Kitchen Tips: పిల్లల స్నాక్ బాక్సులో పెట్టి ఆపిల్స్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Best Web Hosting Provider In India 2024

Kitchen Tips: పిల్లల స్నాక్ బాక్సులో పెట్టి ఆపిల్స్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Haritha Chappa HT Telugu
Published Mar 18, 2025 06:30 PM IST

Kitchen Tips: కట్ చేసిన ఆపిల్ ముక్కలు కాసేపటికే రంగు మారిపోతాయి. పిల్లలు వాటిని తినేందుకు ఇష్టపడరు. ఇది రుచిని కూడా తగ్గిస్తుంది. ఆపిల్ గోధుమ రంగులోకి మారకుండా ఉండాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఆపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఆపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే ఇలా చేయండి (Pixabay)

ప్రతిరోజూ పిల్లల స్నాక్ బాక్స్ కు, లంచ్ బాక్స్ కు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పంపాలి. అన్నం, సాంబార్ లేదా దోశ, ఇడ్లీ, పులిహోర వంటివి లంచ్ బాక్స్ కు పెడుతుంటారు. చాలా మంది స్నాక్స్ కోసం పండ్ల ముక్కలు పెడతారు. చాలా మంది ఆపిల్ ముక్కలు బాక్సుల్లో పెట్టి పిల్లలకు పంపిస్తారు. ఆపిల్ పండ్లను కట్ చేసి పిల్లల స్నాక్ బాక్స్ కు పంపితే కొద్ది నిమిషాల్లోనే అవి గోధుమ రంగులోకి మారతాయి. దీని వల్ల పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఆపిల్ రుచి కూడా మారిపోతుంది. ఇలా రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

ఆపిల్ ఎందుకు రంగు మారుతుంది?

ఆపిల్ ను ముక్కలుగా కట్ చేసినప్పుడు, ఆక్సిజన్ దాని కణాలకు సోకుతుంది. ఎంజైములను ఉత్పత్తి చేసే రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. ఇది పండును ఆక్సీకరణం చేస్తుంది. దీనివల్ల ఆపిల్ ముక్కలు గోధుమ రంగులోకి మారుతాయి.

ఆపిల్ ముక్కలు కట్ చేసిన తర్వాత గోధుమ రంగులోకి మారకుండా ఉండాలంటే చిన్న చిట్కాలు ఉన్నాయి. పిల్లలు తినేందుకు ఆపిల్ రంగు మారకుండా తెల్లగా ఉండేలా చూసుకోవాలి. ఆపిల్ ముక్కలను తాజాగా, రుచిగా ఉంచడానికి కొన్ని సింపుల్ చిట్కాలు లేదా ట్రిక్స్ ఉన్నాయి.

నిమ్మరసం: నిమ్మరసంలోని ఆమ్ల గుణం ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ముక్కలుగా తరిగినప్పుడు ఆపిల్ పై కొంత తాజా నిమ్మరసం పిండాలి. తద్వారా ఆపిల్ గోధుమ రంగులోకి మారదు.

వెనిగర్: నిమ్మరసం మాదిరిగానే వెనిగర్ ను కూడా ఉపయోగించవచ్చు. ఆపిల్ ముక్కలకు పైన వెనిగర్ రాయడం వల్ల ఆపిల్ రంగు మారదు. నీటిలో కొంచెం వెనిగర్ కలిపి ఆ నీటిలో ఆపిల్ ముంచి బయటికి తీయాలి.

చల్లటి నీరు: ఆపిల్ ముక్కలను చల్లటి నీటిలో ముంచితే అవి గోధుమ రంగులోకి మారకుండా ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. ఈ చల్లని నీరు పండు కణాలు ఆక్సిజన్ మధ్య అవరోధంలా పనిచేస్తుంది. ఆక్సీకరణ ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది

ఆపిల్ పండ్లను ఇలా నిల్వ చేయండి: తరిగిన ఆపిల్ తాజాదనాన్ని కాపాడటానికి, వాటిని రిఫ్రిజిరేటర్ పెట్టాలి. లేదా ఫ్రిజ్లో గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయవచ్చు. కొన్ని ఆపిల్ రకాలు కత్తిరించిన వెంటనే గోధుమ రంగులోకి మారుతాయి. అలాంటి ఆపిల్స్ తీసుకోవద్దు. అవి ఆరోగ్యకరమైనవి కాదు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024