




Best Web Hosting Provider In India 2024

Brahmamudi March 15th Episode: అబద్ధాన్ని ముక్కలు చేసిన కావ్య- దొరికేసిన రాజ్- బెడిసికొట్టిన రుద్రాణి ప్లాన్- రామ్ గడువు
Brahmamudi Serial March 15th Episode: బ్రహ్మముడి మార్చి 15 ఎపిసోడ్‌లో రాజ్ షర్ట్‌పై ఉన్న రక్తపు మరకలను ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు పంపించిన రిపోర్ట్ వస్తుంది. అది చూసి రక్తం బావదే అని అప్పు నిర్ధారిస్తుంది. కానీ రాజ్‌ను వెతకడానికి వెళ్తుంది కావ్య. కారులో ఉన్న రాజ్‌ను కావ్య చూసి సంతోషిస్తుంది.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో రాజ్ గురించే అంతా బాధపడుతుంటారు. కావ్యకు స్వప్న పాలు ఇస్తే తాగదు. ఇలా ఏం తినకుండా, తాగకుండా ఎలా ఉంటే చెప్పు అని స్వప్న అంటుంది. ఇంతలో రిపోర్ట్స్ అంటూ కానిస్టేబుల్ వస్తాడు.
రక్తపు మరకలు
ఏంటమ్మా అది అని సుభాష్ అడుగుతాడు. రాత్రి అక్క చెప్పినదాన్ని బట్టి నాకు అనుమానం వచ్చి బావగారి షర్ట్‌పై ఉన్న రక్తపు మరకలను ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు పంపించాను అని అప్పు అంటుంది. పోలీస్ అయ్యాక నీకు బాగా అనుమానాలు పెరిగిపోయాయి అని రుద్రాణి అంటుంది. మీరు నోరు మూసుకుంటారా. ముందు అందులో ఏముందో చెప్పవే అని స్వప్న అంటుంది. ఆ రిపోర్ట్స్ చూసిన అప్పు షాక్ అవుతుంది.
ఏంటమ్మా ఏం వచ్చింది రిపోర్ట్ అని ప్రకాశం అడుగుతాడు. ఏమొస్తుంది. దాని కళ్లు చూస్తే తెలియట్లేదు ఆ రిపోర్ట్‌లో ఏముందో అని రుద్రాణి అంటుంది. నువ్ నోరుమూయ్ అని ఇందిరాదేవి గద్దిస్తుంది. తర్వాత ఆ రక్తపు మరకలు బావవే అని అప్పు చెబుతుంది. దాంతో అపర్ణ మరింత కుమిలిపోతుంది. ఏంటండి. ఎందుకు మనకు దేవుడు అన్యాయం చేశాడు, మన బిడ్డను దూరం చేశాడని ఏడుస్తుంది. అంతా బాధపడతారు.
అదంతా విన్న కావ్య కోపంతో ఆ రిపోర్ట్స్‌ను చింపేస్తుంది. ఏం చేస్తున్నావ్ అని అంతా అడుగుతారు. అబద్ధాన్ని ముక్కలు చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి అయినా రాని, ఆయన బతికే ఉన్నారు. అది నా మనసుకు తెలుసు. మీరు ఎవరు నమ్మిన నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. ఆయన నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోరు. అయినా ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారే నీకు అని కావ్య అంటుంది. ఒక నిర్ధారణకు రావాలంటే ఇలా హెల్ప్ తీసుకోవాలని అప్పు అంటుంది.
రాజ్‌ను చూపించలేవు కానీ
ఏం అవసరం లేదు. ఆయన బతికే ఉన్నారని కావ్య అంటుంది. సరే నువ్వన్నట్లు రాజ్ బతికే ఉన్నాడనుకుందాం. ఎక్కడున్నాడు. ఏం చేస్తున్నాడు. రాజ్‌ను చూపించలేవు కానీ, బతికే ఉన్నాడని చెబుతున్నావ్. నీ గాలి మాటలు నమ్మాలా. ఈ ప్రూఫ్స్ నమ్మాలా అని రుద్రాణి అంటుంది. నువ్ ఎమోషనల్ అయినంత మాత్రానా నిజం కాకుండా పోదు కదా అని రాహుల్ అంటాడు. ఇప్పుడు ఆ నిజాన్నే బయటకు తీసుకొచ్చే పని చేయబోతున్నాను. ఆయన్ను మీ ముందు నిల్చోబెడతాను అని కావ్య అంటుంది.
ఈ కథ ఎక్కడితో ఆగిపోయిందో.. అక్కడికే వెళ్లి మళ్లీ మొదలుపెడతాను. ఆయన ఎక్కడ ఉన్న నేను తీసుకొస్తాను అని బయటకు వెళ్లిపోతుంది కావ్య. రాజ్ లేడన్న బాధకంటే కావ్య ఎక్కడ పిచ్చిదైపోతుందోనన్న బాధ నాకు ఎక్కువైంది. క్షమించండి అలా అంటున్నందుకు. పోయినవాళ్లు ఎలాగు తిరిగిరారు. ఉన్నవాళ్లను అయినా కాపాడుకోవాలి. చూశారుగా.. లేనివాడికోసం పిచ్చిదానిలా ఎలా వెతుక్కుంటుపోయింది. ఇలాగే వదిలేస్తే తను మరింత పిచ్చిదైపోతుంది అని రుద్రాణి అంటుంది.
ఇలాగే మాట్లాడితే నీ పళ్లు రాలిపోతాయ్ అని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అంతే అమ్మా నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు. అరేయ్ రాహుల్ వీళ్లను నమ్ముకుంటే లాభం లేదురా. ఇలాగే ఉంటే మన కంపెనీ ఏమైపోతుందో అని చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే వెళ్లి కంపెనీ బాధ్యతలన్నీ తీసుకోని జాగ్రత్తగా చూసుకో అని రుద్రాణి అంటూ వెళ్లమని సైగ చేస్తుంది. పెదమావయ్య నేను ఆఫీస్‌కు వెళ్లొస్తాను అని రాహుల్ అంటే.. అక్కర్లేదు. ఎవరు ఎక్కడికి వెళ్లాళ్సిన అసరం లేదు అని సుభాష్ అంటాడు.
చూసుకునేంత సీన్ ఉందా
మరి అక్కడ ఎవరు కంపెనీని చూసుకుంటారు అని రుద్రాణి అంటుంది. ఏరా రాహుల్ కంపెనీ చూసుకునేంత సీన్ ఉందని అనుకుంటున్నావా. అన్నయ్య వెళ్తారులే అని ప్రకాశం అంటాడు. నేను మాత్రమే కాదు. ఇకనుంచి నేను ప్రకాశం ఇద్దరం వెళ్లి కంపెనీ వ్యవహారాలు అన్ని చూసుకుంటాం. ఇంకెప్పుడు మా వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుందామని చూడకు అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. బాధలో ఉన్నామని చేదోడు వాదోడుగా ఉందామంటే మమ్మల్ని అంటారేంటీ అని రుద్రాణి అంటుంది.
మీ ఆలోచనలో ఎంత పెద్ద గూడుపుఠాని ఉందో మాకు అర్థమవుతోంది. నువ్వెప్పుడు మారవా ఛ.. అనుకుంటూ వెళ్లిపోతుంది స్వప్న. అప్పు చూస్తే.. అలా పోలీస్ కళ్లు వేసుకుని చూడకు. మేము ఏ నేరం చేయలేదు. ఆఫీస్‌కు వెళ్లొద్దంటే వెళ్లనులే అని రాహుల్ ఇంట్లోకి వెళ్తాడు. మరోవైపు రాజ్ ముందు పెళ్లి క్యాన్సిల్ అయింది, ఎందుకంటే నా కర్మ. అందరు ఫోన్ చేసి అడుగుతుంటే జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాను అని ఫోన్ విసిరిగొడుతున్నట్లు యాక్ట్ చేస్తుంది యామిని.
రాజ్‌ను చూసినట్లు ఆగి ఏమైనా కావాలా అని అడుగుతుంది. సారీ. నాకు తెలియకుండా నేను నిన్ను చాలా బాధపెడుతున్నాను. నేను కావాలని ఏం చేయట్లేదు. నా గతంలోకి తొంగిచూడాలంటే అంతా చీకటే కనిపిస్తుంది. అందులో నీతో పెళ్లివరకు వెళ్లానని నాకు అనిపించట్లేదు. దేనికైనా మనసు ముఖ్యం కదా. నా మనసు అంతా గందరగోళంగా ఉంది. ఈ కొత్త జీవితం అస్తవ్యస్తంగా ఉంది. నాది కానీ ఇంట్లో ఉన్నానని నా మానసిక పరిస్థితి చెబుతోంది. ఈ రెండింటితోనే నలిగిపోతున్నాను. అంతేతప్పా ఇంకో కారణం లేదు అని రాజ్ అంటాడు.
