







Best Web Hosting Provider In India 2024

దేవతల ఆహారంగా ఏ ఆహారాన్ని పిలుస్తారో తెలుసా? అదెంటే మీకు కూడా ఇష్టమే
దేవతల ఆహారంగా దేనికి పేరు ఉందో తెలుసా? కోకూ. అంటే చాక్లెట్ ను తయారు చేసే కోకో గింజలు అన్నమాట. దీన్ని దేవతల ఆహారంగా ఎందుకు పిలుస్తారో తెలుసుకోండి.

చాక్లెట్లను తయారు చేయడానికి కోకో గింజలనే వినియోగిస్తారు. ఇవి లేకపోతే చాక్లెట్ తయారు కాదు. దీని రుచి పోషకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అందుకే దీన్ని దేవతల ఆహారంగా చెప్పుకుంటారు. ఆగ్నేయాసియా, మధ్య అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ప్రాంతాలలో ఎక్కువగా ఈ చెట్టు కనిపిస్తుంది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం కోకో గింజలు వాటి రుచికి ఎంతో ప్రసిద్ధి చెందాయి. చరిత్రలో పురాతన కాలంలో కూడా కోకో పానీయంగా పిలుచుకునే చాక్లెట్ ఉండేదని చెప్పుకుంటారు. ఇప్పట్లా చాక్లెట్ గట్టిగా కాకుండా పురాతన కాలంలో పానీయం రూపంలో ఉండేదని… దాన్ని దేవతలకు సమర్పించే వారని అంటారు. అందుకే కోకో గింజలతో తయారయ్యే చాక్లెట్ ను కూడా దేవతల ఆహారంగా చెప్పుకుంటారు.
డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిజానికి కోకో గింజలతో తయారయ్యే అసలైన చాక్లెట్… డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ ముక్క ప్రతిరోజూ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడం, గుండె ఆరోగ్యం అదుపులో ఉండడం, ప్రీబయోటిక్ ప్రభావాలు, గ్లూకోస్ స్థాయిలు పెరగకపోవడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కోకో మొక్కలు మొదట ఎక్కడ పండించారు?
కోకో మొక్కలను చరిత్రలో ఎవరు మొదటిసారి పండించారో తెలుసుకునేందుకు ఎన్నో అధ్యయనాలు జరిగాయి. మొదటిసారి దక్షిణ అమెరికాలో కోకో మొక్కలను పెంచారని చెప్పుకుంటారు. మయన్ తెగలకు చెందినవారు వీటిని పెంచి ఆహారంగా తినేవారని అంటారు. వారు వేడి నీటితో ఈ కోకో గింజల పొడిని కలిపి కోకో పానీయాన్ని తయారు చేసుకునే వారిని కూడా చెబుతారు. దాని రుచికి దాసోహం అయిపోయిన మయన్లు దీన్ని దేవతల ఆహారంగా పిలుచుకునేవారు.
వారి తర్వాత కోకో చెట్టును 1502లో యూరోపియన్ క్రిస్టోఫర్ కొలంబస్ చూశారు. అతను కోకో గింజలను తనతో పాటు తీసుకెళ్లారు. దీన్ని బాదంపప్పుగా కూడా అనుకునేవారు.
కొలంబస్ వల్ల కోకో మొక్కలు యూరప్ లో అడుగుపెట్టాయి. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా కోకో ప్రయాణం చేసింది. అలా ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల కోకో చెట్లు పెంచుతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని ప్రధాన ఆహారాలలో చాక్లెట్ కూడా ఒకటిగా మారిపోవడంతో కోకో మార్కెట్ విపరీతంగా పెరిగింది.
కోకోలో ఉండే పోషక విలువలు
కోకోలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి. అందుకే డార్క్ చాక్లెట్లో కోకోలో ఉండే పోషకాలు ఎక్కువనే చెబుతారు. అదే సాధారణ చాక్లెట్లో ఇతర ఆహారాలు కూడా కలుపుతారు. కాబట్టి కోకో పరిమాణం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి కోకో పొడి లోని పోషకాలు పుష్కలంగా శరీరంలో చేరాలి. అంటే డార్క్ చాక్లెట్ తినాలి. దీనిలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకోవడానికి ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడానికి, కణాల నష్టాన్ని ఆపడానికి కోకోలోని ఫ్లేవనాయిడ్లు సహకరిస్తాయి.
కోకో పొడితో చేసిన ఆహారాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. కోకోపొడితో చేసిన డార్క్ చాక్లెట్ తింటే సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలు మెదడులో పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు తగ్గుతాయి. కోకోలోని ఫ్లేవనాయిడలు జ్ఞాపకశక్తి, దృష్టి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
సంబంధిత కథనం