ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.29-8-2022(సోమవారం) ..
సంక్షేమాంధ్రప్రదేశ్ సాధనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు గ్రామం లోని ధర్మ చెరువు -ముస్లిం బజార్ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం 160 గడపలకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు, గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన అభివృద్ధి -సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు , సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తూనే , విద్యా వైద్య రంగాలలో నూతన విధానాలకు నాంది పలికారని తెలిపారు , ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ పరిపాలన పై మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని , తమ ఆశీస్సులు ఎప్పుడూ వైయస్ జగన్ కు ఉంటాయని ప్రజలు ఆనందంతో చెబుతున్నారని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు ,పార్టీ నాయకులు కందుల నాగేశ్వరరావు ,యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , జానకి రామయ్య , సత్యనారాయణ , లాల్ సా , షికూర్ తదితరులు పాల్గొన్నారు ..