






Best Web Hosting Provider In India 2024

Tollywood: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ది సస్పెక్ట్ – ఇన్వేస్టిగేషన్‌లో కొత్త కోణం – రిలీజ్ డేట్ ఇదే…
Tollywood: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు మూవీ ది సస్పెక్ట్ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. మార్చి 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది సస్పెక్ట్ మూవీకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించాడు.

Tollywood: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది సస్పెక్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది సస్పెక్ట్ మూవీకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించాడు. టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ పై కిరణ్ కుమార్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
పోలీస్ ఆఫీసర్‌కు లింకేంటి?
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ది సస్పెక్ట్ మూవీ తెరకెక్కుతోన్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో ఇన్వేస్టిగేషన్ కొత్తకోణంలో ఉంటుందని వెల్లడించారు. ప్రత్యూష అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? ఈ హత్యకు ఓ పోలీస్ ఆఫీసర్‌కు ఉన్న సంబంధం ఏమిటన్నది ఈ మూవీలో ఆసక్తికరంగా ఉండబోతుంది.
ఇన్వేస్టిగేషన్ మూవీస్ ఇష్టపడే ఆడియెన్స్‌కు ది సస్పెక్ట్ మూవీ కొత్త ఫీల్ కలిగిస్తుందని ప్రొడ్యూసర్ పేర్కొన్నారు. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. చివరి వరకు ఉత్కంఠను పంచుతుంది.
లిరిసిస్ట్‌గా…
ది సస్పెక్ట్ మూవీకి డైరెక్టర్ వీఎన్ ఆదిత్య లిరిసిస్ట్‌గా పనిచేయడం గమనార్హం. ఈ సినిమాలోని మనసే మనసే పాటకు సాహిత్యాన్ని అందించారు. ఇటీవల ది సస్పెక్ట్ ట్రైలర్‌ను ఇటీవల వీఎన్ ఆదిత్య రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ తో ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ది సస్పెక్ట్ మూవీకి ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రవీణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఎస్‌కేఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ద్వారా చాలా మంది కొత్త నటీనటులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.
గతంలో అనూరాధ పేరుతో…
వీఎన్ ఆదిథ్య పాటలు రాయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనూరాధ పేరుతో కొన్ని పాటలు రాశారు. వీఎన్ ఆదిత్య తెలుగులో మనసంతా నువ్వే సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీరామ్, నేనున్నాను, బాస్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
సంబంధిత కథనం