Computer Science : ఏ కాలేజ్​లో కంప్యూటర్​ సైన్స్​ చేస్తే బెస్ట్​? ఇండియాలో టాప్​ ఇవే..

Best Web Hosting Provider In India 2024


Computer Science : ఏ కాలేజ్​లో కంప్యూటర్​ సైన్స్​ చేస్తే బెస్ట్​? ఇండియాలో టాప్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Published Mar 16, 2025 05:30 PM IST

Computer Science : కంప్యూటర్​ సైన్స్​ చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నారా? మరి కంప్యూటర్​ సైన్స్​లో ఇండియాలోని ఏ కాలేజ్​ లేదా యూనివర్సిటీలో బెస్ట్​? వివరాల్లోకి వెళితే..

సీఎస్​ఈకి ఏ కాలేజ్​ బెస్ట్​?
సీఎస్​ఈకి ఏ కాలేజ్​ బెస్ట్​?

ఇండియా జాబ్​ మార్కెట్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్​కి ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం సంపాదించుకుంటే లక్షల్లో జీతాలు పొందవచ్చు. అందుకే చాలా మంది విద్యార్థి దశలోనే సాఫ్ట్​వేర్​ జాబ్​ని టార్గెట్​ చేస్తుంటారు. కంప్యూటర్​ సైన్స్​ కోసం మంచి ఇంజినీరింగ్​ కాలేజ్​లో చేరాలను ప్లాన్​ చేస్తుంటారు. మరి ఇండియాలో సీఎస్​ఈ (కంప్యూటర్​ సైన్స్​ ఇంజినీరింగ్​) కోసం బెస్ట్​ కాలేజ్​ లేదా యూనివర్సిటీ ఏది? క్యూఎస్​ 2025 (క్వాక్వారెల్లి సైమండ్స్​) ర్యాంకింగ్స్​ ప్రకారం ఇండియాలో సీఎస్​ఈ కోసం బెస్ట్​ యూనివర్సిటీల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

క్యూఎస్​ సబ్జెట్​ ర్యాంకింగ్స్​- ఈ యూనివర్సిటీల్లో సీఎస్​ఈ బెస్ట్​..!

ఐఐటీ దిల్లీ– 64వ ర్యాంక్​

ఐఐటీ బాంబే- 76వ ర్యాంక్​

ఐఐటీ మద్రాస్​- 107వ ర్యాంక్​

ఐఐఎస్​సీ- 110వ ర్యాంక్​

ఐఐటీ కాన్పూర్​- 110వ ర్యాంక్​

ఐఐటీ ఖరగ్​పూర్​- 110వ ర్యాంక్​

వెల్లూర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ- 110వ ర్యాంక్​

ఐఐటీ రూర్కీ- 201-250 ర్యాంక్​ల మధ్యలో ఉంది

అన్నా యూనివర్సిటీ- 251-300

ఐఐటీ గువాహటీ- 251-300

యూనివర్సిటీ ఆఫ్​ దిల్లీ- 251-300

బిట్స్​ పిలానీ- 301-350

ఛండీగఢ్​ యూనివర్సిటీ- 351-400

ఇండియన్​ స్టాటిస్టికల్​ ఇన్​స్టిట్యూట్​- 401-450

“మా టాప్​ సీఎస్​-ఐటీ ర్యాంకింగ్స్​లో 800 యూనివర్సిటీలు చేరాయి. టాప్​ 3 వర్సిటీలు యూఎస్​, సింగపూర్​, యూకేలో ఉన్నాయి. ఇవి టాప్​-10లో ఎప్పుడూ కచ్చితంగా ఉంటాయి,” అని క్యూఎస్​ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

క్యూఎస్​ ర్యాంకింగ్స్​ ప్రకారం.. అంతర్జాతీయంగా చూసుకుంటే ఎంఐటీ (మాస్సాచుసెట్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ) సీఎస్​ఈకి టాప్​లో ఉంది. స్టాన్​ఫర్డ్​ యూనివర్సిటీ రెండో ర్యాంక్​లో ఉంది. కార్నెగి మెల్లోన్​ యూనివర్సిటీకి 3వ ర్యాంక్​ వచ్చింది. నేషనల్​ యూనివర్సిటీ ఆఫ్​ సింగపూర్​కి 5వ ర్యాంక్​ దక్కింది.

అమెరికాలో ఏ యూనివర్సిటీలో చేరితే మంచిది..?

అమెరికాలో చదువుకోవాలని చాలా మంది కలలుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి అమెరికాకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది. మరి మీరు కూడా యూఎస్​లో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? ఏ యూనివర్సిటీలో చదువుకుంటే మంచిది? అని ఆలోచిస్తున్నారు? అయితే ఇది మీకోసమే!

టీహెచ్​ఈ వరల్డ్​ రెప్యుటేషన్​ ర్యాంకింగ్​ 2025 : అమెరికా వర్సిటీలు- ర్యాంకులు..

హార్వర్డ్​ యూనివర్సిటీ- 1వ ర్యాంక్​

మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఎంఐటీ)- 2వ ర్యాంక్​

స్టాన్​ఫర్డ్​ వర్సిటీ- 4

యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా, బెర్క్​లే- 6

ప్రిన్స్​టన్​ యూనివర్సిటీ- 7

యేలే యూనివర్సిటీ- 9

కాలిఫోర్నియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (కాల్​టెక్​)- 13

యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా (లాస్​ఏంజెల్స్​)- 15

యూనివర్సిటీ ఆఫ్​ చికాగో- 16

కొలంబియా యూనివర్సిటీ- 17

యూనివర్సిటీ ఆఫ్​ మిషిగాన్​- 18

కార్నెల్​ యూనివర్సిటీ- 20

యూనివర్సిటీ ఆఫ్​ పెన్సిల్వేనియా- 22

జాన్స్​ హాప్​కిన్స్​ యూనివర్సిటీ- 23

యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్​- 26

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మరిన్ని కెరీర్​ ఎడ్యుకేషన్​ సంబంధిత వార్తల కసం హెచ్​టీ తెలుగుని ఫాలో అవ్వండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link