కొంచెం గడువు కావాలి
కానీ, నేను అబద్ధం చెప్పట్లేదు బావ. అది అర్థం చేసుకోడానికి ప్రయత్నించు. ఒక అమ్మాయి జీవితం పంచుకునేదాకా వెళ్లిందంటే స్వార్థం ఏముంటుంది అని యామిని అంటుంది. కరెక్టే.. నాకు అంత కొత్తగా ఉంది. పుట్టిన బిడ్డలా ఉంది. సాక్షాలు కనిపిస్తున్నాయి. కానీ, అందులో నేను ఉన్నట్లు అనిపించట్లేదు. అందుకే అలవాటు పడటానికి సమయం పడుతుంది. అంతవరకు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నాకు కొంచెం గడువు కావాలి. నీ బావలా మారడానికి అయినా మానసికంగా సిద్ధపడాలి కదా అని రాజ్ అంటాడు.
దాంతో సంతోషించినా యామిని ఎందులోనూ నిన్ను ఫోర్స్ చేయను అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తుంటుంది. ఇంతలో యామిని చేయి పట్టుకుంటాడు రాజ్. బాధపడుతున్నావా అని రాజ్ అడిగితే.. భయపడుతున్నావ్. నీకు గుర్తుకు రాని గతం మనిద్దరిని ఎక్కడ దూరం చేస్తుందో అని యామిని అంటుంది. ఒకపని చేద్దామా మనిద్దరం కలిసి బయటకు వెళ్దామా. ఇష్టం లేక కాదు. ఇంట్లో ఆలోచించి తలనొప్పి వస్తుంది. కనీసం బయటకు వెళ్తేనైనా మనసుకు ప్రశాంతంగా ఉంటుందేమో అని. నువ్వే నన్ను బయటకు తీసుకెళ్లు. నాకోసం అయినా ప్లీజ్ అని రాజ్ అంటాడు.
నువ్ అడిగితే ఏదైనా కాదంటానా అని యామిని చెబుతుంది. కట్ చేస్తే రాజ్, యామిని ఇద్దరు కారులో వెళ్తుంటారు. పాటను ఎంజాయ్ చేస్తుంటాడు రాజ్. ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని యామిని అంటే.. నాకు కూడా ఏదో జైలు నుంచి విడుదలైనట్లు ఉందని రాజ్ అంటాడు. మా ఇల్లు జైలులా ఉందా, నేను జైలర్‌లా కనిపిస్తున్నానా అని అలుగుతుంది యామిని. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. నువ్ జోవియల్ పర్సన్‌వే కాదు రొమాంటిక్ పర్సన్‌వి కూడా అని యామిని అంటుంది.
అలసిపోయిన కావ్య
అలా చెబుతూ ఇలా నా చేతిని ప్రేమగా తీసుకుని రాజ్ చేయిని ముద్దుపెట్టుకుంటుంది యామిని. దాంతో ఇబ్బందిపడతాడు రాజ్. మరోవైపు కారులో కావ్య వెళ్తుంటుంది. ఓ చోట కావ్యకు రాజ్ కనిపిస్తాడు. అది చూసి షాక్ అయిన కావ్య డ్రైవర్‌ను ఆపమంటుంది. ఏవండి అని కారు దిగి పరుగెత్తుతుంది కావ్య. కానీ, అదేం రాజ్ వినకుండా వెళ్తుంటాడు. కావ్య పరుగెత్తుతూనే ఉంటుంది. ఓ చోట అలసిపోయి ఆగిపోతుంది కావ్య. ఇంతలో కారును యామిని ఆపమని చెబుతుంది.
డిజైనర్ దగ్గర నా డ్రెస్ ఇచ్చాను. తీసుకొస్తాను అని యామిని కారు దిగుతుంది. కారు ఆగడం చూసి కావ్య అలసిపోయి ఉన్న మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. రాజ్ కారు దిగుతాడు. రాజ్‌ను చూసి సంతోషిస్తుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం