





Best Web Hosting Provider In India 2024

ముఖం మీద కొవ్వు, వాపును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 7 డేస్ డైట్ ప్లాన్ ట్రై చేయండి
How to Loose Face Fat: ముఖం మీద కొవ్స్వు, వాపు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? వాటిని తగ్గించుకునేందుకు సహజమైన మార్గాల కోసం వెతుకుతున్నారా? అయితే ఈ 7 రోజుల డైట్ ప్లాన్ ట్రై చేయండి. ఇది మీ ముఖాన్ని మరింత అందంగా, చెక్కినట్లుగా తయారు చేస్తుంది.

ముఖం, మెడ మీద ఉండే కొవ్వు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల ముఖం వాసినట్లుగా, దవడలు, చంపలు కూడా ఉబ్బినట్లుగా, వేలాడుతూ కనిపిస్తాయి. ఇది పూర్తిగా ముఖాకృతినే మార్చేస్తుంది. ఈ సమస్యకు జన్యుశాస్త్రం, వృద్ధాప్యం, ఆహారంతో పాటు, నీరు నిలుపుదల, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వంటి అనేక రకాల కారణాలున్నాయి.
వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీన పడటం, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల కూడా చర్మం కుంగిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక శరీర బరువు కూడా ముఖం మీద కొవ్వుకు కారణాలు అవుతాయి. దీన్ని తగ్గించడం అసాధ్యం కాకపోయినప్పటికీ కష్టంతో కూడిన పని అనే చెప్పాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ముఖం మీద కొవ్వును తగ్గించడానికి ఏడు రోజుల పాటు కఠినమైన డైట్ పాటిస్తే చాలట. ప్రముఖ వెయిట్ లాస్ కోచ్ మను గుప్తా తన ఇన్స్టాగ్రామ్‌లో కేవలం ఏడు రోజుల్లోనే ముఖం మీద కొవ్వు, ఉబ్బును తగ్గించే డైట్ ప్లాన్‌ను వెల్లడించారు. అదేంటో ఓ లుక్కేయండి..
మొదటి రోజు:
- తెల్లవారు జామున: గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగాలి. అలాగే 5 నానబెట్టిన బాదం , 2 జీడిపప్పులు తినాలి. (50 కేలరీలు)
- ఉదయం: పెసరట్టు, పుదీనా చట్నీ (220 కేలరీలు)
- మిడ్ మార్నింగ్: ఉసిరి రసం + 1 చిన్న బొప్పాయి ముక్క (50 కేలరీలు)
- మధ్యాహ్నం: బ్రౌన్ రైస్, ఉల్లిపాయలు, టమాటాలు, మసాలతో చేసిన టోఫు స్టైర్-ఫ్రై (300 కేలరీలు)
- స్నాక్: వేయించిన శనగలు (100 కేలరీలు)
- రాత్రి భోజనం: పాలక్ పనీర్ కర్రీ + 1 మల్టీగ్రెయిన్ రొట్టె (250 కేలరీలు)
- పడుకునే ముందు: గోరు వెచ్చటి నీటిలో పసుపు, మిరియాల పొడి
రెండవ రోజు:
- తెల్లవారు జామున: గోరు వెచ్చటి నీటిలో జీలకర్ర, తేనె కలుపుకుని తాగండి.
- ఉదయం: ఒక మల్టీగ్రెయిన్ టోస్ట్, అవకాడో స్ప్రెడ్
- మిడ్ మార్నింగ్: ఒక యాపిల్, 5 వాల్నట్స్
- మధ్యాహ్నం: పప్పన్నం, కీరదోస రైతా
- సాయంత్రం స్నాక్: కొబ్బరి నీళ్లు
- రాత్రి భోజనం: మిక్సిడ్ వెజ్ సూప్, ఒక రోటీ
- పడుకునే ముందు: సోంపు నీరు
మూడవ రోజు:
- తెల్లవారుజామున: అల్లం, పసుపు, మిరియాలు వేసి మరిగించిన టీ
- ఉదయం: శనగపిండి దోసలు, పుదీనా చట్నీ
- మిడ్ మార్నింగ్:ఒక నారింజ, గుమ్మడి గింజలు
- మధ్యాహ్నం:వెజిటెబుల్ పులావ్, సలాడ్
- సాయంత్రం స్నాక్:వేయించిన శనగలు
- రాత్రి భోజనం: స్టీమ్డ్ ఫిష్ లేదా టోఫు, సాటెడ్ వెజీస్
- పడుకునే ముందు:పసుపు కలిపిన గోరు వెచ్చని నీరు
నాలుగవ రోజు:
- తెల్లవారుజామున: గోరు వెచ్చటి నీటిలో పుదీనా, నిమ్మరసం కలిపి తాగాలి.
- ఉదయం:చియా సీడ్స్ కలిపిన ఓట్స్, అరటిపండు
- మిడ్ మార్నింగ్:ఉడికించిన గుడ్డు, క్యారెట్ ముక్కలు
- మధ్యాహ్నం:బ్రౌన్ రైస్, మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీ
- సాయంత్రం స్నాక్: మజ్జిగ, కీరదోస
- రాత్రి భోజనం:పనీర్ టిక్కా, గ్రిల్డ్ జుచ్చినీ
- పడుకునే ముందు: సోంపు నీరు
ఐదవ రోజు:
- తెల్లవారుజామున: యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన వేడి నీరు
- ఉదయం: పెసరట్టు, టమాట చట్నీ
- మిడ్ మార్నింగ్:ఒక పియర్ పండు, పొద్దుతిరుగుడు గింజలు
- మధ్యాహ్నం:మిల్లెట్ కిచిడీ, బీట్ రూట్ సలాడ్
- సాయంత్రం స్నాక్:గ్రీన్ టీ, వేయించిన మఖానా
- రాత్రి భోజనం:స్టిర్ ఫ్రైడ్ టోఫు, బ్రోకలీ
- పడుకునే ముందు: అల్లం టీ
ఆరవ రోజు:
- తెల్లవారుజామున:కీరదోస, ఇన్ఫ్యూజిడ్ వాటర్
- ఉదయం: కూరగాయలతో చేసిన పోహా, గ్లాసెడు మజ్జిక
- మిడ్ మార్నింగ్:పిడికెడు పిస్తా పప్పులు
- మధ్యాహ్నం:నియ్మకాయ పులిహోర, పాలకూర పప్పు
- సాయంత్రం స్నాక్:అల్లం టీ, అరటిపండు
- రాత్రి భోజనం:గ్రిల్డ్ పుట్టగొడుగులు, వేయించిన కూరగాయలు
- పడుకునే ముందు: సోంపు నీరు
ఏడవ రోజు:
- తెల్లవారుజామున: గోరు వెచ్చటి సోంపు నీరు
- ఉదయం: రెండు ఇడ్లీలు, పల్లీ చట్నీ
- మిడ్ మార్నింగ్: ఒక జామకాయ, పిడికెడు బాదంలు
- మధ్యాహ్నం:రాజ్మా రైస్, క్యారెట్ సలాడ్
- సాయంత్రం స్నాక్:హెర్బల్ టీ, పుచ్చకాయ ముక్కలు
- రాత్రి భోజనం:మిక్స్డ్ లెంటిల్ సూప్, రోటీ
- పడుకునే ముందు:అల్లం టీ
ఇలా రోజుకు ఏడు సార్లు ఏడు రోజుల పాటు కచ్చితంగా ఈ డైట్ పాటించగలిగితే మీ ముఖాన్ని సన్నగా, చెక్కిన శిల్పంలా మార్చుకోవచ్చు. అదనంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ట్రై చేసి చూడండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం