





Best Web Hosting Provider In India 2024

Star Maa Serial: స్టార్ మా సీరియల్ చిన్నిలోకి పాపులర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎంట్రీ – రోజుకో ట్విస్ట్…
Star Maa Serial: బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ తర్వాత స్టార్ మా సీరియల్ చిన్నిలోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 పాపులర్ కంటెస్టెంట్ గీతూ రాయల్ కూడా ఈ సీరియల్‌లోకి అడుగుపెట్టింది. శనివారం ఎపిసోడ్‌లో గీతూ రాయల్ కనిపించింది.

Star Maa Serial: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న చిన్ని సీరియల్‌లోకి రోజుకో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. ఇటీవలే ఈ సీరియల్‌లోకి బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ సడెన్‌గా అడుగుపెట్టాడు. నిఖిల్ ఎంట్రీతో ఫ్యాన్స్ థ్రిల్లయ్యారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నిఖిల్‌ను మేకర్స్ పరిచయం చేశారు.ఆ తర్వాత ఎపిసోడ్‌లోనే జబర్ధస్థ్ కమెడియన్ పవిత్ర కూడా కనిపించింది.
గీతూ రాయల్…
తాజాగా శనివారం నాటి ఎపిసోడ్‌తో ఫ్యాన్స్‌కు మరో ట్విస్ట్ ఇచ్చారు సీరియల్ మేకర్స్. చిన్ని సీరియల్‌లోకి ఇంకో కొత్త క్యారెక్టర్ అడుగుపెట్టింది. ఆ గెస్ట్ మరెవరో కాదు బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6తో పాపులర్ అయిన గీతూ రాయల్ చిన్ని సీరియల్ నటిస్తోంది. కుందన అనే పాత్రలో కనిపించింది. నిఖిల్‌కు అసిస్టెంట్‌గా గీతూ రాయల్ శనివారం ఎపిసోడ్‌లో అభిమానుల ముందుకొచ్చింది. చిత్తూరు యాస డైలాగ్స్‌తో నవ్వించింది.
పవిత్ర ప్లేస్‌లో…
పవిత్ర ప్లేస్‌లో గీతూ రాయల్ సీరియల్‌లోకి అడుగుపెట్టినట్లు కనిపించింది. సీరియల్ పట్ల ఆడియెన్స్‌లో క్రేజ్ పెంచడానికే గీతూ రాయల్ క్యారెక్టర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని ఎపిసోడ్స్‌కే ఆమె పాత్ర పరిమితం కానున్నట్లు సమాచారం.
ఫైనల్ అనుకుంటే…
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన గీతూ రాయల్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్న గీతూ రాయల్ ఫైనల్ చేరకుంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా 63వ రోజు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ తర్వాత లక్కీ లక్ష్మణ్‌తో పాటు కొన్ని సినిమాలు, తెలుగు టీవీ షోస్‌లో గీతూ రాయల్ కనిపించింది.
చిన్ని సీరియల్‌లో బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్.. విజయ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర నటిస్తున్నాడు. కావేరి ఎలా చనిపోయిందా? బతికే ఉందా? ఉషానే కావేరినా అనే మిస్టరీని ఛేదించే క్యారెక్టర్‌లో అతడి కనిపిస్తున్నాడు.
టీఆర్‌పీలో టాప్…
ప్రస్తుతం చిన్ని సీరియల్ స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్ ఫైవ్‌లో ఉంది. లేటెస్ట్ టీఆర్‌పీలో 9.31 రేటింగ్‌ను ఈ సీరియల్ సొంతం చేసుకున్నది.
సంబంధిత కథనం