Apollo Arthritis Program : కీళ్ల నొప్పుల చికిత్సలో మరో అధ్యాయం, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభించిన అపోలో

Best Web Hosting Provider In India 2024

Apollo Arthritis Program : కీళ్ల నొప్పుల చికిత్సలో మరో అధ్యాయం, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభించిన అపోలో

Bandaru Satyaprasad HT Telugu Published Mar 17, 2025 09:18 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Mar 17, 2025 09:18 PM IST

Apollo Arthritis Program : శస్త్ర చికిత్స లేకుండా కీళ్ల నొప్పులు తగ్గించే ప్రోగ్రామ్ ను అపోలో ఆసుపత్రి ప్రారంభించింది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చేలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశామన్నారు.

కీళ్ల నొప్పుల చికిత్సలో మరో అధ్యాయం, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభించిన అపోలో
కీళ్ల నొప్పుల చికిత్సలో మరో అధ్యాయం, జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభించిన అపోలో
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Apollo Arthritis Program : శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులు తగ్గించే కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రారంభించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న ఈ కార్యక్రమం అట్టహసంగా జరిగింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది ఒక వరమనే అపోలో వైద్యులు తెలిపారు. బాధితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్స అవసరం లేకుండానే దీనిని రూపొందించామన్నారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చేలా డిజైన్ చేశారు. అసౌకర్యం కలగకుండా, శస్త్ర చికిత్స అవసరం లేకుండానే నొప్పులను తగ్గించే విధంగా దీనిని రూపొందించారు.

అన్ని వయస్సుల వారికీ ఉపయోగం

అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ… “జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రోగికి సౌకర్యవంతంగా ఉండే చికిత్స. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అన్ని వయస్కుల వారికి ప్రయోజనం చేకూర్చేలా దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా టైలర్డ్ అడ్వైజ్, ట్రీట్మెంట్, థెరఫీస్, రీహాబిలిటేషన్ , పోషకాహారం, అవసరమైన ప్రత్యామ్నాయ చికిత్సలు- ‘3 Ts’ పై దృష్టి పెడుతుంది. బాధితులు కీళ్ల సమస్యల నుంచి బయటపడటంతోపాటు సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యవంతమైన జీవనశైలితో గడిపేందుకు ఇది ఉపయోగపడనుంది. కీళ్ల పనితీరు మెరుగుపరిచి బాధితులను శక్తివంతులను చేయాలనే కృతనిశ్చయంతో మేం పని చేస్తున్నాం” అని అన్నారు.

“కీళ్ల నొప్పుల నుంచి కాపాడటానికి ఈ నూతన కార్యక్రమం ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులను చికిత్సలతో అనుసంధానిస్తుంది. కీళ్ల పనితీరును మెరుగుపరచడం,పూర్తి కీలు మార్పిడి అవసరం లేకుండా సమస్య నివారించడంపై మేము దృష్టి సారించాం” అని అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి అన్నారు. ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమం అత్యాధునిక రీ జెనరేటివ్ చికిత్సలను సమగ్రమైన రీహాబిలిటేషన్, పోషకాహార పద్దతులతో మిళితం చేసి సమగ్ర చికిత్స మార్గాన్ని అందిస్తుంది. తద్వారా కీళ్ల సమస్యలకు ముందుగానే ప్రభావవంతమైన చికిత్స అందేలా తోడ్పడుతుంది”అని అన్నారు.

జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాం

జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స, అత్యాధునిక స్టెమ్ సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా, రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగ్గా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇందులో కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, సిడ్నీ రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్‌ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, జూబ్లీ హిల్స్‌- అపోలో హాస్పిటల్స్ సీఈఓ తేజస్వి రావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsHealth NewsHyderabadTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024