







Best Web Hosting Provider In India 2024

Floor Clean tips: వేసవిలో ఈగలు, పురుగులు చేరకుండా ఉండాలంటే మాప్ చేసే నీటిలో వీటిని కలపండి, ఫ్లోర్ మెరిసిపోతుంది
Floor Clean tips: ప్రతిరోజూ ఇంటిని మాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి ఫ్లోర్ పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లోని వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ఈగలు, పురుగులు, బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే మీరు మాప్ చేసే నీటిలో కొన్ని ఉత్పత్తులను కలపాలి.

ఇంటిని ప్రతిరోజూ మాప్ చేసేవారు ఎంతోమంది. ఇలా చేయడం వల్ల ఫ్లోర్ పరిశుభ్రంగా ఉండటమే కాదు దానిపై బ్యాక్టీరియా కూడా చేరదు. వేసవిలో ఈగలు అధికంగా చేరుతాయి. ఈగల నుంచి తప్పించుకోవాలంటే ప్రతి రోజు మాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మాఫింగ్ వల్ల ఇల్లు పూర్తిగా శుభ్రపడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతిరోజు ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇల్లంతా సువాసన వచ్చేలాగా మార్చేసుకోవాలి. దీనికోసం మీరు మాప్ చేసే నీటిలో ఎలాంటివి కలపాలో తెలుసుకోండి.
బేకింగ్ సోడా
ఫ్లోర్ మీద చాలా జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి. ఇంట్లో వాటర్ మెలన్ తింటే దాని జ్యూస్ కిందపడినా చాలు జిడ్డుగా మారిపోతుంది. అలాగే మామిడి జ్యూస్ కిందపడిన కూడా పురుగులు, చీమలు, ఈగలు చేరుకుంటాయి. కాబట్టి జిడ్డు మరకలు పోవాలంటే మాప్ చేసే నీటిలో బేకింగ్ సోడాను కలపండి. ఇది నూనె, జిడ్డు మరకలు త్వరగా వదిలిపోయేలా చేస్తుంది.
నిమ్మరసం
విటమిన్ సి అధికంగా ఉండే జ్యూస్ ఇది. సహజ క్లీనింగ్ ఏజెంట్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి బ్యాక్టీరియాను చంపే శక్తి దీనికి ఉంటుంది. మీరు మాప్ చేసే నీటిలో నిమ్మరసాన్ని కలిపి మీ ఫ్లోర్ ను తుడిస్తే మంచి వాసనతో పాటు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. రెండు నిమ్మకాయలు పిండి సగం బకెట్ నీళ్లలో వేసి మాప్ చేయండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
వెజిటబుల్ నూనెలు
పిప్పర్మెంట్ నూనె, లెమన్ నూనె వంటి మంచి వాసన వచ్చే నూనెలు ఎన్నో ఉంటాయి. సగం నీళ్లు ఉన్న బకెట్లో రెండు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్లోర్ ను ఈ నీటితో మాప్ పెట్టుకోవాలి. ఇది ఇల్లంతా సువాసనలు వచ్చేలా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈగలు కూడా రాకుండా ఉంటాయి.
వెనిగర్
ఇంటిని క్లీన్ చేసేందుకు వెనిగర్ ను కూడా వాడవచ్చు. అర బకెట్ నీళ్లలో పావుకప్పు వెనిగర్ కలిపి బాగా కలపండి. ఇప్పుడు ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది జిడ్డును వదిలించి మంచి సువాసన వచ్చేలా చేస్తుంది. కిచెన్ శుభ్రం చేసేందుకు వెనిగర్ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి వెనిగర్ ను వాడి చూడండి. మీకు ఇదెంత చక్కగా పనిచేస్తుందో అర్థం అవుతుంది.
ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఎక్కువ నీటితో మాప్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది తక్కువ నీటితోనే మాప్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక రూమ్ అంతా ఒక్కసారే క్లీన్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మాప్ ను నీటిలో ముంచి పిండి రెండు మూడు సార్లు గదిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము ధూళి తొలగిపోతుంది. బ్యాక్టీరియా, ఈగలు వంటివి ఇంట్లో చేరకుండా ఉంటాయి.
సంబంధిత కథనం