Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudigantalu Serial: బాలుపై అరిచిన మౌనిక – చంద్రకాంతం ఎంట్రీ – సంజు కాళ్లు కడిగిన మనోజ్
Gunde Ninda Gudigantalu Serial: గుండె నిండా గుడిగంటలు మార్చి 18 ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్షన్‌కు ఉండకుండా బాలును బలవంతంగా ఇంట్లో నుంచి పంపించేయబోతుంది ప్రభావతి. బాలు చేత తన కాళ్లు కడిగించుకోవాలని ప్లాన్ చేసిన సంజు అతడిని ఆపుతాడు.బాలు ఫ్యామిలీని అడుగడుగునా సంజు అత్త అవమానిస్తుంది.
Gunde Ninda Gudigantalu Serial: ప్రభావతి మాటలకు కట్టుబడి మౌనిక ఫంక్షన్‌కు ఉండకుండా ఇంట్లోనుంచి వెళ్లిపోవడానికి బాలు రెడీ అవుతాడు. సంజు ఫ్యామిలీ వచ్చే టైమ్ అయినా బాలు టిఫిన్ చేస్తూ కనిపించడంతో ప్రభావతి టెన్షన్ పడుతుంది. ఇడ్లీలు సరిపోకపోతే నన్ను కూడా కాల్చుకు తినమని కోపంగా అరుస్తుంది.
నాకేం వినపడటం లేదు. కనపడటం లేదని బాలు అంటాడు. నిన్ను కన్నందుకు నాకు ఈ మానసిక క్షోభ ఏంటని ప్రభావతి అంటుంది. ఈ రోజు మౌనిక ఫంక్షన్ జరిగినట్లేనని అంటుంది. దండ పెడతాను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని బాలుతో అంటుంది ప్రభావతి.
మీనాపై కారాలు మిరియాలు…
ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న బాలును టిఫిన్ పేరుతో వెనక్కి పిలిచినిందుకు మీనాపై కారాలు మిరియాలు నూరుతుంది ప్రభావతి. తినడానికి బయట టిఫిన్ సెంటర్లు లేవా అని అంటుంది. ఇప్పుడు ఏమైందని బాలును నస పెడుతున్నావని ప్రభావతిని కోప్పడుతాడు సత్యం.
ఫంక్షన్‌లో ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మౌనిక అత్తింటివాళ్లకు మాట ఇచ్చేశాం కదా అని ప్రభావతి బదులిస్తుంది. నీ వల్ల ఫంక్షన్ చెడిపోతే మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు నీకు సంతోషమేనా అని బాలుతో ప్రభావతి అంటుంది.
తిండికి మొహం వాచిపోయినట్లు…
తిండికి మొహం వాచిపోయినట్లు ఎలా తింటున్నాడో చూడండి అని బాలును కించపరిస్తుంది ప్రభావతి. తల్లి మాటాలతోటిఫిన్ తినడం పూర్తిచేయకుండానే బాలు లేస్తాడు. మధ్యలో అలా వదిలేయకూడదని మీనా అంటుంది. అమ్మ మాటలతో కడుపు నిండిపోయిందని బాలు సమాధానమిస్తుంది.
ప్రభావతి మాటలు తనకేం కొత్త కాదని, ఫంక్షన్ బాగా జరిపించమని మీనాతో చెబుతాడు. భర్తను తిండి నించి మధ్యలోనే లేవగొట్టడం చూసి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు మీకు సంతోషమేనా అని ప్రభావతితో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
చంద్రకాంతం ఎంట్రీ…
బాలు ట్రిప్ కోసం వెళ్లబోతుంటాడు. అప్పుడే అక్కడికి సంజు, నీలకంఠం వస్తారు. సంజుతో పాటు అతడి అత్త చంద్రకాంతం కూడా ఫంక్షన్‌కు వస్తుంది. అడుగడుగునా బాలు ఫ్యామిలీని అవమానించడానికే చంద్రకాంతాన్ని తీసుకొస్తాడు సంజు. వచ్చి రావడంతోనే బాలు ఇంటిని చూసి మా పాలేరు ఎంకడికి ఇంతకంటే పెద్ద ఇళ్లు ఉందని చంద్రకాంతం అంటుంది. గేటు ఇంత చిన్నగా ఉందేంటి అని వెటకారం ఆడుతుంది. అయినా దొంగలు వస్తే చెంబు, తపేలా తప్పితే ఈ ఇంట్లో ఏం దొరుకుతాయని తక్కువ చేసి మాట్లాడుతుంది.
అత్త పూలు అమ్ముతుందా…
ప్రభావతిని చంద్రకాంతానికి పరిచయం చేస్తాడు నీలకంఠం. బయట పూలకొట్టుపై ప్రభావతి పేరు ఉండటం చూసి మీ అత్త పూలు అమ్ముతుందా ఎప్పుడు చెప్పలేదని సంజుతో అంటుంది చంద్రకాంతం. ఆమె మాటలతో సత్యం, ప్రభావతితో పాటు మిగిలిన కుటుంబసభ్యులు షాకవుతారు. బాలు అక్కడే కనిపించడంతో…ఈ రౌడీగాడు ఉంటే మేము ఇంట్లో అడుగుపెట్టమని చెప్పాముగా నీలకంఠం అంటాడు. బాలు ట్రిప్పుకు వెళుతున్నాడని ప్రభావతి ఆన్సర్ ఇస్తుంది.
