Ranya Rao: ‘‘కస్టడీలో అధికారులు కొట్టారు.. టార్చర్ చేస్తున్నారు’’ – గొల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు రన్యా రావు

Best Web Hosting Provider In India 2024

Ranya Rao: ‘‘కస్టడీలో అధికారులు కొట్టారు.. టార్చర్ చేస్తున్నారు’’ – గొల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు రన్యా రావు

Sudarshan V HT Telugu
Published Mar 15, 2025 04:24 PM IST

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రణ్యారావు అధికారులపై ఆరోపణలు చేశారు. డీఆర్ఐ అధికారులు తనపై చేయి చేసుకున్నారని, బలవంతంగా ఖాళీ కాగితాలపై తన సంతకాలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

గొల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు రన్యా రావు
గొల్డ్ స్మగ్లింగ్ నిందితురాలు రన్యా రావు (YouTube/ Anand Audio)

Ranya Rao: గతంలొ తను ఇచ్చిన స్టేట్మెంట్ పై కన్నడ నటి రణ్యా రావు యూటర్న్ తీసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తాను నిర్దోషినని డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. గత వారం ఆమె నేరాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. బంగారం స్మగ్లింగ్ నేరంపై రెండు వారాల క్రితం ఆమెను అరెస్టు చేశారు.

డీఆర్ ఐ అధికారులపై ఆరోపణలు

డీఆర్ఐ అధికారులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, పలుమార్లు తన చెంపపై కొట్టారని, తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు తీసుకున్నారని డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కు రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. ‘‘రెండు వారాల క్రితం నన్ను విమానంలోనే అరెస్ట్ చేశారు. డీఆర్ఐ అధికారులు ఎంత బలవంతం చేసినా, నేను వారు రూపొందించిన వాంగ్మూలాలపై సంతకం చేయలేదు. దాంతో, వారు నాపై చేయి చేసుకున్నారు. చివరకు తీవ్ర ఒత్తిడికి లోనై నేను 40 ఖాళీ షీట్లతో పాటు సుమారు 50 నుంచి 60 టైప్ చేసిన పేజీలపై సంతకం చేశాను’’ అని ఆ లేఖలో రన్య రావు పేర్కొన్నట్లు సమాచారం.

అరెస్టు చేసిన క్షణం నుంచి

‘నన్ను అరెస్టు చేసిన క్షణం నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు డీఆర్ఐ అధికారులు 10-15 సార్లు కొట్టారు. చెంపదెబ్బ కొట్టారు. పదేపదే దాడులు జరిగినా, వారు తయారు చేసిన ప్రకటనలపై సంతకం చేయడానికి నేను నిరాకరించాను” అని రణ్య చెప్పారు. తీవ్ర ఒత్తిడి, శారీరక వేధింపులతో డీఆర్ఐ అధికారులు తయారు చేసిన 50-60 టైప్ చేసిన పేజీలు, 40 ఖాళీ తెల్ల పేజీలపై సంతకాలు చేయాల్సి వచ్చిందన్నారు.

ఇంతకీ ఆ కేసు ఏంటి?

దుబాయ్ నుంచి 14 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన రణ్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యారావు. ఆమె అక్రమ కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని రామచంద్రరావు ఖండించారు.

ఎవరీ రణ్యారావు?

కర్ణాటకలోని చిక్ మగళూరుకు చెందిన రణ్య సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ముందు బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇంజినీరింగ్ చదివారు. ఆమె 2014 లో సుదీప్ దర్శకత్వం వహించి నటించిన కన్నడ చిత్రం “మాణిక్య” తో నటనా రంగ ప్రవేశం చేసింది, ఇందులో ఆమె మానస అనే సంపన్న యువతిగా, కథానాయకుడి ప్రేయసిగా నటించింది. కన్నడ సినిమాలను దాటి తన కెరీర్ ను విస్తరించిన ఆమె 2016లో విక్రమ్ ప్రభుతో కలిసి ‘వాఘా’ అనే రొమాంటిక్ డ్రామాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మరుసటి సంవత్సరం, ఆమె *పటాకీ” అనే హాస్య చిత్రంతో కన్నడ చిత్రాలకు తిరిగి వచ్చింది, ఇందులో ఆమె సంగీత అనే పాత్రికేయురాలు, గణేష్ పాత్ర యొక్క ప్రేమికురాలిగా నటించింది.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024