APOBMMS Subsidy Loans : బీసీ,ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు-దరఖాస్తు విధానం ఇలా

Best Web Hosting Provider In India 2024

APOBMMS Subsidy Loans : బీసీ,ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు-దరఖాస్తు విధానం ఇలా

Bandaru Satyaprasad HT Telugu Updated Mar 15, 2025 05:03 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Updated Mar 15, 2025 05:03 PM IST

APOBMMS Subsidy Loans : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు…స్వయం ఉపాధి పథకాలు, జనరికి మెడికల్ షాపుల ఏర్పాటుకు సబ్సిడీపై రుణాలు అందిస్తుంది. బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు సబ్సిడీ రుణ సదుపాయం కల్పించింది. అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీసీ,ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు-దరఖాస్తు విధానం ఇలా
బీసీ,ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీపై రుణాలు-దరఖాస్తు విధానం ఇలా
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

APOBMMS Subsidy Loans : ఏపీ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు, జనరిక్ మెడికల్ షాపులకు సబ్సిడీతో రుణాలు అందిస్తుంది. బీసీ, కాపు, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు రుణాలు ఇచ్చేందుకు ఏపీఓబీఎంఎంఎస్ https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులను నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభించింది. అర్హులైన వారు 10-03-2025 నుంచి 22-03-2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్సిడీ రుణాల మంజూరుకు నిబంధనలు :

  • అన్ని వనరులు కలుపుకుని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబ ఆదాయం రూ.81,000 లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.
  • 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులు
  • తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
  • ఒక కుటుంబంలో…తెల్ల రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.

వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారం, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తారు. పైన తెలిపిన విధంగా అర్హతలు కలిగిన వారు https://apobmms.apcfss.in/ ఈ నెల 10-03-2025 నుంచి 22-03-2025 వారి పేర్లను APOBMSS వెబ్సైటు లో నమోదు చేసుకోవాలి. స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల కోసం డి.ఫార్మసీ, బి.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత 22-03-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య కమ్యూనిటీ వారికి రుణాలు

  1. స్వయం ఉపాధి పథకాలు – వ్యవసాయం, వ్యవసాయం అనుబంధ, రవాణా, పరిశ్రమలు, సేవ, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలు
  2. ఎంఎస్ఎంఈ కింద జనరిక్ ఫార్మసీలు -డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అభ్యర్థులకు చెందిన నిరుద్యోగ యువతకు జనరికి ఫార్మసీలు
  3. లబ్ధిదారుడు ఏదైనా బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
  4. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి.
  5. లబ్ధిదారుడి వయస్సు పరిమితి 21 నుంచి 60 సంవత్సరాలు.
  6. లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) వర్గంలో ఉండాలి.
  7. స్వయం ఉపాధి పథకాల్లో రవాణా రంగానికి లబ్ధిదారునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  8. జనరిక్ ఫార్మసీ పథకాలకు లబ్ధిదారునికి డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ ఉండాలి.

దరఖాస్తు ఎలా చేయాలి?

ముందుగా లబ్ధిదారుడు https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో తన ప్రాథమిక వివరాలను నమోదు చేసుకుని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలి.

యూజర్ ఐడీ : రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్

పాస్‌వర్డ్ : రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చే ఓటీపీ

లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేయడానికి చిరునామా, కులం, స్వయం ఉపాధి వివరాలను పూర్తి చేయాలి. అనంతరం దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.

కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు

  • చంద్రన్న స్వయం ఉపాధి – కాపు సామాజిక వర్గాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి జీవనోపాధి కోసం స్వయం ఉపాధి పొందడానికి లేదా ఉన్న యూనిట్లను విస్తరించడానికి ప్రభుత్వం సబ్సిడీపై రుణం అందిస్తుంది.
  • గ్రూప్ MSME ప్రోగ్రామ్ – కాపు సామాజిక వర్గాల్లో గ్రూప్ లుగా ఏర్పడి ఎంఎస్ఎంఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా రుణసదుపాయం అందిస్తారు.

అర్హతలు

  1. లబ్ధిదారుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారై అయి ఉండాలి అంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉప కులాలకు చెందినవారై ఉండాలి.
  2. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి
  3. లబ్ధిదారుడి వయస్సు పరిమితి 21 నుండి 50 సంవత్సరాలు.
  4. దరఖాస్తుదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబానికి చెందినవారై ఉండాలి
  5. దరఖాస్తుదారుడు స్వయంగా ప్రాజెక్టు ప్రతిపాదించవచ్చు. ఈ ప్రాజెక్టు కాపు కార్పొరేషన్ అనుమతి పొందితే రుణం పొందవచ్చు.
  6. దరఖాస్తుదారుడు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద రుణం పొంది ఉండకూడదు.
  7. గత ఆర్థిక సంవత్సరంలో లేదా గతంలో కాపు కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు అర్హులు కాదు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsTrending ApTelugu NewsAp Govt
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024