




Best Web Hosting Provider In India 2024

Kayadu Lohar Memes: తన మీద తానే మీమ్స్ క్రియేట్ చేసుకున్న డ్రాగన్ హీరోయిన్.. పరువు తీసేసిన తమిళ హీరో!
Kayadu Lohar Created Memes On Herself: తన మీద తానే మీమ్స్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ కయాదు లోహర్. ఇటీవల డ్రాగన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కయాదు లోహర్ తనపై తానే మీమ్స్ క్రియేట్ చేసుకుని వైరల్ అయింది. ఈ విషయాన్ని బయటపెట్టి తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ కయాదు లోహర్ పరువు తీశాడు.

Kayadu Lohar Created Memes On Herself: తెలుగులోకి ఎప్పుడు ఎవరో ఒక కొత్త హీరోయిన్ అడుగుపెడుతూనే ఉంటారు. అలా, రీసెంట్గా టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటి కయాదు లోహర్. దర్శకుడిగా, హీరోగా అలరించిన ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్.
వంద కోట్ల కలెక్షన్స్
ఈ డ్రాగన్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌తోపాటు కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన డ్రాగన్ రిలీజ్ అయిన తొలి 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా దాదాపుగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లతో డ్రాగన్ సినిమా దూసుకుపోతోంది. అయితే, డ్రాగన్ మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంది సినిమా టీమ్. ఈ క్రమంలోనే తెలుగులో యాంకర్ మంజూష చేసిన ఇంటర్వ్యూలో ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహర్, డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు పాల్గొన్నారు.
ఫోన్లో ఏం లేదు
ఇంటర్వ్యూలో “లవ్ టుడే సినిమాలోలాగా మీరిద్దరు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా” అని యాంకర్ మంజూష చెప్పింది. దానికి “సూపర్. నాకు ఎప్పుడు నటీ, నటులు ఫోన్స్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం చూడటం చాలా ఇష్టం” అని డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు అన్నాడు. “ఇంట్రెస్టింగ్, అవును. నా ఫోన్లో ఏం లేదు అసలు” అని కయాదు లోహర్ అంది.
“ఓకే అది నేను ఎక్స్ఛేంజ్ చేసి చూసి చెబుతాను” అని ప్రదీప్ రంగనాథన్ అంటాడు. ప్రదీప్, కయాదు లోహర్ ఇద్దరు ఫోన్లను అన్‌లాక్ చేసి మార్చుకుని చూస్తారు. అప్పుడు “నీ ఫోన్లో ఒక డిఫరెంట్ యాప్ కనిపిస్తుంది” అని ప్రదీప్ రంగనాథన్ అన్నాడు. “ఏంటా డిఫరెంట్. షటప్ (నోర్మూసుకో)” అని సిగ్గుతో, కాస్తా నవ్వుతూ అంది కయాదు లోహర్.
తెలుగులో టాప్ హీరోయిన్
“మీమ్స్ క్రియేషన్ యాప్ ఆ” అని ప్రదీప్ రంగనాథన్ అనేసరికి కయాదు లోహర్ నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతుంది. “అందులోకి వెళ్లకుండా ఉంటావా ప్లీజ్” అని కయాదు లోహర్ రిక్వెస్ట్ చేస్తుంది. అయినా వినకుండా ప్రదీప్ చూస్తాడు. అందులో ఉన్నది డైరెక్టర్‌కు చూపిస్తూ చదువుతాడు. “రాబోయే రోజుల్లో తెలుగులో కయాదు లోహర్ టాప్ హీరోయిన్” అన్నట్లుగా ఉంటుంది. అది చూసి అశ్వత్ మారిముత్తు తెగ నవ్వేస్తాడు.
“నువ్ నీ మీమ్స్‌ను సొంతంగా క్రియేట్ చేసుకుంటున్నావా. నువ్వే మీమ్స్ క్రియేట్ చేసుకుని మీమ్స్ పేజీల్లో పెట్టిస్తున్నావా” అని పరువు తీసేస్తాడు ప్రదీప్ రంగనాథన్. యాంకర్ మంజూషకు అర్థం కాకపోయేసరికి డైరెక్టర్, హీరో ఇద్దరు కయాదు లోహర్ చేసింది చెబుతారు. “తన ఫోటో తానే తీసుకుని తెలుగులో నెక్ట్స్ టాప్ హీరోయిన్ కయాదు లోహర్ అని రాసింది” అని డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు చెబుతాడు.
అబద్ధంలా చూపించాలి
అది విని యాంకర్ తెగ నవ్వేస్తుంది. “నీ మీమ్స్‌ను సొంతంగా క్రియేట్ చేసుకుని మీమ్స్ ఛానెల్స్‌కు ఇచ్చి సర్క్యూలేట్ చేస్తున్నావా” అని ప్రదీప్ అంటాడు. “అదంతా పీఆర్. ఎవరు చేయనప్పుడు నువ్వే చేసుకోవాలి. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ (నువ్ సాధించేవరకు అబద్ధంలా అయినా చూపించాలి)” అని కయాదు లోహర్ ఆన్సర్ ఇస్తుంది.
దాంతో ప్రదీప్, అశ్వత్ మారిముత్తు ఇద్దరు ఆశ్చర్యపోతారు. నైస్ ఆన్సర్ అని ఇద్దరు మెచ్చుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం