Footwear Tips: పర్ఫెక్ట్ లుక్ రావాలంటే చెప్పులు కూడా చీరకు తగ్గట్టే ఉండాలి! ఈ 5 చిట్కాలతో ఈజీగా సెలెక్ట్ చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Footwear Tips: పర్ఫెక్ట్ లుక్ రావాలంటే చెప్పులు కూడా చీరకు తగ్గట్టే ఉండాలి! ఈ 5 చిట్కాలతో ఈజీగా సెలెక్ట్ చేసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 17, 2025 02:03 PM IST

Footwear Tips: చీరలో అందంగా కనిపించాలంటే జాకెట్, గాజులు, జ్యువెల్లరీ మాత్రమే కాదు వేసుకునే చెప్పులు కూడా చీరకు సెట్ అయ్యేలా ఉండాలి. అప్పుడే అందం, హుందాగా కనిపిస్తారు. చీరలో పర్ఫెక్ట్‌ రావాలంటే తగిన చెప్పులను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి. ఇందుకు ఈ 5 చిట్కాలు మీకు చాలా బాగా సహాయపడతాయి.

చీరకు తగిన చెప్పులను ఎంచుకోవడం ఎలా
చీరకు తగిన చెప్పులను ఎంచుకోవడం ఎలా (shutterstock)

చీర కట్టుకుని బయటకు లేదా ఫంక్షన్లకు వెళ్లాలనుకున్నప్పుడు చీరకు తగిన బ్లౌజు, గాజులు, జువెల్లరీ, నెయిల్ పాలీష్ వంటివన్నీ ముందే రెడీ చేసుకుంటారు. కానీ చెప్పుల విషయానికి వచ్చే సరికి పట్టించుకోరు. చాలా మంది మహిళలు చెప్పుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. చీరలో కాళ్లు ఎలాగూ కనిపించవు కదా, ఏది వేసుకుంటే ఏమవుతుందిలే అనుకుని వాటి మీద పెద్దగా శ్రద్ద చూపించరు. నిజానికి ఇది చాలా మంది చేస్తున్న పొరపాటని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. చీరలో కాళ్లు కనిపించవు కాదా ఏది వేసుకున్నా ఒకటే అని అభిప్రాయం చాలా తప్పని చెబుతున్నారు.

వాస్తవానికి చీర కట్టుకున్నప్పుడు పాదాలను, పాదరక్షలను ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నారంటే.. మీరు తప్పుడు చెప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు, నడుస్తున్నడు, వెహికిల్ నుంచి దిగుతున్నప్పుడు ఇలా చాలా సార్లు మీరు వేసుకున్న చెప్పులు మీ హుందాతన్నాన్ని ప్రతిబింబిస్తాయి. మీ మొత్తం లుక్‌ను అందంగా మార్చడంలో చెప్పులు ముఖ్య పాత్రను పోషిస్తాయి. మీరు సరైన పాదరక్షలను వేసుకోకపోతే కొన్నిసార్లు మీ చీర లుక్‌తో పాటు, మొత్తం అందం చెడిపోతుంది. కాబట్టి చీరలో పూర్తిగా అందంగా కనిపించాలంటే చీరకు తగిన చెప్పులను కూడా ఎంచుకోవాలి. ఇందుకోసం మీకు ఉపయోగపడే నాలుగు రకాల చిట్కాలను మీకోసం మేం తీసుకొచ్చాం. అవేంటో ఓ లుక్కేండి.

చీరకు తగిన చెప్పులను ఎంచుకునేందుకు ఉపయోగపడే 4 చిట్కాలు?

1. బ్లౌజ్‌తో మ్యాచ్ చేయండి

మీరు కట్టుకునే చీరకు తగిన చెప్పులను ఎంచుకోవాలంటే బ్లౌజ్‌కి మ్యాచ్ అయ్యే పాదరక్షలను సెలెక్ట్ చేసుకోండి. అంటే జాకెట్ ఏ రంగులో ఉంటే చెప్పులు కూాడా అదే రంగులో ఉండేలా చూసుకోండి. ఫ్యాషన్ భాషలో దీన్ని శాండ్‌విచ్ పద్ధతి(sandwich method) అంటారు. చూపరుల కంటిని పై నుండి క్రిందికి ఆకర్షించడం ద్వారా సమతుల్య, ఉద్దేశపూర్వక రూపాన్ని సృష్టించడంలో ఈ పద్ధతి సహాయపడుతుంది. ఇది ఒక పొందికైన, స్టైలిష్ దుస్తులను సృష్టిస్తుంది. ఈ విధంగా మీరు చీరలో మరింత అందమైన లుక్‌ను పొందవచ్చు.

2. ఆభరణాలతో సరిపోల్చండి

మీరు చీరలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే చెప్పులను చీరతో కాకుండా మీ హ్యాండ్ బ్యాగ్, జ్యువెల్లరీ, పర్సు వంటి వాటితో మ్యాచ్ చేయండి. ఇది మూములు పద్దతే కదా అనుకోకండి. కచ్చితంగా ఇది మీకు ఇది పర్ఫెక్ట్ లుక్‌ను ఇస్తుంది.

3. ఎంబ్రాయిడరీ డిజైన్‌కి మ్యాచ్ చేయండి

చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ డిజైన్లతో కూడా పాదరక్షలను మ్యాచ్ చేసుకోవచ్చు. మీ చీర మీద గోల్డెన్, సిల్వర్, కాపర్ లేదా ఏ రంగు ఎంబ్రాయిడరీ ఉందో ఆ రంగు చెప్పులను వేసుకోవడం వల్ల ఎలిగెంట్ లుక్ ను సొంతం చేసుకోవచ్చు.

4. న్యూడ్ షేడ్ పాదరక్షలు

కొన్ని ప్రతి చీరకు మ్యాచింగ్ చెప్పులు కొనాలంటే అందరి వల్ల కాదు కాబట్టి మీ దగ్గర ఎప్పుడూ న్యూడ్ షేడ్ చెప్పులు ఉండేలా చూసుకోండి. న్యూడ్ షేడ్లో, మీడియం హీల్ పాదరక్షలు వేసుకున్నారంటే ఎలాంటి చీరలో అయినా అందంగా, హుందాగా కనిపించచ్చు. లైట్ పీచ్, క్రీమ్, డస్టీ రోజ్ వంటి న్యూడ్ రంగులు అన్ని రకాల చీరల మీదకు సులభంగా సెట్ అవుతాయి.

5. చీరకు తగిన పాదరక్షలు

ఇల్యూషన్ పద్ధతిని ప్రయత్నించి కూడా చీరకు తగిన చెప్పులను ఎంచుకోవచ్చు. అంటే కాళ్లను కాస్త పొడవుగా, సన్నగా కనిపించేలా చేయడం వంటి స్టైలింగ్ టిప్స్‌తో కూడా చీరకు సెట్ అయ్యే చెప్పులను ఎంచుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024