OTT: పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాఫ్ అయిన మూవీ.. ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024

OTT: పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాఫ్ అయిన మూవీ.. ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 18, 2025 08:17 AM IST

Sky Force OTT Streaming: స్కైఫోర్స్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. ఇప్పటికే రెంట్‍కు అందుబాటులో ఉన్న చిత్రం.. సాధారణ స్ట్రీమింగ్‍కు అడుపెట్టనుంది. డేట్ కూడా వెల్లడైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT: పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాఫ్ అయిన మూవీ.. రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.. ఓటీటీలో ఎప్పుడంటే..
OTT: పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాఫ్ అయిన మూవీ.. రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.. ఓటీటీలో ఎప్పుడంటే..

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన స్కైఫోర్స్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. మంచి అంచనాలతో రిపబ్లిక్ డే వీక్‍లో జనవరి 24 విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, అందుకు తగ్గట్టుగా కలెక్షన్లు దక్కించుకోలేక ప్లాఫ్‍గా నిలిచింది. పాకిస్థాన్ స్థావరంపై భారత్ చేసిన వైమానిక దాడి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్కైఫోర్స్ మూవీ ఈవారంలోనే రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే.. రెంట్ లేకుండా..

స్కైఫోర్స్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమ ఇప్పటికే ఆ ప్లాట్‍ఫామ్‍లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, మార్చి 21న రెంట్ తొలగిపోయి పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ప్రైమ్ వీడియో సబ్‍స్క్రిప్షన్ ఉన్నవారందరూ అప్పటి నుంచి స్కైఫోర్స్ చిత్రాన్ని చూడొచ్చు.

భారత్, పాకిస్థాన్ యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో..

స్కైఫోర్స్ మూవీకి సందీప్ కెవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించారు. 1965 భారత్, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. భారత వాయుసేన పాకిస్థాన్‍పై చేసిన తొలి వైమానిక దాడి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో వింగ్ కామాండర్ కుమార్ ఓం అహుజా పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు. ఈ చిత్రంలో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, శరద్ కేల్కర్, మిహిత్ చౌహాన్, మనీష్ చౌదరి, వరుణ్ బదోలా, వీరేంద్ర సింగ్ కీలకపాత్రలు పోషించారు.

స్కైఫోర్స్ కలెక్షన్లు

స్కై ఫోర్స్ చిత్రం సుమారు రూ.160కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఫుల్ రన్‍లో ఈ మూవీ దాదాపు రూ.144కోట్ల కలెక్షన్లనే దక్కించుకొని నిరాశపరిచింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి ఓపెనింగ్ సొంతం చేసుకుంది. అయినా బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో డ్రాప్ బాగానే కనిపించింది. దీంతో పాజిటివ్ టాకే ఉన్నా కమర్షియల్‍గా మాత్రం ఈ చిత్రం ప్లాఫ్ అయింది. అక్షయ్ కుమార్‌ ఖాతాలో మరో బాక్సాఫీస్ పరాజయం వచ్చిచేరింది.

స్కై ఫోర్స్ చిత్రాన్ని జియోస్టూడియోస్, మాడ్‍డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ బ్యానర్లపై జ్యోతి దేశ్‍పాండే, అమర్ కౌశిక్, భూమిక గోండలియా, దినేశ్ విజన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి తనిష్క్ బగాచీ, జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024