





Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Today March 15: జ్యోత్స్నపై కార్తీక్ కొత్త డౌట్, పారుకు శివన్నారాయణ ఝలక్.. దీపకు గాజులు తొడిగిన కార్తీక్
Karthika Deepam 2 Today Episode March 15: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో జ్యోత్స్న మారిపోయిందంటే తాను నమ్మడం లేదని కార్తీక్ అనుకుంటాడు. పారిజాతానికి ఆశ చూపి ఉసూరుమనిపిస్తాడు శివన్నారాయణ. దీప దగ్గర మళ్లీ ప్రాణదాత ఊసెత్తుతాడు కార్తీక్. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం 2 నేటి (మార్చి 15) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్నను ఎన్నిసార్లు తిట్టినా మారలేదని కార్తీక్ అంటాడు. నీ మీద, శౌర్యపై కూడా అటాక్ చేయించింది, ఆ రకంగా అయినా మిమ్మల్ని అడ్డుతొలగించి నా జీవితంలోకి వచ్చేందుకు జ్యోత్స్న ట్రై చేసిందని దీపతో కార్తీక్ చెబుతాడు. రీసెంట్‍గా క్యాటరింగ్ వద్ద అలా చేసిందని అంటాడు. ఇన్ని అరాచకాలు చేసిన జ్యోత్స్న మారిపోయిందంటే ఎలా నమ్మమంటావ్ అని కార్తీక్ అంటాడు. కాలం గొప్పదని, అందరినీ ఏదో ఒక రోజు వాస్తవంలో నిలబెడుతుందని దీప అంటుంది.
పెళ్లి కూడా జ్యోత్స్న ప్లాన్ అయితే.. కార్తీక్ అనుమానం
జ్యోత్స్నకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నావా అని కార్తీక్ అంటే.. ఎందుకు కాకూడదని అంటుంది దీప. దక్కని దాని కోసం ఎంత కాలం ఎదురుచూస్తుందని అంటుంది. క్యాటరింగ్ దగ్గర మీరు చెప్పారు కదా.. ఆ మాటలు తన మీద పని చేసి ఉండొచ్చని అంటుంది. ఇంటికి వెళ్లి ఆలోచించి అర్థం చేసుకొని.. అమ్మానాన్న మాటలను జ్యోత్స్న విన్నదేమోనని దీప చెబుతుంది. “నువ్వు అన్న మాట నిజమైతే నాకూ సంతోషమే. అలా కాకుండా ఈ పెళ్లి కూడా జ్యోత్స్న ప్లానే అయితే” అని కార్తీక్ అనుమానిస్తాడు. ఏదో చేసేందుకే పెళ్లి ఒప్పుకుందనేలా డౌట్ పడతాడు.
నీకు ఎలా నమ్మకం కుదిరిందో
జ్యోత్స్న ఇప్పటికే చాలా తప్పులు చేసింది, కానీ ఇప్పుడు అవి తెలుసుకొని జీవితానికి ఏం కావాలో ఆలోచించందని దీప అంటుంది. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటోందని చెబుతోంది. ఆ మనిషి అలాంటిది కాదు.. కానీ నీకు ఎలా నమ్మకం కుదిరిందో ఏంటో అని కార్తీక్ అంటాడు. “జ్యోత్స్న మొడలో మూడు ముళ్లు పడితే మీకే నమ్మకం కుదురుతుంది. జ్యోత్స్న మారింంటే ఎవరికైనా అనుమానమే. కానీ మారింది. ఈ వాస్తవాన్ని ఒప్పుకొని తీరాల్సిందే కార్తీక్ బాబు” అని మనసులో అనుకుంటుంది దీప.
శ్రీధర్.. మూడో పెళ్లి కల
మూడో పెళ్లి చేసుకోవాలని, తాను అక్క (కాంచన) దగ్గరికి వెళ్లిపోతానని కావేరి తనను బతిమాలినట్టు కలకంటాడు శ్రీధర్. ఆస్తి మొత్తం రాసిచ్చేసి, మూడో పెళ్లి చేసి తాను వెళ్లిపోతానని కావేరి చెప్పినట్టు ఊహించుకుంటాడు. మొహమాటంగానే కలలో మూడో పెళ్లికి ఒప్పుకుంటాడు. మా పెళ్లికి నా పెద్ద పెళ్లాన్ని పిలుస్తావా.. సమాధానం చెప్పు కావేరి అంటూ కలవిస్తూ మంచంపై నుంచి కిందపడతాడు. ఏంటి ఇదంతా కలా అంటూ లేస్తాడు. అంటే రెండో పెళ్లాం.. నా మూడో పెళ్లి చేయడం లేదా.. మరి ఇలా ఎందుకు కల వచ్చిందని అనుకుంటాడు. ఇలాంటి కల వచ్చిందంటే ఇంట్లో ఏదో కుట్ర జరుగుతోందని ఆలోచిస్తాడు.
