





Best Web Hosting Provider In India 2024

Long Hair Tips: నల్లటి, పొడవాటి జుట్టు కోసం కేవలం రెండు పదార్థాలు చాలంటున్న సిద్ధ వైద్యులు! అవేంటో తెలుసుకోండి
Long Hair Tips: నల్లటి, పొడవైన జుట్టు చాలా మంది అమ్మాయిల కళ. ఇందుకోసం రకరకాల నూనెలు, క్రీములత కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రెండు పదార్థాలు చాలంటున్నారు ప్రముఖ సిద్ధ వైద్యుడు డాక్టర్ కామరాజ్ చెబుతున్నారు. అవి ఏమిటో, వాటిని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకోండి.

నల్లటి, పొడవైన జుట్టు చాలా మంది అమ్మాయిలు తపిస్తుంటారు. మహిళల అందాన్ని పెంచడంలో పొడవైన జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. వీటిన్నింటి కారణంగా జుట్టు పొడవుగా నల్లగా మారడం అటుంచి తెల్ల వెంట్రుకలు, జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. వెంట్రుకలు చిట్లిపోయి ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఇందుకు కారణం మార్కెట్లో దొరికే ఉత్పత్తుల తయారీకి హానికరమైన రసాయనాలను ఉపయోగించడం. మరి పొడవాటి జుట్టు కోసం ఏం చేయాలి? తెల్ల వెంట్రుకల సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఎలాంటి పదార్థాలను ఉపయోగిచాలి? అనుకుంటున్నారా.? అయితే ఈ వార్త పూర్తిగా చదవండి.
జుట్టు అందంగా, ఆరోగ్యంగా అంటే ఒత్తుగా, పొడవుగా నల్లగా మారాలంటే ఎప్పుడూ సహజమైన ఉత్పత్తులను ఎంచుకోవడం అలవాటు చేసుకోండి. సమయం లేదనో, వీలు కాకనో లేక బద్దకంతోనో ఉండకుండా ఇంట్లోనే మీరే స్వయంగా జుట్టు సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోండి. ఇవి మీ జుట్టును ఎల్లప్పుడూ సంరక్షిస్తాయి. జుట్టు రాలడం నుంచి తెల్ల బడటం వంటి అనేక రకాల సమస్యలను సహజసిద్దంగా నయం చేస్తాయి. పొడవాటి, మెరిసే, నల్లటి జుట్టు కోసం ఇలాంటి ఒక నేచురల్ అండ్ పవర్ ఫుల్ రెమిడీని మీకోసం మేం తీసుకొచ్చాం. తిరుచిరాపల్లికి చెందిన ప్రముఖ సిద్ధ వైద్యులు డాక్టర్ కామరాజ్ సోషల్ మీడియా ద్వారా నల్లటి, పొడవైన జుట్టు కోసం చక్కటి రెమిడీని తెలియజేశారు.
వైద్యుడి అభిప్రాయం ప్రకారం..
ఈ ఒక్క రెమిడీతో మహిళల పొడవైన జుట్టు పొందాలనే కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అలాగే జుట్టు తెల్లబడకుండా, రాలకుండా ఉంటుంది. దట్టంగా, నల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. దీని కోసం కేవలం రెండు రకాల పదార్థాలు చాలని ఆయన చెబుతున్నారు. అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.
అవసరమైన పదార్థాలు
- కరివేపాకు – ఒక కుప్ప
- మెంతులు – అరకప్పు
వీటితో ఏం చేయాలి:
- పొడవైన, ఒత్తైన, నల్లటి జుట్టు కోసం ముందుగా మెంతులను 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి( రాత్రంతా నానబెట్టుకుంటే మరీ మంచిది).
- అలాగే కరివేపాకు తీసుకుని శుభ్త్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.
- మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టి పక్కకు పెట్టి మెంతులను, కరివేపాకు తీసుకుని మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి.
- తరువాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ పేస్టుతో చిన్న చిన్న వడలలాగా తయారు చేసుకోండి. ఒక వడ దాదాపు 10గ్రాములు ఉండేలా చూసుకోండి.
- ఇవి చక్కగా ఆరిపోయేంత వరకూ ఎండలో పెట్టుకోండి. మీకు ఎండ తగిలే చోటు లేకపోతే ఫ్యాన్ గాలికి కూడా వీటిని ఆరబెట్టుకోవచ్చు.
- చక్కగా ఆరిన ఈ వడలలో ఒకదాన్ని తీసుకుని 100మిల్లీ లీటర్ల నూనెలో వేసి నానబెట్టుకోండి. (మిగతా వాటిని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోండి).
- నూనెలో వేసుకున్న వడలు 15 రోజుల పాటు నానిన తర్వాత. ఆ నూనెను ప్రతి రెండు రోజులకు ఒకసారి తలకు అప్లై చేసుకొండి.
- నూనె రాసుకున్న తర్వాత కనీసం గంట పాటైనా తలను అలాగే వదిలేసి తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో తలస్నానం చేయండి.
ఇలా ఈ నూనెను ఉపయోగించారంటే కొద్ది రోజుల్లో మీ వెంట్రుకల్లో చాలా మార్పు వస్తుంది. మీకు ఒక్క తెల్లవెంట కూడా రాదు. జుట్టు రాలదు. అలాగే జుట్టు దట్టంగా, మెరిసిపోతూ కనిపిస్తుంది. మీ జుట్టు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇది అన్ని రకాల వెంట్రుకలు ఉన్నవారికి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుందిన డాక్టర్ కామరాజ్ తెలిపారు.
సంబంధిత కథనం