





Best Web Hosting Provider In India 2024

AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. ఏమైందంటే!
AR Rahman hospitalised: మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు.

AR Rahman hospitalised: ఆసుపత్రిలో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్.. ఏమైందంటే!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో నేటి (మార్చి 16) ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అనంతరం రహమాన్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనకు ఏంజియోగ్రామ్ నిర్వహించారు. ప్రస్తుతం రహమన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం.
ఉదయాన్నే ఛాతిలో ఇబ్బందిగా ఉండటంతో 7.10 గంటల సమయంలో చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో రహమాన్ చేరారు. స్పెషలిస్టులతో కూడిన వైద్య బృందం ఆయనకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ సహా మరిన్ని టెస్టులను నిర్వహించారు. అనంతరం ఏంజియోగ్రామ్ చేశారని సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్
మరిన్ని తెలుగు సినిమా న్యూస్, టీవీ సీరియల్స్, ఓటీటీ న్యూస్, మూవీ రివ్యూలు, బాలీవుడ్, హాలీవుడ్ తాజా అప్డేట్స్ చూడండి.