







Best Web Hosting Provider In India 2024

OTT Thriller: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్‍బస్టర్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Officer on Duty Streaming: థియేటర్లలో బ్లాక్‍బస్టర్ సాధించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

మరో సూపర్ హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయిపోయింది. బ్లాక్‍బస్టర్ సాధించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కుంచకో బోబన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న మలయాళం రిలీజై బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మార్చి 14 తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు మరొక్క రోజులో ఓటీటీలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ అడుగుపెట్టనుంది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. మంచి హిట్ సాధించటంతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై బాగా బజ్ నడిచింది. మంచి హైప్ మధ్యే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తోంది.
మరికొన్ని గంటల్లో..
ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఈ అర్ధరాత్రి (మార్చి 20) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.
ఓటీటీలోనూ అదరగొడుతుందా!
ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. థియేటర్లలో ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది ఈ చిత్రాన్ని ప్రశంసించారు. పాపులర్ కావటంతో తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో విడుదలైన వారానికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తోంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుండడం కూడా ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కేందుకు తోడ్పడనుంది. ఓటీటీలోనూ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ అదరగొట్టే ఛాన్స్ ఉంది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రాన్ని డైరెక్టర్ జితూ అష్రఫ్ తెరకెక్కించారు. కుంచకో బోబన్‍తో పాటు ప్రియమణి లీడ్ రోల్ చేశారు. సీఐ హరిశంకర్ పాత్రలో బోబన్ నటించారు. చిక్కుముడులు ఉన్న ఓ కేసును దర్యాప్తు చేయడం చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. ఆడుకాలం నరేన్, జగదీశ్, విశాఖ్ నాయర్ కూడా కీలకపాత్రలు పోషించారు.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం రూ.12కోట్ల బడ్జెట్‍తో రూపొంది.. సుమారు రూ.50కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ సాధించింది. బంగారు చైన్ చోరీ, ఓ అమ్మాయి, పోలీస్ ఆఫీసర్ మరణాలు, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ చిత్రం స్టోరీ నడుస్తుంది. ఈ మూవీని మార్టిన్ ప్రకత్ ఫిల్మ్స్ పతాకంపై మార్టిన్ ప్రకత్, రంజిత్ నాయర్, సిబీ చవారా ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం