Best Web Hosting Provider In India 2024

Stop Loose Motion: వేసవిలో లూజ్ మోషన్ అవుతున్నప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే అవి త్వరగా ఆగిపోతాయి
Stop Loose Motion: లూజ్ మోషన్ అవడం ప్రమాదకరం. ఆ వ్యక్తికి డీ హైడ్రేషన్ సమస్య త్వరగా వస్తుంది. కాబట్టి లూజ్ మోషన్ త్వరగా అరికట్టాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.
వేసవికాలంలో ఆహారం అరగకపోవడం లేదా నూనె పదార్థాలు అధికంగా తినడం, కారం ఉండే ఆహారాలు తినడం వల్ల నీళ్ల విరోచనాలు అవుతూ ఉంటాయి. లూజ్ మోషన్ వల్ల శరీరంలో శక్తి మొత్తం బయటికి పోతుంది. శరీరం బలహీనంగా మారుతుంది. డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావచ్చు. లూజ్ మోషన్ అవుతున్నప్పుడు మీరు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
నిమ్మకాయ
లూజ్ మోషన్ అవుతున్నప్పుడు నిమ్మకాయ నీరు తాగేందుకు ప్రయత్నించండి. నిమ్మకాయ నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది విరేచనాలు జరుగుతున్నప్పుడు పొట్టలో వాపు, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే లూజ్ మోషన్ వల్ల శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల నీటి కొరతను అధిగమించవచ్చు. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.
పుదీనా
లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు పుదీనా, అల్లం కలిపినా నీటిని తాగడం ఎంతో మంచిది. వీటిలో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయి. ఇవి విరేచనాలు సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తాయి. అల్లం రసం తీసి పుదీనా ఆకులు కలిపిన నీటిలో వేయండి. ఆ నీటిని మెల్లగా సెట్ చేస్తూ ఉండండి. మీకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.
రోజులో 5 నుండి 6 సార్లు కంటే ఎక్కువసార్లు మీకు లూజ్ మోషన్ అయితే ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అయిదారు సార్లు లూజ్ మోషన్ అయితే శరీరంలోని నీరు చాలా మటుకు బయటకు పోతుంది. దీనివల్ల అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక పక్క పైన చెప్పిన పానీయాలను తాగుతూనే వైద్యుల్ని కలిస్తే మంచిది. వారు పరిస్థితిని బట్టి శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ప్రధాన అవయవాలు దెబ్బ తినకుండా కాపాడుతారు.
విరేచనాలు అవుతున్నప్పుడు చప్పటి ఆహారాలు తినడం అలవాటు చేసుకోవాలి. పెరుగు అన్నం తినడం మంచిది. అలాగే అరటిపండ్లు, అన్నం వంటివి తింటే ఎంతో ఉత్తమం. ఇది మలం గట్టిపడేందుకు సహాయపడుతుంది. పంచదార అధికంగా ఉండే పానీయాను తాగకూడదు. ఇవి విరేచనాలు అధికమయ్యేలా చేస్తారు. మీకు విరేచనాలు అవుతున్నప్పుడు టీ, కాఫీలు తాగడం మానేయాలి. అలాగే కేకులు, బిస్కెట్లు, పేస్ట్రీలు వంటివి పూర్తిగా మానేయాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)