కావేరికి స్వప్న ఫోన్
తల్లి కావేరికి స్వప్న ఫోన్ చేస్తుంది. శ్రీధర్ వెనుక నుంచి చూస్తుంటాడు. మీ మామయ్య దాసుకు ఎలా ఉందని స్వప్నను కావేరి అడుగుతుంది. అలాగే ఉందని, మనిషి లేచి తిరుగుతున్నాడని స్వప్న అంటుంది. అందుబాటులో స్వీట్ ఉంటే తీసి నోట్లో వేసుకో అని స్వప్న చెబుతుంది. ఏమైందని కావేరి అడుగుతుంది. జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని స్వప్న అంటుంది. ఇది నిజంగా శుభవార్తేనే అని కావేరి సంతోషిస్తుంది. కళ్లప్పగించి చూస్తుంటాడు శ్రీధర్. ఇలాంటి శుభవార్తలు మీ డాడీతో చెప్పకూడదే అని కావేరి అంటుంది. ఏదో దాస్తోందని శ్రీధర్ అనుకుంటాడు. ఇక కార్తీక్‍కు కష్టాలు పోయినట్టే అని స్వప్నతో కావేరి అంటే.. ఇది ఎలా అని శ్రీధర్ ఆలోచిస్తాడు. ఇంతకీ ఆ మాటలకు అర్థం ఏంటి.. శుభవార్త.. కార్తీక్ కష్టాలు పోయాయి.. ఈ రెండింటికీ ఏదో లింక్ ఉందని అనుకుంటాడు. పెద్దాయన కార్తీక్‍కు రావాల్సిన వాటా ఇచ్చి ఉంటాడు అని ఊహించుకుంటాడు శ్రీధర్. బాకీ ఉన్నందుకు తనకు చెప్పొద్దని అలా అని ఉంటుందని ఆలోచిస్తాడు. డబ్బు ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసుగా అని అనుకుంటాడు.
పారు ఆశ.. శివన్నారయణ ఝలక్
పారిజాతం.. పారిజాతం అని అరుస్తాడు శివన్నారాయణ. వయసైపోయినా వాయిస్ తగ్గలేదని, సేవలు చేయలేక చస్తున్నానని విసుక్కుంటుంది పారిజాతం. ఇంతలో చాలా నగలను అక్కడ లైన్‍లో పెట్టి ఉంటాడు శివన్నారాయణ. ఇవన్నీ తన మొదటి భార్య నగలేనని శివన్నారాయణ అంటాడు. తాను వీటిని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని ముచ్చట పడుతుంది పారిజాతం. ఒంటిపై ఉంటే ఎంత అందంగా ఉంటాయోనని పారిజాతం అంటుంది.
ఈ నగలన్నీ నాకు ఇచ్చేందుకు పిలిచారా.. ఏవండి అంటూ సంతోషంగా శివన్నారాయణ కాళ్లపై పడుతుంది పారు. సమయానికి పూలు, అగరుబత్తీలు ఉంటే పూజ చేసేదాన్ననేలా మాట్లాడుతుంది. ఈ నగలను మీ చేతులతో అలంకరించుకోవాలని నా కోరిక అని చెబుతుంది. ఇంతలో పారిజాతానికి ఝలక్ ఇస్తాడు శివన్నారాయణ. “పిలిచింది నగలు పెట్టుకోవడానికి కాదు. మోయడానికి.. పట్టు జోత్స్న దగ్గరికి” అని శివన్నారాయణ అంటాడు. ఆశ పెట్టి.. గుండెలపై కొట్టావని పారిజాతం బాధపడుతుంది. అయినా జ్యోత్స్నవి అంటే నావే కదా అని మనసులో అనుకుంటుంది.
అన్నీ నాతో ఉండాలంటే.. దీపను బతకనివ్వకూడదు
పెళ్లికి ముస్తాబవుతున్న జ్యోత్స్న దగ్గరికి శివన్నారాయణ, పారిజాతం వస్తారు. పారు నగలు మోస్తుంటుంది. పెళ్లి కూతురు ముస్తాబు ఎంత వరకు వచ్చిందని శివన్నారాయణ అంటే.. నగలు పెట్టడమే మిగిలిందని సుమిత్ర చెబుతుంది. తన మొదటి భార్య నగలన్నీ జ్యోత్స్న ముందు పెట్టిస్తాడు శివన్నారాయణ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని సుమిత్ర అంటే.. ఇస్తానంటే బంగారం వద్దనకూడదని పారిజాతం అంటుంది. పెళ్లి వాళ్లు వచ్చే ముందు జ్యోత్స్నకు అలంకరించాలని చెబుతాడు. థ్యాంక్స్ చెబుతుంది జ్యోత్స్న. ఇవన్నీ ఈ ఇంటి వారసురాలికి చెందాల్సినవే అని శివన్నారాయణ అంటాడు. “అంటే దీపకు చెందాల్సినవి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అన్నీ నాతోనే ఉండాలంటే దీప ఉండకూడదు.. దీపను బతకనివ్వకూడదని ఆలోచిస్తుంది.
