




Best Web Hosting Provider In India 2024
79 Shots Rally: 79 షాట్ల ర్యాలీ.. ఈ అమ్మాయిల స్టామినాకు దండం పెట్టాల్సిందే.. ఆల్ ఇంగ్లండ్ లో అద్భుతం.. ఇదిగో వీడియో
79 Shots Rally: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో అద్భుతం. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇద్దరు ప్లేయర్లు 79 షాట్ల ర్యాలీ ఆడారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అసలైన ఫైనల్ పోరు ఇలా ఉండాలి. పాయింట్ కోసం ప్రాణం పెట్టడమంటే ఇదే. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్, వాంగ్ జీ యీ ఫైటింగ్ చరిత్రలో నిలిచిపోయేదే. ముఖ్యంగా ఓ పాయింట్ కోసం ఈ ఇద్దరు 79 షాట్ల ర్యాలీ ఆడారు. ఇంతటి సుదీర్ఘమై ర్యాలీ ఆడిన వీళ్ల స్టామినా అదుర్స్ అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.
వారెవా గేమ్
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు ఫ్యాన్స్ కు కట్టిపాడేసింది. సౌత్ కొరియాకు చెందిన ఆన్ సె యంగ్.. చైనా ప్లేయర్ వాంగ్ జీ మధ్య ఫైట్ హోరాహోరీగా సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ 1,2 ర్యాంకుల్లో ఉన్న ఈ ప్లేయర్స్ మధ్య పోరాటం మరో రేంజ్ లో సాగింది.
ఆ పాయింట్ కోసం
తొలి గేమ్ ను ఆన్ సె యంగ్ 13-21తో ఓడిపోయింది. రెండే గేమ్ లో 6-6తో స్కోరు ఈక్వెల్ అయింది. ఆ తర్వాతి పాయింట్ కోసం ఆన్ సె యంగ్, వాంగ్ జీ ప్రాణం పెట్టి పోరాడారు. స్మాష్ లు, డ్రాప్ లు, క్రాస్ కోర్టు షాట్లు.. ఇలా అన్ని అస్త్రాలు ప్రయోగించారు. చివరకు 79 ర్యాలీల తర్వాత ఆన్ పైచేయి సాధించింది. ఆన్ షాట్ ను వాంగ్ రిటర్న్ చేయలేకపోయింది. కోర్టుపై పడిపోయిన వాంగ్ కాసేపు అలాగే ఉండిపోయింది. మరోవైపు ఆన్ కోర్టు బయటకు వెళ్లి కాస్త ఊపిరి పీల్చుకుంది.
అదే దూకుడుతో
79 ర్యాలీల పాయింట్ ను గెలిచిన ఆన్ ఇక ఆగలేదు. అదే దూకుడు కొనసాగించింది. ఈ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ వరుసగా రెండు గేమ్ లు గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ ఫైనల్లో ఆన్ 13-21, 21-18, 21-18 తేడాతో వాంగ్ పై విజయం సాధించింది. ఆ 79 ర్యాలీల పాయింట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. తొలి గేమ్ లో ఓడిన తర్వాత.. ఆ పాయింట్ గెలిచిన ఆన్ సె యంగ్ మరింత ఆత్మవిశ్వాసంతో సాగిపోయింది. 95 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ అద్భుతమైన స్కిల్స్ ప్రదర్శించారు.
211 షాట్లు
బ్యాడ్మింటన్ లో లాంగెస్ట్ ర్యాలీగా 211 షాట్ల ర్యాలీ కొనసాగుతోంది. 2023 మలేసియా మాస్టర్స్ టోర్నీ వుమెన్స్ డబుల్స్ లో పియర్లీ-థినా (మలేసియా), రెనా- అయాకో (జపాన్) మధ్య మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link