





Best Web Hosting Provider In India 2024

Jaggery and Kidneys: తరచూ బెల్లం తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయా? ఎందుకలా జరుగుతుంది?
Jaggery and Kidneys: బెల్లం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెబుతారు. మరి మూత్రపిండాలు ఎలా దెబ్బతింటాయి అనే సందేహం మీ అందరిలో రావచ్చు. బెల్లం ఆరోగ్యానికి మంచిది. కానీ బెల్లంలో కలిపే కొన్ని పదార్థాలే కిడ్నీలకు హాని చేస్తాయి.

బెల్లం లేదా పంచదారలో ఏది ఆరోగ్యానికి మంచిదో అందరికీ తెలిసిందే. పంచదారకు బదులు బెల్లాన్ని వాడమని వైద్యులు కూడా సూచిస్తారు. బెల్లాన్ని ముడి చక్కెరగా చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి ప్రాసెస్ చేయని పంచదార రూపమే బెల్లం. అందుకే పంచదారకు బదులు బెల్లాన్ని తినమని చెబుతారు. దీంట్లో ఇనుము కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే బెల్లం తినడం వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయని అంటారు. దీనికి కారణం ఏంటో తెలుసుకోండి.
బెల్లంతో ఉపయోగాలు
పంచదారకు ప్రత్యామ్నాయంగా పరిగణించే బెల్లంలో ఇనుము, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియకు ఎంతో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది. తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు ఉండవు. స్థిరంగా శక్తి విడుదల జరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా బెల్లం తినడం వల్ల అంతా ఆరోగ్యకరమే. బెల్లం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కూడా. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
కల్తీ బెల్లంతోనే ఇబ్బందులు
బెల్లం సహజంగా ఆరోగ్యానికి మంచిదే. కానీ బెల్లాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. అందులో వాషింగ్ సోడా, మెటానిల్ పసుపు వంటి హానికరమైన రసాయనాలను కలిపి కల్తీ బెల్లాన్ని మార్కెట్లో అమ్ముతున్నారు. బెంగళూరులో ఇలాంటి కల్తీ బెల్లం భారీ స్థాయిలో బయటపడింది. అలాంటి కల్తీ బెల్లం తింటే మూత్రపిండాలు కచ్చితంగా దెబ్బతింటాయి.
బెల్లం మంచి రంగు కనబడడానికి ఎక్కువ పరిమాణం లో పెంచడానికి దానిలో సుద్ద పొడి, వాషింగ్ సోడా కలుపుతున్నారు. అలాగే రంగు కోసం మెటానిల్ పసుపును వాడుతున్నారు. మెటానిల్ పసుపు అనేది ఒక కృత్రిమ బంగారు పసుపు రంగు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడకూడదని నిషేధం విధించారు. అయినా సరే దీన్ని దొంగ చాటుగా వాడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు కొంతమంది కల్తీ రాయుళ్లు.
అలాంటి కల్తీ బెల్లం తింటే కచ్చితంగా కొద్దికాలంలోనే మూత్రపిండాలు దెబ్బ తినడం ప్రారంభమవుతాయి. అందుకే అలాంటి కల్తీ బెల్లాన్ని కాకుండా గ్రామాల నుంచి లేదా సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన బెల్లాన్ని కొనుక్కోవడం మంచిది. స్వచ్ఛమైన బెల్లం సాధారణ ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. అదే కల్తీ చేసినదైతే విపరీతమైన ప్రకాశవంతమైన పసుపు రంగులో లేదా కాస్త తెలుపు రంగులో కనిపిస్తుంది. అలా అలాంటి రంగుల్లో కనిపిస్తే బెల్లాన్ని కొనక పోవడమే మంచిది.
మెటానిల్ పసుపుతో
కల్తీ బెలంలో వాడే సింథటిక్ ఫుడ్ డై కలర్ అయినా మెటానెల్ పసుపు శరీరంలో చేరితే వికారం, వాంతులు, పొట్టనొప్పి, విరేచనాలు వంటివి కలుగుతాయి. అలాగే కాలేయం మూత్రపిండాలపై కూడా విషప్రయోగంలా జరుగుతుంది. ప్రధాన అవయవాల్లో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల నాడి వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. కాబట్టి కల్తీ బెల్లాన్ని గుర్తించి తినకపోవడమే మంచిది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం