






Best Web Hosting Provider In India 2024

AP Heat Wave : ఏపీలో తీవ్రమవుతున్న ఎండలు, రేపు 58 మండలాల్లో వడగాల్పులు
AP Heat Wave : ఏపీలో భానుడు భగభగలాడుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. రేపు 58 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

AP Heat Wave : మార్చి నెలలోనే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రేపు రాష్ట్రంలోని 58 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఎల్లుండి 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
58 మండలాల్లో వడగాల్పులు
బుధవారం శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం-18,మన్యం-14, అల్లూరి -3, కాకినాడ-2, తూర్పుగోదావరి-7, ఏలూరు-1 మండలాల్లో(58) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 42.7°C, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6°C, వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో 41.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
జాగ్రతలు
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ఒకవేల బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, గొడుగు, తలకు టవల్ ధరించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేడిగాలి చేవుల్లోకి వెల్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేషన్ కాకుండా తగిన నీరు, ఓఆర్ఎస్ , నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగాలని సూచించింది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్
బుధవారం తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. ఈ నెల 21న రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 22న తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ నెల 22న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశ ఉంది. ఈ నెల 23వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్