Best Web Hosting Provider In India 2024

Court Movie: కోర్ట్ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అయ్యేందుకు 5 కారణాలు.. నాని బ్రాండ్ నుంచి కంటెంట్ వరకు..
Court Movie: కోర్ట్ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ అదరగొడుతోంది. ఈ సినిమా ఈ రేంజ్‍లో సక్సెస్ అయ్యేందుకు ముఖ్యంగా 5 కారణాలు ఉన్నాయి.
కోర్ట్ చిత్రం కలెక్షన్లతో ఆశ్చర్యపరుస్తోంది. పక్కా కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. నేచురల్ స్టార్ నాని బ్యానర్‌లో సుమారు రూ.9కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. మూడు రోజుల్లోనే రూ.25కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పటికే లాభాల్లోకి అడుగుపెట్టింది. ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం దూసుకెళుతోంది. కోర్ట్ సినిమా ఈ రేంజ్‍లో విజయవంతం అయ్యేందుకు 5 కారణాలు ప్రధానంగా ఉన్నాయి.
నాని బ్రాండ్‍పై నమ్మకం
నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఆ బ్యానర్‌లో వచ్చిన ఆ!, హిట్ 1, హిట్ 2 మంచి హిట్ అవడమే కాక ప్రశంసలు దక్కించుకున్నాయి. కోర్ట్ చిత్రాన్ని నాని నిర్మిస్తుండటంతో ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. నాని బ్రాండ్‍తో ఈ మూవీకి మంచి బజ్ నెలకొంది.
ప్రమోషన్లు, నాని కామెంట్లు
కోర్ట్ సినిమాకు ప్రమోషన్లను మూవీ టీమ్ బాగా చేసింది. నాని ఈ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్నారు. కోర్ట్ చిత్రం నచ్చకపోతే తన తదుపరి మూవీ హిట్ 3 చూడొద్దని ఓ కామెంట్ చేశారు. కోర్ట్ సినిమాపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కామెంట్‍పై ముందుకాస్త చర్చ జరిగినా.. కంటెంట్ ఉన్నందుకే నాని అలా అన్నారని రిలీజ్ తర్వాత అర్థమైపోయింది. కోర్ట్ మూవీకి మంచి ఓపెనింగ్ వచ్చేందుకు ప్రమోషన్లలో నాని కామెంట్లు బాగా తోడ్పడ్డాయి.
మంచి కంటెంట్.. పక్కదోవ పట్టకుండా..
కోర్ట్ సినిమాను మంచి స్టోరీలైన్‍తో ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారు కొత్త దర్శకుడు రామ్ జగదీశ్. లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామాతో మూవీ నడిపించారు. పోక్సో చట్టం అనే సెన్సిటివ్ టాపిక్‍ను బాగా డీల్ చేశారు. కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఎక్కడా పక్కదోవ పట్టించకుండా, కమర్షియల్ హంగుల జోలికి పోకుండా మంచి కంటెంట్‍తో రూపొందించారు. ఎక్కడా బోర్ అనే ఫీల్ లేకుండా గ్రిప్పింగ్‍గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు కూడా ఈ మూవీకి జై కొట్టారు. బ్లాక్‍బస్టర్ తీర్పునిచ్చారు. దర్శకుడిగా తొలి మూవీనే అయినా రామ్ జగదీశ్ చాలా మెప్పించారు. మరో టాలెంటెడ్ దర్శకుడిని నాని వెండితెరకు పరిచయం చేశారు.
యాక్టర్ల పర్ఫార్మెన్స్.. శివాజీ విజృంభణ
కోర్ట్ చిత్రానికి నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా ప్లస్ అయింది. లాయర్‌గా ప్రియదర్శి వావ్ అనిపించారు. యువ ప్రేమికులుగా హర్ష్ రోహణ్, శ్రీదేవి మెప్పించారు. సీనియర్ నటుడు శివాజీ పోషించిన మంగపతి క్యారెక్టర్ ఐకానిక్‍గా నిలిచేలా ఉంది. ఆ రేంజ్‍లో ఆ నెగెటివ్ రోల్‍లో ఆయన జీవించేశారు. సాయికుమార్, హర్షవర్దన్, రోహిణి ఆకట్టుకున్నారు. ఇలా యాక్టర్ల పర్ఫార్మెన్స్ కూడా మూవీ సక్సెల్‍లో కీలకమైన రోల్ అయింది.
విజయ్ బుల్గానిన్ మ్యూజిక్
కోర్ట్ మూవీకి విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్. ఈ చిత్రంలోని లవ్ మెలోడీ సాంగ్ ‘ప్రేమలో’ చాలా పాపులర్ అయింది. రిలీజ్‍కు ముందే ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చేందుకు ఇది ఓ కారణం అయింది. ఈ మూవీకి తగ్గట్టే మంచి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు విజయ్.