Sarangapani Jathakam Release Date: సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే.. హాలిడేస్‌లో వస్తున్నాడు

Best Web Hosting Provider In India 2024

Sarangapani Jathakam Release Date: సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే.. హాలిడేస్‌లో వస్తున్నాడు

Hari Prasad S HT Telugu
Published Mar 17, 2025 08:27 PM IST

Sarangapani Jathakam Release Date: సారంగపాణి జాతకం మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రియదర్శి నటించిన ఈ సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వెళ్తున్న విషయం తెలిసిందే.

సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే.. హాలిడేస్‌లో వస్తున్నాడు
సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే.. హాలిడేస్‌లో వస్తున్నాడు

Sarangapani Jathakam Release Date: సమ్మర్ హాలిడేస్ లో సారంగపాణి మన ముందుకు వస్తున్నాడు. గతేడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్.. హాలిడేస్ కోసం రెడీ చేస్తున్నారు. తాజాగా సోమవారం (మార్చి 17) రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

సారంగపాణి జాతకం రిలీజ్ డేట్

మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ప్రియదర్శి నటించిన మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ఇది.

కానీ అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నిర్మించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

సారంగపాణి జాతకం గురించి..

ప్రియదర్శి నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ సారంగపాణి జాతకం. ఈ సినిమాకు అష్టా చెమ్మా, జెంటిల్‌మెన్, సమ్మోహనం, వీ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా చేస్తే.. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా జంటగా నటించింది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది.

గతేడాది డిసెంబర్ 20నే థియేటర్లలోకి రావాల్సింది. అంతకుముందు నవంబర్ 21నే టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ సినిమాలో హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతుంటాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, అది నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడి పాత్రలో ప్రియదర్శి నటించాడు.

మరి, ఆ జాతకాలపై మితిమీరిన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్‌ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ల భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు అనేది ఈ సినిమాలో చూడొచ్చు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024