





Best Web Hosting Provider In India 2024

TTD Darshans: టీటీడీ కీలక నిర్ణయం, మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై శ్రీవారి దర్శనం
TTD Darshans: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలను మార్చి 24 నుంచి అనుమతించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 24 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

TTD Darshans: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి వాటిని అనుమతించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది.
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే అనుమతిస్తారు. ఆదివారం లేఖలపై సోమవారం దర్శనం కల్పిస్తారు. సోమ వారం అందే లేఖలకు మంగళవారం దర్శనాలను అనుమతిస్తారు.
రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాలలో మాత్రమే స్వీకరిస్తారు. వాటిని ఏ రోజు దర్శనానికి సంబంధించిన సిఫార్సులను అదే అనుమతిస్తారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. వాటిలో 06గురికి మించకుండా దర్శనాలను కల్పిస్తారు.
ఆంధ్రా ప్రజాప్రతినిధులకు ఆదివారం..
ప్రస్తుతం సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలరె ఇకపై శనివారం స్వీకరిస్తారు. ఆ లేఖల ఆధారంగా ఆదివారం విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరారు.
సంబంధిత కథనం
టాపిక్