



Best Web Hosting Provider In India 2024

Sweetcorn Tikki: సీజన్ అయిపోయే లోపు స్వీట్ కార్న్ టిక్కీలను తప్పకుండా ట్రై చేయండి.. ఇదిగో రెసిపీ!
Sweetcorn Tikki: మీరు స్వీట్ కార్న్ టిక్కీలు ఎప్పుడైనా తిన్నారా? ఇప్పటివరకూ లేకపోతే సీజన్ అయిపోక ముందే ట్రై చేయండి. ఈజీగా తయారయ్యే ఈ టిక్కీలు మీ సాయంత్రాన్ని చాలా సరదాగా, టేస్టీగా మారుస్తాయి

స్వీట్ కార్న్ గింజలను ఉడికించుకుని తిని ఉంటారు. నూనెతో వేయించుకుని క్రిస్పీ కార్న్ లా కూడా తిని ఉంటారు. కానీ వీటితో టిక్కీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకూ చేసి ఉండకపోతే ఈ రెసిపీ మీ కోసమే. స్వీట్ కార్న్ తో తయారు చేయగల బెస్ట్ రెసిపీ ఇది. త్వరగా చాలా సులువుగా తయారయ్యే స్వీట్ కార్న్ టిక్క వాటిల్లో బెస్ట్ టేస్ట్ అందించే స్వీట్ కార్న్ టిక్కీలు చాలా స్పెషల్. ఈ రెసిపీతో ట్రై చేశారంటే టిక్కీలు చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఆలస్యం ఎందుకు ఇదిగోండి రెసిపీ ఈ సాయంత్రం కచ్చితంగా ప్రయత్నించండి.
స్వీట్ కార్న్ టిక్కీలు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:
- స్వీట్ కార్న్ – ఒక కప్పు
- ఉడకబెట్టిన ఆలుగడ్డ పేస్ట్ – ఒక కప్పు
- పచ్చిమిర్చి – రెండు లేదా మూడు
- ఉల్లిపాయలు – ఒక కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- ధనియాల పొడి – ఒక టీ స్పూన్
- కారం – ఒక టీ స్పూన్
- గరం మసాలా – అర టేబుల్ స్పూన్
- కార్న్ ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
- చిటికెడు ఉప్పు
- కొత్తిమీర
స్వీట్ కార్న్ టిక్కీలు తయారు చేసే విధానం:
- స్వీట్ కార్న్ చేయడానికి ముందుగా బంగాళ దుంపలను (పెద్దదైతే ఒకటి లేదా చిన్నవైతే రెండు)తీసుకుని ఉడకబెట్టుకోండి.
- ఉడికిన బంగాళ దుంపలను మెత్తగా గుజ్జులా చేసి పక్కకుపెట్టుకోండి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్వీట్ కార్న్ గింజలు వేయండి.
- ఆ తర్వాత దీంట్లోనే బంగాళ దుంపల పేస్ట్‌తో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి.
- ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేయండి.
- ఆ మిశ్రమంలోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి.
- అన్నీ బాగా కలిసాయనుకున్న తర్వాత ఈ మిశ్రమంపై మూతపెట్టి పది నిమిషాలు పాటు వదిలేయండి.
- ఆ తర్వాత పిండిని మరోసారి కలుపుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం చెక్ చేసుకోండి.
- ఇప్పుడు ఆ పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకుని టిక్కీల్లాగా తయారుచేసుకుని పక్కకుపెట్టుకోండి.
- అలా చేసిన టిక్కీలు ఎక్కువసేపు ఆరిపోకముందే వేయించుకోవాలి.
- ఇప్పుడు వీటిని మీరు డీప్ ఫ్రై చేయాలనుకుంటే, లోతుగా ఉండే ప్యాన్, షాలో ఫ్రై చేయాలనుకుంటే, మామూలుగా ఉండే ప్యాన్ తీసుకోండి.
- రెండింటిలో ఎలా చేసినా రుచిలో ఏ మాత్రం మార్పు ఉండదు.
- షాలో ఫ్రై చేయాలనుకున్న వాళ్లు ప్యాన్ తీసుకుని వేయించడానికి సరిపడ నూనె పోయండి.
- నూనె వేడెక్కిన తర్వాత టిక్కీలు ఒక్కొక్కటిగా వేస్తూ కరకరలాడే విధంగా రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకూ వేపుకోండి.
ఇలా తయారుచేసుకున్న టిక్కీలు లేదా కట్లెట్లను టమాటో చట్నీ, కెచప్ లేదా మీకు నచ్చిన గ్రీన్ చట్నీతో కలిపి తినేయొచ్చు. టీకి జోడీగా కూడా వీటిని చక్కగా ఆస్వాదించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్