




Best Web Hosting Provider In India 2024

OTT Releases: ఓటీటీల్లో ఈవారం 6 అదిరిపోయే చిత్రాలు.. కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు డిఫరెంట్ జానర్లలో..
OTT Movies This Week: ఈవారం ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. ఆరు చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బ్రహ్మా ఆనందం సహా ఈ వారం ఓటీటీలో టాప్ సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం (మార్చి 17 – 22) కూడా రకరకాల జానర్లలో చిత్రాలు రానున్నాయి. వీటిలో ఆరు చిత్రాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ నెలకొని ఉంది. మలయాళ బ్లాక్‍బస్టర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్‍కు రానుంది. బ్రహ్మానందం లీడ్ రోల్ చేసిన చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఐదుసార్లు సాధించిన చిత్రం కూడా వచ్చేసింది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న ఆరు ఇంపార్టెంట్ చిత్రాలు ఇక్కడ తెలుసుకోండి. చూసేందుకు ప్లాన్ చేసుకోండి.
బ్రహ్మా ఆనందం
బ్రహ్మా ఆనందం చిత్రం ఈ గురువారం (మార్చి 20) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ బ్రహ్మా ఆనందం మూవీని మార్చి 20 నుంచి ఆహా ఓటీటీ చూడొచ్చు.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. మార్చి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి జీతూ అష్రఫ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ సూపర్ హిట్ అయింది. తెలుగులో మార్చి 14న విడుదలైంది. అందుకు ఒక్క వారంలోనే మార్చి 20న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ మూవీ అడుగుపెడుతోంది.
అనోరా
ఐదు ఆస్కార్లు గెలిచిన అనోరా సినిమా నేడు (మార్చి 17) జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు హిందీ భాషల్లో ఈ హాలీవుడ్ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‍ప్లే, బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ నటి విభాగాల్లో ఆస్కార్ 2025లో ఈ మూవీకి అవార్డులు దక్కాయి. సీన్ బేకర్ దర్శకత్వం వహించిన అనోరా చిత్రంలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్‍స్టెయిన్ లీడ్ రోల్స్ చేశారు.
డ్రాగన్
తమిళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ డ్రాగన్ కూడా ఈ వారం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెడుతుందని సమాచారం. మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు ఉన్నాయి. అయితే, అధికారిక ప్రకటన రాలేదు. డ్రాగన్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా చేశారు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ మూవీ రూ.120కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో ఈ సినిమా విడుదలైంది.
జితేందర్ రెడ్డి
తెలుగు మూవీ జితేందర్ రెడ్డి మార్చి 20వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. విరించి వర్మ దర్శకత్వంలో రాకేశ్ వర్రే హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సుమారు ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.
విక్డ్
హాలీవుడ్ మూవీ ‘విక్డ్’ మార్చి 22వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం ఆస్కార్ 2025 వేదికపై రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మ్యూజికల్ ఫ్యాంటసీ చిత్రంలో సింతియా ఎరివో, అరియానా గ్రాండే లీడ్ రోల్స్ చేశారు. జాన్ ఎం.చూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో విడుదలైన విక్డ్ మంచి హిట్ సాధించింది.
సంబంధిత కథనం
టాపిక్