




Best Web Hosting Provider In India 2024

OTT Biography: ఓటీటీ తెలుగు బయోగ్రఫీ మూవీ సక్సెస్.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్.. సినీ హబ్‌గా విశాఖ అంటూ!
Manyam Dheerudu Seetharama Raju OTT Streaming Success Meet: ఓటీటీలోకి ఇటీవల తెలుగు బయోగ్రఫీ చిత్రం మన్యం ధీరుడు సీతారామరాజు వచ్చేసింది. మన్యం ధీరుడు ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నటుడు, నిర్మాత ఆర్‌వీవీ సత్యనారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Manyam Dheerudu Seetharama Raju OTT Release: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు బయోగ్రాఫికల్ మూవీ మన్యం ధీరుడు. అల్లూరి సీతారామరాజు అనేది క్యాప్షన్. ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మన్యం ధీరుడు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే తాజాగా మన్యం ధీరుడు ఓటీటీ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే
విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మన్యం ధీరుడు సక్సెస్ మీట్‌కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్‌వీవీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌వీవీ సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన మన్యం ధీరుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు.
కమిటీలు కూడా వేశాం
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వీవీ రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో సినీ హబ్‌గా విశాఖను మారుస్తాం. దీనిపై ఇప్పటికే కమిటీలు వేశాం. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశాం. అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చేస్తాం” అని తెలిపారు.
హీరోను పొగిడిన ఎమ్మెల్యే
అలాగే, అల్లూరి సీతారామరాజు పాత్ర చేసినటువంటి ఆర్‌వివి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంతగానో కొనియాడారు. ఇలాంటి చిత్రాలు ప్రస్తుత జనాలకి ఎంతైనా ఉపయోగకరమని, ఇది కచ్చితంగా చూడదగ్గ సినిమా అని చెప్పుకొచ్చారు.
కత్తి, విలువిద్యలో శిక్షణ
అనంతరం నిర్మాత, హీరో ఆర్‌వివి సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, విలువిద్యలో శిక్షణ తీసుకున్నాను. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన విరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ చిత్రం ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ కావడంతోపాటు ఓటీటి ప్లాట్‌ఫామ్‌లో కూడా అదే సంస్థతో ఏర్పాటు స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అందుకు చాలా ఆనందంగా ఉంది” అని వెల్లడించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
కాగా మన్యం ధీరుడు ఓటీటీ సక్సెస్ మీట్ కార్యక్రమానికి విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాదవ్ కుమార్, జిఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో మన్యం ధీరుడు ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను రెంటల్ విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
99 చెల్లించాల్సిందే!
రూ. 99 చెల్లించి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మన్యం ధీరుడు సినిమాను వీక్షించవచ్చు. ఇక నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన మన్యం ధీరుడు సినిమాలో ఆర్‌వీవీ సత్యనారాయణ, ఆర్ పార్వతీదేవి లీడ్ రోల్స్ చేశారు.త జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కీలక పాత్రలో కనిపించారు. గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన మన్యం ధీరుడు ఆరు నెలలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్