దీప చేయి పట్టుకున్న కార్తీక్
గాజుల కోసం వెతుతూ ఉంటుంది. ఇంతలో సడెన్‍గా కార్తీక్ వస్తే తూలిపోతుంది దీప. పడిపోతున్న దీప చేతిని కార్తీక్ పట్టుకుంటాడు. గాజులు తన వద్ద ఉన్నాయని చెబుతాడు. పాత గాజులు తనకు నచ్చలేదని, నువ్వు నాకు షర్ట్ తీసుకోలేదా అని కార్తీక్ అంటాడు. నేను ఎలా ఉంటే ఎవరికి తెలుసు అని దీప అంటుంది. తాను ఇప్పుడు ఓ దేవుడు ఇచ్చిన నీడలో ఉన్నానని చెబుతుంది. ప్రాణాలు అడ్డుపెట్టి ప్రాణాలు పోశారు.. నా మెడలో తాళి కట్టి చిత్తుకాగితంలా ఉండాల్సిన జీవితాన్ని శుభలేఖ చేశారని అంటుంది.
గుండెల్లో గుడి కట్టా..
దీపను దేవతతో పోలుస్తాడు కార్తీక్. తవ్వకాల్లో విగ్రహం దొరికితే దేవాలయం కడతారని, నీకు నా గుండెలోని గుడి కట్టానని చెబుతాడు కార్తీక్. ఇప్పుడు నువ్వు నాకు దేవతవు అని, ఇక్కడ పూజించుకుంటున్నానని అంటాడు. ఈ ఆలయం ఎప్పటికీ శిథిలం కాదని చెబుతాడు. ఎప్పుడూ ఇక్కడే దీప పూజలు అందుకుంటూ ఉంటుందని అంటాడు.
నా ప్రాణదాతవి కూడా..
ఆస్థాయి నాకు ఉందా అని దీప అంటే.. “ఉంది దీప. ఎందుకంటే నువ్వు నా భార్యవు మాత్రమే కాదు.. నా ప్రాణదాతవు కూడా” అని కార్తీక్ అంటాడు. దీంతో నిజం తెలిసిపోయిందా అని మరోసారి కంగారు పడుతుంది దీప. “కార్తీక్ బాబుకు నేనే ప్రాణదాత అని ఎలా తెలిసింది” అని మనసులో అనుకుంటుంది దీప. నిజం చెప్పకూడదని ఇలా చెప్పేశానేంటి అని కార్తీక్ ఆలోచిస్తాడు. నేను మీ ప్రాణదాతను ఏంటి కార్తీక్ బాబు అని దీప అంటే.. రక్తమిచ్చి కాపాడావు కదా అందుకే అలా అన్నాను లేని కవర్ చేస్తాడు కార్తీక్.
మీకు నిజం తెలిసిపోయిందని అనుకున్నానని దీప అనుకుంటే.. నిజం తెలిసింది.. కానీ ఈ దాగుడుమూతలు బాగున్నాయని కార్తీక్ మనసులో అనుకుంటాడు. మీ దగ్గర ఆ అమ్మాయి ఫొటో ఉందా అని దీప అడుగుతుంది. కొద్ది రోజులు ఆగితే ఆ అమ్మాయిని నీ ముందు నిలబెడతానని కార్తీక్ చెబుతాడు. ఇలా ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి. ఎప్పటికైనా నా ముందు నిలబడుతుందని నువ్వు అన్నావ్ కదా.. అలాగే జరుగుతుందని కార్తీక్ అంటాడు.
గాజులు వేసిన కార్తీక్
గాజులు వేస్తానని కార్తీక్ అంటాడు. మీరు గాజులు వేస్తారా అని దీప అంటుంది. మూడు ముళ్లే వేశా.. గాజులు వేయలేనా అని కార్తీక్ అంటాడు. దీప చేతికి గాజులు తొడుగుతాడు కార్తీక్. ఇద్దరూ ఇలా కళ్లలోకి చూసుకుంటారు. గాయాలు చేసిన గతాన్ని మరిచిపోయి నాలో కలిసిపోతావని ఎదురుచూస్తున్నానని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఎవరికీ కనిపించని పెద్ద గోడ మనిద్దరి మధ్య ఉందని, దాన్ని దాటి ఇద్దరం రాలేకపోతున్నామని ఆలోచిస్తాడు. కార్తీక్‍వైపు నవ్వుతూ చూస్తుంటుంది దీప. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 15) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం