Best Web Hosting Provider In India 2024

OTT Bold: వేశ్యను ప్రేమించి పెళ్లి చేసుకునే యువరాజు.. ఓటీటీలోకి వచ్చేసిన ఐదు ఆస్కార్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Anora OTT Streaming: అనోరా చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఐదు ఆస్కార్లు సాధించిన ఈ మూవీ రెంట్ లేకుండా స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. రెండు భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది.
హాలీవుడ్ బోల్డ్ రొమాంటిక్ మూవీ ‘అనోరా’ ఐదు ఆస్కార్లను సాధించింది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ పాపులర్ అయింది. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై బెస్ట్ మూవీతో పాటు మొత్తంగా ఈ సినిమా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికి సీన్ బేకర్ దర్శకత్వం వహించారు. మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్స్టెయిన్ ప్రధాన పాత్రలు పోషించిన అనోరా మూవీ ఇండియాలో రెంట్ లేకుండా నేడు ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. రెగ్యులర్ స్ట్రీమింగ్ షురూ అయింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అనోరా చిత్రం నేడు (మార్చి 17) జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు హాట్‌స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చింది. అంటే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న యూజర్లు రెంట్ చెల్లించే అవసరం లేకుండా అనోరా చిత్రాన్ని చూసేయవచ్చు.
అనోరా చిత్రం గతేడాది అక్టోబర్ 18వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా మరికొన్ని ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శితమయ్యాక.. థియేటర్లలోకి వచ్చింది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. 44 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. దాదాపు 6 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది.
ఆస్కార్‌లో ఆధిపత్యం.. ఐదు అవార్డులు
ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో అనోరా చిత్రం ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదు అవార్డులను దక్కించుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో ఈ మూవీకి పురస్కారాలు దక్కాయి. ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు మైకీ మ్యాడిసన్. నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ సీన్ బేకర్. ఈ ఏడాది ఆస్కార్లలో అత్యధిక అవార్డులు గెలిచిన చిత్రంగా అనోరా నిలిచింది. అంచనాలకు మించి పురస్కారాలను కైవసం చేసుకుంది.
వేశ్య.. ప్రేమ, పెళ్లి, సవాళ్లు.. స్టోరీలైన్ ఇదే
అనోరా చిత్రంలో అనోరా అనే వేశ్య పాత్ర పోషించారు మైకీ మ్యూడిసన్. వైశ్య వృత్తిలో ఉండే అనోరా (మ్యాడిసన్)తో రష్యాకు చెందిన యువరాజు వన్య జాకరోవ్ (మార్క్ ఇడిల్స్టెయిన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఆ యువరాజు తల్లిదండ్రులు అతడిని అనోరాకు దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో అనోరాకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎదురైన ఇబ్బందులు ఏంటి.. అనోరా, జాకరోవ్ కలిసే ఉండగలిగారా అనే అంశాలు అనోరా చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రాన్ని ఇక జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
అనోరా మూవీ బోల్డ్ స్టోరీలైన్‌తో రూపొందింది. రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వేశ్యల కష్టాలు, మానసిక సంఘర్షణను కూడా డైరెక్టర్ సీన్ బేకర్ ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు. బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉండటంతో ఏ రేటింగ్‌తో ఈ చిత్రం వచ్చింది.