున్న అతడు.. అదే రేంజ్‍లో తెరకెక్కించారు.
కోర్ట్ మూవీలో న్యాయవాదిగా ప్రియదర్శి నటనపై చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. యువ ప్రేమికులుగా నటించిన రోహన్, శ్రీదేవి కూడా యాక్టింగ్‍తో మెప్పించారు. నెగెటివ్ రోల్‍లో శివాజీ అదరగొట్టేశారు. ఈ చిత్రానికి మరో హైలైట్‍గా నిలిచారు. రోహిణి, సాయికుమార్, హర్షవర్దన్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ మూవీని నాని సమర్పించగా.. ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం