




Best Web Hosting Provider In India 2024

APPSC Updates: ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు హాల్ టిక్కెట్ల విడుదల, మార్చి 25న మూడు నోటిఫికేషన్లకు ప్రధాన పరీక్ష
APPSC Exams: ఏపీపీఎస్సీ 2023, 2024లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు మార్చి 25న మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్, పీసీబీ గ్రేడ్ 2 అనలిస్ట్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ పరీక్షలను మార్చి 25న సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.

APPSC Exams: ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో భాగంగా పలు ఉద్యోగాలకు మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
ఏపీపీఎస్సీ పలు ఉద్యోగ నియామకాల్లో భాగంగా మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్ కోసం 2024 మార్చిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ఈ ఏడాది మార్చి 25న ప్రధాన పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విజయవాడలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మార్చి 17వ తేదీ నుంచి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పరీక్షకు సంబంధించిన అన్ని సూచనలను అవగతం చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. పరీక్ష కేంద్రాలకు కేవలం హాల్ టిక్కెట్లను మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్‌తో పాటు ఉండే మిగిలిన పత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు.
హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేయడానికి యూజర్ నేమ్ వద్ద అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్(ULHO)పాస్ వర్డ్‌గా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ (DDMMYYYYY) ఫార్మాట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.
మార్చి 25న అసిస్టెంట్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ పరీక్షలు…
2023లో విడుదలైన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాలకు వ్రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెట్ ఇంజనీర్ మెయిన్స్ పరీక్షలను మార్చి 2వ తేదీన నిర్వహిస్తారు.
రెండు పేపర్లుగా ఈ పరీక్ష ఉంటుంది. మార్చి 25 ఉదయం సెషన్‌లో పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలను 13 ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన నిర్వహిస్తారు.
మార్చి 25న పీసీబీ అనలిస్ట్ ఉద్యోగపరీక్ష…
2024 ఫిబ్రవరిలో విడుదలైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు మార్చి 25న మెయిన్స్ వ్రాత పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. హాల్ టిక్కెట్లు మార్చి 18 నుంచి అందుబాటులో ఉంటాయి.
హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/Default నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్