







Best Web Hosting Provider In India 2024

Chiranjeevi in London: లండన్‍లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. అభిమానుల ఘన స్వాగతం.. ఎందుకు వెళ్లారంటే..
Chiranjeevi in London: మెగాస్టార్ చిరంజీవి లండన్‍కు చేరుకున్నారు. బ్రిటన్‍లోని అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వెల్‍కమ్ అన్నయ్యా అంటూ విమానాశ్రయంలో బ్యానర్లు పట్టుకున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్‍లోని లండన్‍లో అడుగుపెట్టారు. యూకే పార్లమెంట్‍లో భాగమైన హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఆయన అరుదైన సత్కారం అందుకోనున్నారు. లండన్‍లోని హీత్రో విమానాశ్రయంలో చిరంజీవి నేడు దిగారు. ఆయనకు యూకే అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ వివరాలు ఇవే..
లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్ అందుకోనున్న చిరూ
చిరంజీవికి లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్ అవార్డును యునైటెడ్ కింగ్‍డమ్ (హౌస్) పార్లమెంట్‍లోని హౌస్ ఆఫ్ కామన్స్ అందించనుంది. కళారంగం ద్వారా సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవాన్ని మెగాస్టార్‌కు ఇవ్వనుంది. హౌస్ సభ్యులు ఆయనను సత్కరించనున్నారు. రేపు (మార్చి 19) ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసమే లండన్‍కు వెళ్లారు చిరంజీవి.
వెల్‍కమ్ అన్నయ్యా అంటూ..
లండన్‍లోని విమాశ్రయంలో చిరంజీవికి ఆయన అభిమానులు స్వాగతం పలికారు. యూకే మెగా అభిమానుల నుంచి వెల్‍కమ్ అన్నయ్యా అంటూ బ్యానర్లు పట్టుకొని మరీ స్వాగతం చెప్పారు. విమానాశ్రయానికి వచ్చిన అభిమానులతో చిరంజీవి ఆప్యాయంగా మాట్లాడారు. నవ్వుతూ పలుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి గతేడాది భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‍ను అందుకున్నారు. డ్యాన్స్‌కు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా గతేడాదే సొంతం చేసుకున్నారు. గిన్నీస్ బుక్‍లోకి ఎక్కారు. ఇప్పుడు యూకే పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు దక్కించుకుంటున్నారు చిరంజీవ. సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన మెగాస్టార్.. చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి, సేవకు అవార్డులు దక్కుతూనే ఉన్నాయి.
సినిమాలు ఇలా..
చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడితోనూ ఓ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ చేయనున్నారు చిరంజీవి. జూన్‍లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టు అనిల్ రావిపూడి ఇటీవల వెల్లడించారు.
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీకి కూడా చిరంజీవి ఓకే చెప్పారు. ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ చిత్రంగా ఉండనుంది. దసరా చిత్రంతో శ్రీకాంత్ ప్రూవ్ చేసుకున్నారు. నానితోనే తదుపరి ది ప్యారడైజ్ మూవీ చేయనున్నారు. ఇది కంప్లీట్ అయ్యాక చిరూతో మూవీని శ్రీకాంత్ మొదలుపెట్టనున్నారు. వీరాభిమానిగా చెప్పుకునే శ్రీకాంత్.. మెగాస్టార్‌తో ఎలాంటి మూవీ చేస్తారోనని అభిమానుల్లో చాలా ఎగ్జైట్‍మెంట్ నెలకొంది.
సంబంధిత కథనం