సంజు ప్లాన్…
బాలు వెళ్లకుండా సంజు అడ్డుకుంటాడు. మీ ముద్దుల చెల్లెలి ఫంక్షన్ జరిగితే నువ్వు ఉండకుండా ఎక్కడికి జారుకుంటున్నావు బావ అని బాలుతో అంటాడు సంజు. ఇంటికి బావ వస్తే మర్యాదలు చేయడానికి బావమరుదులు ఉండాలని అని సంజు అంటాడు. రా బావా అని బాలును లోపలికి పిలుస్తాడు. బాలును అవమానించడానికే సంజు ప్లాన్ వేశాడని మౌనిక కనిపెడుతుంది. బాలుకు ట్రిప్ పడిందని అపోద్దని అంటుంది. ఇంటికి అల్లుడు వస్తే ఏ పనికిమాలిన వాడు బయటకు వెళ్లడని చంద్రకాంతం తన నోటికి పనిచెబుతుంది.
ఉక్కిరి బిక్కిరి అవుతారు…
నేను మర్యాదలు చేస్తే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారని, మీకు మర్యాదలు చేయడానికి చాలా మంది ఉన్నారని బాలు రివర్స్ పంచ్ వేసి బయలుదేరబోతాడు. మీ చెల్లెలికి నువ్వంటే ప్రాణం, ఉండాల్సిందేనని సంజు పట్టుపడతాడు. బాలుకు మర్యాదలు చేయడం తెలియదని, మీకు సేవలు చేయడానికి ఇంకా ఇద్దరం బామ్మర్ధులం ఉన్నాం అని మనోజ్ అంటాడు.
సంజు ఎంత పిలిచిన బాలు వినకపోవడంతో…ఏంటి బతిమిలాడుతున్నారు..ఈ ఫంక్షన్ ఏదో మనింట్లో చేసుకుందాం వెళ్లిపోదాం పదా అని చంద్రకాంతం అంటుంది. నువ్వు లోపలికి వస్తావా…మమ్మల్ని వెళ్లిపోమ్మంటావా సంజు కూడా వార్నింగ్ ఇస్తాడు. ఏదో గొడవ చేయడానికే సంజు ప్లాన్ చేశాడని మీనా గ్రహిస్తుంది. సంజు శాడిజంలో ఇదో టైప్ అని శృతి అంటుంది.
ఎంతో పెద్ద ప్యాలెస్…
ఇంట్లో అడుగుపెడుతూనే అబ్బో ఎంత పెద్ద ప్యాలెస్..అంటూ చంద్రకాంతం సెటైర్లు వేస్తుంది. టీవీని చూసి ఇందులో బొమ్మ కనిపిస్తుందా…మాట వినిపిస్తుంటుందా అని అంటుంది. సోఫాలో కూర్చోమని అంటే మీ తాతల నుంచి వంశపారంపర్యంగా ఇవి మీకు వచ్చాయా అని వెటకారం ఆడుతుంది. గట్టిగా నలుగురు చుట్టాలు వస్తే చెవి దుద్దులు, చేతి గాజులు తాకట్టు పెట్టుకునేలా ఉన్నారని బాలు ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతుంది.
మగవాళ్లు మాట్లాడరా…
చంద్రకాంతంపై మీనా, రోహిణి, శృతి ఫైర్ అవుతారు. వచ్చిన దగ్గర నుంచి మీరే మాట్లాడుతున్నారు..మీ ఇంట్లో మగవాళ్లు ఎవరూ మాట్లాడరా అని శృతి సెటైర్ వేస్తుంది. సంజు మొదటిసారి అత్తింటికి వచ్చాడని, బామ్మర్ధులు అతడి కాళ్లు కడిగి లోపలికి తీసుకురావాలని చంద్రకాంతం కండీషన్ పెడుతుంది.
బాలు చేతనే సంజు కాళ్లు కడిగించాలని పట్టు పడుతుంది. వాడు కాళ్లు కడిగే రకం కాదని, కాళ్లు విరగ్గొట్టే రకమని లోలోన ప్రభావతి భయపడుతుంది. బాలు ఎక్కడ గొడవ చేస్తాడోనని కంగారు పడుతుంది.
మీనా ఫిట్టింగ్…
కాళ్లేగా వాటి సంగతి నేను చూసుకుంటానని బాలు అనడంతో నీలకంఠం భయపడిపోతాడు. ఆచారాలు, సంప్రదాయాలు నేను పాటిస్తానని బాలు అంటాడు. మీనాను చెంబుతో నీళ్లు తీసుకురమ్మని అంటాడు. నీళ్లు తీసుకొచ్చిన మీనా ఫిట్టింగ్ పెడుతుంది. ఇంటికి పెద్ద కొడుకు ఉండగా రెండో కొడుకు కాళ్లు కడగటం సంప్రదాయం కాదని మనోజ్‌ను ఇరికిస్తుంది.
మనోజ్‌కు డబ్బులు….
కాళ్లు కడిగినందుకు మనోజ్‌కు డబ్బులు ఇస్తాడు సంజు. ఇలా మీరు డబ్బులు ఇస్తారంటే మా వాడు ఏం కడగమన్నా కడుగుతాడని మనోజ్‌పై సెటైర్ వేస్తాడు బాలు. ఎన్నిసార్లు కాళ్లు కగడమన్నా కడుగుతాడని మాట మార్చేస్తాడు. సంజు ఇచ్చిన డబ్బులు చూసి మనోజ్ సంబరపడతాడు.
మౌనిక ఫైర్…
మౌనిక బాగుందో లేదో తెలుసుకోవాలని బాలు అనుకుంటాడు. కానీ బాలును చూడగానే మౌనిక ఫైర్ అవుతుంది. ఫంక్షన్ జరిగేప్పుడు నువ్వు ఉండకూడదని మా వారు చెప్పురుగా…ఆయనతో గొడవ పడటానికే ఇక్కడ ఉన్నావా అంటూ కోపంగా అరుస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.