Small Grains: మిల్లెట్లను తినేటప్పుడు, వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. చెక్ చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Small Grains: మిల్లెట్లను తినేటప్పుడు, వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. చెక్ చేసుకోండి!

 
 

Small Grains: మిల్లెట్లు చాలా ఆరోగ్యకరమైనవే. కానీ, వాటిని తినేటప్పుడు, వండేటప్పుడు ఇటువంటి తప్పులు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ చిరుధాన్యాలను అన్నింటితో పోల్చి తినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

 

మిల్లెట్లను ఎలా తినాలో తెలుసా?
 

ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి ఫాస్ట్ ఫుడ్ ప్రియారిటీ తగ్గిపోయి అంతా మిల్లెట్స్ వైపు నడుస్తున్నారు. డయాబెటిస్, అరుగుదల లేకపోవడం వంటి సమస్యలు రాకుండా చేస్తాయనే నమ్మకంతో ఇలా చేస్తున్నారు. కానీ, చిరు ధాన్యాలుగా పిలుచుకునే మిల్లెట్స్‌ను సరైన పద్దతిలోనే తింటున్నారా..?, వండే విధానం సరైనదేనా? అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, వాటిని వండే, తినే విధానాన్ని బట్టి వాటిల్లో పోషక విలువలు మారిపోతుంటాయి.

 

పైన పొట్టు ముఖ్యం

వరి గింజల పైన పొట్టు ఉంటుంది. దాని లోపలే బియ్యం ఉంటుంది. అది మూడు దశల్లో ఉంటుంది. మొదటిది బ్రాన్ (Bran). తర్వాత ఎండోస్పెర్మ్. చివరిది జెర్మ్. అలాగే, మిల్లెట్స్ కూడా. రాగులు, వరగు, సామె, కుదురు వంటి వాటిలోనూ మూడు దశలు ఉంటాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే, దంపుడు బియ్యం అని చెప్పే బ్రౌన్ రైస్‌లో మొదటి దశను మాత్రమే తొలగించి, మిగిలిన రెండు దశలతో కలిపి విక్రయిస్తారు. అదే విధంగా చిన్నధాన్యాల విషయంలోనూ జరుగుతుంది. కానీ, బ్రాన్ అనే భాగంలోనే ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు, న్యూట్రి యాసిడ్స్ ఉంటాయి.

చక్కెర పెరగకుండా ఉండటం కోసం

ఒక అధ్యయనం ప్రకారం, ఇండియన్ మార్కెట్లలో పైభాగంలో ఉన్న బ్రాన్ తొలగించి, లోపలి కెర్నల్‌తో కలిపి మాత్రమే చిరుధాన్యాలను విక్రయిస్తున్నారు. దీన్ని తింటే బియ్యంలో ఉన్న చక్కెర కంటే ఎక్కువగా ఉంటుంది. కెర్నల్ అంటే విత్తనం. పైభాగంలో ఉన్న బ్రాన్ తో కలిపి తింటేనే చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కానీ, మార్కెటింగ్ చేసేటప్పుడు పైభాగంలో ఉన్న బ్రాన్‌ను తొలగిస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి, మార్కెట్లో దొరికే బ్రాన్ లేని ధాన్యం తీసుకోకపోవడమే మంచిది. పూర్తి ధాన్యంగా ఉన్నప్పుడే కొనుగోలు చేయాలి.

 

నేరుగా కొనుగోలు చేయాలి:

సాధ్యమైనంత వరకు, పంటలు పండించే గ్రామాలకు వెళ్లి రైతుల నుండి నేరుగా కొనుక్కోవడమే బెటర్. అది కాకపోయినా, ఆర్గానిక్ దుకాణాలలోనూ వాటిని కొనుగోలు చేయవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలంటే, చాలా లేత రంగులో ఉంటే అది పాలిష్ చేసిన అన్నం అని అర్థం. అలా కొన్న చిన్నధాన్యాలను ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు నీటిలో నానబెట్టి వండుకుంటే మనకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి.

మూడు పూటలా తినవద్దు

రక్తంలో చక్కెర ఉందని తెలిసిన తర్వాత, క్రమంగా చిన్నధాన్యాల ఆహారాలకు అలవాటు పడండి. కానీ, మూడు పూటలా చిన్నధాన్యాల ఆహారాలను తినకండి. మధ్యాహ్నం మొదటి భోజనంలో తీసుకోండి. లేదంటే, జావ మాదిరిగా తీసుకోవచ్చు. ఎందుకంటే, జావగా చేసేటప్పుడు, అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. వేసవికాలానికి అది అనుకూలంగా పనిచేస్తుంది.

కలిపి తినడం మానుకోండి:

చాలామంది చేస్తున్న పొరబాటే ఇది. ఏ ఒక్క ధాన్యంలోనూ అన్ని పోషక విలువలు ఉండవు. పైగా ఒక్కో దానికీ జీర్ణకాలం అనేది వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి పోషకాల కోసం తినేటప్పుడు, గంజిగా చేసుకుని తాగేటప్పుడు చిన్నధాన్యాలను మిక్స్ చేయకండి. ఒక రోజుకు ఒక చిన్నధాన్యం అని పెట్టుకోండి. ఒకే రోజు మూడు రకాల చిన్నధాన్యాలను తినకండి.

 

ఏదో ఒకటి మాత్రమే

ఇక స్వీట్స్ విషయంలోనైతే, చిన్న ధాన్యాలతో చేసిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది. చిన్న ధాన్యాలపై మక్కువతో దొరికిన ప్రతి స్వీటును లాగించేస్తే ఏ మాత్రం ప్రయోజనకారిగా ఉండదు. కేవలం, ఏదో ఒక చిన్నధాన్యంతో చేసిన తింటేనే ప్రయోజనం.

కాబట్టి మీరు కూడా మార్కెట్లో కొనే ముందే చిన్నధాన్యాలకు పాలిష్ లేకుండా ఉన్నవాటినే ఎంచుకుని కొనుగోలు చేయండి. తర్వాత, మొదటి రోజు నానబెట్టి మరుసటి రోజు తినడం మంచిది. అలా చిన్నధాన్యాలకు శరీరాన్ని అలవాటు చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోండి. చిన్నధాన్యాలను మిక్స్ చేసి గంజిలాగా, ఉండలాగా తినకూడదు. చివరగా చిన్నధాన్యాల స్నాక్స్ లను పూర్తిగా వదిలేయండి. అవి పూర్తి భోజనంగా మాత్రమే తీసుకోవాల్సినవి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024