






Best Web Hosting Provider In India 2024

Brahmamudi Kavya: కార్తీక దీపంలో వంటలక్క పాత్ర నేనే చేయాల్సింది.. కానీ – సీక్రెట్ బయటపెట్టిన బ్రహ్మముడి కావ్య
Brahmamudi Kavya: తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన కార్తీక దీపం సీరియల్ తాను చేయాల్సిందని బ్రహ్మముడి కావ్య చెప్పింది. వంటలక్క రోల్ చేయమని మేకర్స్ తనను సంప్రదించారని, కానీ తెలుగు ఇండస్ట్రీపై అవగాహనం లేకపోవడంతో ఈ సీరియల్‌ను రిజెక్ట్ చేశానని తెలిపింది.

Brahmamudi Kavya: బ్రహ్మముడి సీరియల్ పేరు వినగానే అందరికి గుర్తొచ్చే పేరు కావ్య. ఈ సీరియల్‌తో అంతలా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది దీపికా రంగరాజు. అసలు పేరు కంటే బ్రహ్మముడి కావ్యగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది.స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్లో దీపికా రంగరాజు లీడ్ రోల్లో నటిస్తోంది.
బ్రహ్మముడి కంటే ముందు….
బ్రహ్మముడి సీరియల్‌తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా రంగరాజు. అయితే బ్రహ్మముడి కంటే ముందు తెలుగులో కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్గా నటించే అవకాశం దీపికా రంగరాజుకు వచ్చిందట. తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో ఆ ఆఫర్‌ను మిస్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో దీపికా రంగరాజు చెప్పింది.
బ్లాక్ మేకప్ వేసుకొని…
“తమిళంలో చితిరం పేసుతడి అనే సీరియల్ చేశా. అది పెద్ద హిట్టవడంతో కార్తీక దీపం మేకర్స్ నన్ను సంప్రదించారు. బ్లాక్ మేకప్ వేసి నటించాలని అన్నారు. మలయాళ రీమేక్ అని చెప్పారు. కథ బాగా నచ్చింది. కానీ హైదరాబాద్ గురించి అప్పటికీ నాకు అంతగా తెలియదు. ఇక్కడ తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో భయపడ్డాను. సీరియల్ కోసం వేరే రాష్ట్రానికి వెళ్లడానికి అమ్మనాన్నలుకూడా ఒప్పుకోలేదు. దాంతో కార్తీక దీపం సీరియల్‌ను రిజెక్ట్ చేశాను. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ రిగ్రేట్‌గా ఫీలవుతున్నా” అని దీపికా రంగరాజు చెప్పింది.
దీపికా రంగరాజు రిజెక్ట్ చేయడంలో ప్రేమీ విశ్వనాథ్‌ను మేకర్స్ వంటలక్క రోల్ కోసం సెలెక్ట్ చేశారు. ఇంజినీరింగ్ చేస్తూనే పార్ట్ టైమ్‌గా న్యూస్ యాంకర్‌గా పనిచేశానని, వాటి ద్వారానే సీరియల్స్‌లో అవకాశం వచ్చిందని దీపికా రంగరాజు చెప్పింది.
టీఆర్పీలో టాప్..కానీ…
బ్రహ్మముడి సీరియల్ చాలా కాలం పాటు టీఆర్పీ రేటింగ్‌లో టాప్‌లో కొనసాగుతూ వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ సీరియల్ టైమ్ మార్చారు. సాయంత్రం ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు షిష్ట్ చేశారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కోసం బ్రహ్మముడిని ప్రైమ్ టైమ్ నుంచి తొలగించారు. టీఆర్పీలో టాప్‌లో ఉన్న సీరియల్ టైమ్‌ను మార్చడంపై విమర్శలొచ్చాయి. టైమ్ ఛేంజ్ చేసిన తర్వాత టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. లేటెస్ట్ రేటింగ్స్‌లో 6.85 మాత్రమే వచ్చింది.
ఓటీటీలోకి…
బ్రహ్మముడి కావ్య ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 షోకు మెంటర్‌గా వ్యవహరిస్తోంది. బ్రహ్మముడి సీరియల్లో దీపికా రంగరాజుకు జోడీగా నటిస్తోన్న మానస్ నాగులపల్లి కూడా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2కు మెంటర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
సంబంధిత కథనం