




Best Web Hosting Provider In India 2024

OTT Telugu Comedy: కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి బ్రహ్మానందం లీడ్ రోల్ చేసిన కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Brahma Anandam OTT: బ్రహ్మా ఆనందం సినిమా ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానుంది. అంచనాలు వేసినట్టు కాకుండా ఓ వారం లేట్ కానుందని తెలుస్తోంది. కొత్త స్ట్రీమింగ్ డేట్ సమాచారం కూడా వెల్లడైంది.

‘బ్రహ్మ ఆనందం’ సినిమా మంచి హైప్‍తో వచ్చింది. కామెడీ బ్రహ్మా బహ్మానందం చాలాకాలం తర్వాత ఓ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషించారు. తండ్రీ కొడుకులు ఈ మూవీలో తాతమనవళ్ల రోల్స్ చేశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన బ్రహ్మా ఆనందం మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
స్ట్రీమింగ్ తేదీ! కాస్త ఆలస్యంగా..
బ్రహ్మా ఆనందం మూవీ మార్చి 19వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ముందుగా ఫిబ్రవరి 14నే ఈ చిత్రం ఆహాలోకి ఎంట్రీ ఇస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, చివరి నిమిషాల్లో వాయిదా పడిందని తెలుస్తోంది. బ్రహ్మా ఆనందం సినిమాను మార్చి 19వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని ఆహా నిర్ణయించిందట. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బ్రహ్మా ఆనందం సినిమా అనుకున్న దాని కంటే కాస్త ఆలస్యంగానే ఓటీటీలో అడుగుపెట్టనుంది. మార్చి 19న స్ట్రీమింగ్‍కు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి ఆహా ఓటీటీలో మంచి వ్యూస్ దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
బ్రహ్మా ఆనందం చిత్రానికి ఆర్వీస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. తాతమనవళ్ల మధ్య రిలేషన్ ప్రధానంగా కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రం స్టోరీలైన్ బాగానే ఉన్నా.. ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయిందని మిక్స్స్ టాక్ వచ్చింది. అయితే, ఈ చిత్రంలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది.
బ్రహ్మా ఆనందం మూవీలో బ్రహ్మానందం, రాజా గౌతమ్ లీడ్ రోల్స్ చేయగా.. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, ఐశ్వర్య హోలక్కల్, రఘుబాబు, ప్రభాకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూజ్ చేయగా.. శాండిల్య పీసపాటి సంగీతం అందించారు.
బ్రహ్మా ఆనందం స్టోరీలైన్
సినిమాల్లో స్టార్ యాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంటాడు నాటకాల్లో నటించే బ్రహ్మా అలియాజ్ బ్రహ్మానందం (రాజా గౌతమ్). అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఢిల్లీలో జరిగే పెద్ద కార్యక్రమంలో నాటకం వేయాలంటే డబ్బు ఇవ్వాలని ఓ వ్యక్తి అతడిని అడుగుతాడు. ఇందుకోసం తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) పేరిట ఉన్న భూమి అమ్మాలని అనుకుంటాడు. వృద్ధాశ్రమంలో ఉండే తాతను బ్రహ్మ పొలం కోసం అడుగుతాడు. సాయం చేసేందుకు రామ్మూర్తి అంగీకరించినా కొన్ని షరతులు పెడతాడు. బ్రహ్మతో పాటు అతడి స్నేహితుడు గిరి (వెన్నెల కిశోర్)ను బుర్రడుపాలెం గ్రామానికి తీసుకెళతాడు రామ్మూర్తి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ గ్రామానికి బ్రహ్మాను రామ్మూర్తి ఎందుకు తీసుకెళ్లాడు? ఆ పొలం అమ్మేసి డబ్బు ఇచ్చాడా? అనే అంశాలు బ్రహ్మా ఆనందం మూవీలో ఉంటాయి.
మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రం తెలుగు వెర్షన్ ఈ శుక్రవారం (మార్చి 14) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం థియేటర్లలో బిగ్ హిట్ అయింది. ఇప్పటికే సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు వెర్షన్ ఆహాలోనూ అడుగుపెట్టింది.
సంబంధిత కథనం