





Best Web Hosting Provider In India 2024

OTT Action Drama: ఓటీటీలోకి సూపర్ హిట్ యాక్షన్ డ్రామా ఫ్రీగా వచ్చేది ఆ రోజే.. ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో సాగే మూవీ
OTT Action Drama: ఓటీటీలోకి ఓ వార్ యాక్షన్ డ్రామా రాబోతోంది. నిజానికి ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సాగే మూవీ ఇది.

OTT Action Drama: ఓటీటీలోకి సుమారు రెండు నెలల తర్వాత ఓ హిందీ యాక్షన్ డ్రామా రానుంది. రెండు వారాలుగా రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా పేరు స్కై ఫోర్స్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ.. ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి రావడానికి సిద్దమవుతోంది.
స్కై ఫోర్స్ ఓటీటీ రిలీజ్ డేట్
బాలీవుడ్ లో ఈ ఏడాది అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటి స్కై ఫోర్స్ (Sky Force). ఈ ఏడాది జనవరి 24న రిపబ్లిక్ డేకు ముందు థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.166 కోట్లు వసూలు చేసిందీ మూవీ. ఇప్పుడు మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఆ రోజు నుంచి సబ్‌స్క్రైబర్లందరూ ఈ మూవీని చూసే వీలుంటుంది.
అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాను 1965 ఇండియా, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్థాన్ లోని సర్గోధా ఎయిర్‌బేస్ పై ఇండియా వైమానిక దాడి నేపథ్యంలో సాగుతుంది.
స్కై ఫోర్స్ మూవీ గురించి..
స్కై ఫోర్స్ మూవీని రూ.160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. 1965లో ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై ఇండియా జరిపిన ఓ ఆకస్మిక దాడి నేపథ్యంలో ఈ స్కై ఫోర్స్ సినిమా సాగుతుంది. వింగ్ కమాండ్ అహుజా, స్క్వాడ్రన్ లీడర్ విజయ నేతృత్వంలో ఈ దాడి జరుగుతుంది. దీనికి ఆపరేషన్ స్కై ఫోర్స్ అనే పెట్టారు. అదే టైటిల్ తో ఇప్పుడు మూవీ తీశారు.
జియో స్టూడియోస్, మాడక్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. మొత్తంగా రూ.168 కోట్లు మాత్రమే వచ్చాయి. వార్ డ్రామా నచ్చే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. మార్చి 21 నుంచి ప్రైమ్ వీడియోలోకి రానున్న ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
సంబంధిత కథనం