OTT Mammootty Thriller Movies: ఓటీటీలో ఉన్న మమ్ముట్టి టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే..

Best Web Hosting Provider In India 2024

OTT Mammootty Thriller Movies: ఓటీటీలో ఉన్న మమ్ముట్టి టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే..

Hari Prasad S HT Telugu
Published Mar 18, 2025 07:28 PM IST

OTT Mammootty Thriller Movies: ఓటీటీలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన కొన్ని థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. వీటిలో బెస్ట్ మూవీస్ సోనీ లివ్, జియోహాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్నాయి.

ఓటీటీలో ఉన్న మమ్ముట్టి టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే..
ఓటీటీలో ఉన్న మమ్ముట్టి టాప్ 5 మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే..

OTT Mammootty Thriller Movies: మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉంటాడు. వాటిలో కొన్ని థ్రిల్లర్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఆ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో భ్రమయుగం, రోర్షాక్, కన్నూర్ స్క్వాడ్ లాంటి సినిమాలు ఉన్నాయి.

మమ్ముట్టి థ్రిల్లర్ మూవీస్

మలయాళం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుగాంచిన హీరో మమ్ముట్టి. ఇప్పటికే 400కుపైగా సినిమాల్లో నటించాడు. 73 ఏళ్ల వయసులోనూ ఇంకా నటిస్తూనే ఉన్నాడు. మరి అతడు నటించిన సినిమాల్లో బెస్ట్ అనిపించే 5 థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూద్దాం.

భ్రమయుగం – సోనీ లివ్ ఓటీటీ

భ్రమయుగం 17వ శతాబ్దపు కేరళ బ్యాక్‌డ్రాప్ లో సాగే మూవీ. ఇందులో తేవన్ అనే పాణన్ కులానికి చెందిన జానపద గాయకుడు బానిసల మార్కెట్ నుండి తప్పించుకుని ఒక రహస్యమైన భవనంలోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక దుష్ట శక్తి ఎదురవుతుంది. ఒక చీకటి రహస్యం బయటపడుతుంది. ఈ సినిమా ప్రాచీన కేరళలోని ఆధ్యాత్మిక సంప్రదాయాల నేపథ్యంలో సాగుతుంది. మమ్ముట్టి ఆ భవనం రహస్య యజమాని కోడుమోన్ పోట్టిగా నటించాడు.

కన్నూర్ స్క్వాడ్ – జియోహాట్‌స్టార్

కన్నూర్ స్క్వాడ్ సినిమాను నిజ జీవిత పోలీసు యూనిట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో ఏఎస్ఐ జార్జ్ మార్టిన్, అతని టీమ్ వృత్తిపరమైన అనిశ్చితులు, నేరస్థులను పట్టుకోవడానికి వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు ఎలాంటివో చూపిస్తుంది. ఓ కేసులో నేరస్థులను గుర్తించడానికి కన్నూర్ స్క్వాడ్ దేశవ్యాప్తంగా చేసే ప్రయాణాన్ని, వారు ఎదుర్కొనే సవాళ్లు, అనిశ్చితులను మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో మమ్ముట్టి ఏఎస్ఐ జార్జ్ మార్టిన్ పాత్రలో నటించాడు.

రోర్‌షాక్ – జియోహాట్‌స్టార్

రోర్‌షాక్ 2022లో విడుదలైన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో మమ్ముట్టి నటించాడు. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే ఎన్నారై వ్యాపారవేత్త లూక్ ఆంథోనీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ మూవీ స్టోరీని చెప్పే తీరు ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను పంచుతుంది. తెలుగులోనూ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మున్నరియిప్పు – సన్ నెక్ట్స్

మున్నరియిప్పు మూవీ అంజలి అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్టోరీ. తాను చేయని నేరానికి సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్న సీకే రాఘవన్ అనే ఖైదీ కథ పట్ల ఆమె ఆకర్షితురాలవుతుంది. అతని ఆత్మకథను రాయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఖైదీ సీకే రాఘవన్ పాత్రలో మమ్ముట్టి నటించాడు.

అబ్రహమింతే సంతతికల్ – జీ5 ఓటీటీ

అబ్రహమింతే సంతతికల్ ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో పోలీసు అధికారి డెరిక్ అబ్రహం పాత్రలో మమ్ముట్టి నటించాడు. అతని సోదరుడు ఫిలిప్ (అన్సన్ పాల్) ఓ హత్య కేసులో అనుమానితుడిగా ఉంటాడు. అప్పుడు తన విధి, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అతనికి ఏర్పడుతుంది. తన వృత్తి, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే ఓ పోలీస్ అధికారి పాత్రను కళ్లు కట్టేలా ఈ మూవీ చూపిస్తుంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024