Samantha: తెలుగు మూవీకి ప్రొడ్యూస‌ర్‌గా స‌మంత – టైటిల్ ఇదే – చచ్చినా చూడాల్సిందే అంటూ క్యాప్షన్

Best Web Hosting Provider In India 2024

Samantha: తెలుగు మూవీకి ప్రొడ్యూస‌ర్‌గా స‌మంత – టైటిల్ ఇదే – చచ్చినా చూడాల్సిందే అంటూ క్యాప్షన్

Nelki Naresh HT Telugu
Published Mar 15, 2025 06:19 PM IST

Samantha: హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారింది. తెలుగులో ఓ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీని నిర్మించింది. ఈ సినిమాకు శుభం అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ కూడ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో స‌మంత ఫ‌స్ట్ మూవీ రిలీజ్ కానుంది.

స‌మంత
స‌మంత

Samantha: హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారింది. తొలి ప్ర‌య‌త్నంగా కామెడీ థ్రిల్ల‌ర్‌క‌థాంశంతో ఓ తెలుగు మూవీని తెర‌కెక్కించింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ శ‌నివారం రివీలైంది. ప్రొడ్యూస‌ర్‌గా స‌మంత డెబ్యూ మూవీకి శుభం అనే టైటిల్ క‌న్ఫామ్ చేశారు చ‌చ్చినా చూడాల్సిందే అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. శుభం మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. పాత‌కాలం నాటి టీవీల్లో లీడ్ యాక్ట‌ర్స్ క‌నిపిస్తున్న‌ట్లుగా డిఫ‌రెంట్‌గా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. సెలైంట్‌గా శుభం మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు.

సినిమా బండి ఫేమ్‌…

శుభం సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్ర‌వీణ్ కండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌సంత్ మ‌రిగంటి క‌థ‌ను అందించారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కామెడీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. న‌వ్విస్తూనే నెక్స్ట్ ఏం జ‌రుగ‌బోతుంద‌నే ఉత్కంఠ‌ను పంచేలా ఈ క‌థ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది. శుభం మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌‌గా ధర్మేంద్ర కాక‌ర్ల ప‌నిచేస్తున్నారు.

త్వ‌ర‌లో రిలీజ్‌…

సినిమా నిర్మాణ కోసం త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో సొంత‌గా ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను స్థాపించింది స‌మంత‌. ఈ బ్యాన‌ర్ మీద స‌మంత నిర్మిస్తోన్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త్వరలోనే శుభం మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మా ఇంటి బంగారం…

ఇదే బ్యాన‌ర్‌పై గ‌తంలో మా ఇంటి బంగారం పేరుతో స‌మంత ఓ సినిమాను అనౌన్స్‌చేసింది. ఈ మూవీలో తానే హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గ‌న్ ప‌ట్టుకొని స‌మంత క‌నిపించింది. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

సిటాడెట్ హ‌నీ బ‌న్నీ…

గ‌త కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న స‌మంత వెబ్‌సిరీస్‌ల‌పైనే ఫోక‌స్ పెడుతోంది. గ‌త ఏడాది సిటాటెడ్ హ‌నీ బ‌న్నీ అనే వెబ్‌సిరీస్ చేసింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా ఈ వెబ్‌సిరీస్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి.

ప్ర‌స్తుతం హిందీలోనే ర‌క్త్ బ్ర‌హ్మాండ్ పేరుతో మ‌రో వెబ్‌సిరీస్ చేస్తోంది. యాక్ష‌న్ ఫాంట‌సీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో అలీ ఫైజ‌ల్‌, ఆదిత్య రాయ్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024